హై కోర్టు కసబ్‌కి ఉరుశిక్ష ఖరారు చెసిందని వినగానే వాడు నవ్వాడని ఈ ఉదయం న్యూస్ పేపర్లలో వార్త చూసి నాకు ఒక క్షణం ఆశ్చర్యమేసింది. మరణ శిక్ష పడ్డ వాడెవడికైనా అలా నవ్వు వస్తుందా? ఎంతో వేదాంత పూరిత ధృక్కోణం ఉండేవాళ్ళకో, భగత్ సింగ్ లాంటి వారిలాగా ఉదాత్తమైన ఆశయం కోసం ఉరికంబమెక్కబోయేవాళ్ళకో అలా నవ్వు వస్తుంది కానీ ఈ నీచుడికి ఎందుకొచ్చిందా అని కొంత ఆశ్చర్యపోయినా కాస్సేపటికి నాకర్ధమయింది వాడికెందుకు నవ్వు వచ్చిందో. అయినా పైకి ఎలా నవ్వినా కసబ్ మాత్రం లోపల్లోపల పడి పడీ విరగనవ్వుకొని ఉంటాడు. ఎందుకలాగా అనుకొంటున్నారా కొంచెం ఈ వాస్తవాలు చూడండి.
కసబ్ అనే వాడు పరాయి దేశం నుండి వచ్చి తుపాకీ చేత బట్టుకొని ముంబయి నగరంలో ముందూ వెనుకా చూడకుండా ఆడ మగా పిల్లా జెల్లా ముసలి ముతకా ఎవరు కనిపిస్తె వాళ్ళని తుపాకి గుళ్ళకి ఆహుతి చేసి మారణ హోమం సాగిస్తే వాడిని మొత్తానికి పట్టుకున్నారు. వచ్చిన ముష్కరుల మూకలో ఒకడినయినా ప్రాణాలతో పట్టుకుంటే వాళ్ళ వెనుక ఎవరున్నారో ప్రపంచానికి ఋజువు చేయవచ్చు అన్న ఆలోచనతో. బాగావుంది. వాడిని అరెస్టు చేయగానే ఆర్థర్ రోడ్ జైలుకి తరలించి అక్కడ భద్రత సరిగా లేదని నిపుణులని సంప్రదించి ఒక హై సెక్యూరిటీ సెల్ ఈ నీచుడి కోసం ప్రత్యేకంగా నిర్మించారు. బంబులు వేసినా ఆ సెల్లుకీ అందులో ఉన్న ఈ నికృష్టుడికీ ఏమాత్రం హాని జరగనంత పటిష్టంగా కట్టారట ఆ సెల్లుని.
ఇక వాడికి ఎప్పుడైనా అనారోగ్యం కలిగితే అడ్మిట్ చేయడానికని జేజే ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు నిర్మించి అక్కడ సెక్యూరిటీ కష్టమని కసబ్ ఉండే జైలులోనే ఒక హాస్పిటల్ కూడా నిర్మించారు. వీడి ఆరోగ్యం చూసుకోవడానికి ఇద్దరు డాక్టర్లు నిరంతరం వీడిని పర్యవేక్షిస్తూ ఉంటారు. రోజుకి 9 లక్షల రూపాయల చొప్పున ఇప్పటికి మనవాళ్ళు వీడిపైన పెట్టిన ఖర్చు అక్షరాలా 45 కోట్లు. ఇది ఇంతటితో అయిపోలేదు. మన ప్రభుత్వ ఖర్చుతో రేపు సుప్రీమ్ కోర్టుకి అప్పీలు చేసి అక్కడా ఉరిశిక్ష విధించినా కథ సమాప్తం అవదు.
వాడు రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇప్పటికే క్షమాభిక్ష కోసం రాష్ట్రపతి వద్ద పెండింగులో ఉన్న దరఖాస్తులన్నీ క్లియర్ అయ్యి ఈ నీచుడి వంతు వచ్చి అప్పటికీ మన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తప్ప ఆ ఉరి అమలవదు. అప్పటికి అధికారంలో ఉన్న పార్టీకి మైనారిటీ ఓట్లు అవసరమైతే ఏ రంజాన్‌నాడో, మొహర్రం నాడో ఈ వెధవకి క్షమా భిక్ష లభించినా లభించవచ్చు. లేదా ఈ తంతు మొత్తం ముగిసేలోగా కూర్చుని తినడం వల్ల వంట్లో కొవ్వు ఎక్కువై బీపీ, షుగర్ లాంటి జబ్బులొచ్చి ఏ గుండె పోటుతోనో సహజ మరణం వచ్చి చచ్చినా చావొచ్చు.
"పరాయి దేశం నుండి వచ్చి జనాన్ని కుక్కల్ని కాల్చినట్టు కాలిస్తే నాకు ఇంత రాచ మర్యాదలు ఇస్తున్న మిమ్మల్ని ఏమనాలో నా కర్ధం కావడం లేదు" అని మనసులో అనుకొని లోలోపల నవ్వుకొని ఉంటాడు ఈ కసబ్ అనే పిచ్చి కుక్క.
6 comments:
అసలు ఈ కసబ్ పైన ఆరోపించబడ్డది తీవ్రవాద నేరం. అల్లాంటప్పుడు ఏకంగా సుప్రీంకోర్టులోనే విచారణ చేపట్టుండాల్సింది. ఇలాంటివాళ్ళని కూడా క్షమించడానికి ఏ మానవీయకోణాలుంటాయని క్షమాభిక్ష ద్వారం తెరిచివుంచాలి? మనం మన న్యాయ వ్యవస్తను ఏ అమెరికాకో outsource చెయ్యాల్సిన అవసరం ఎంతైనా వుంది.
సుప్రీము కోర్టులో ఉరి శిక్ష ఖరారైనా కూడా అది అమలు చేయడానికి కనీసం 10 ఏల్లు పడుతుందని ఎక్కడో చదివా. నవ్వక ఏం చేస్తాడు చెప్పండి.
well said
అసలు మన చట్టాల్లో విధానాల్లో మార్పులు రావాలి. లేకపోతే వీడి కేసు నేరుగా సుప్రీం కోర్టులో కాకుండా కింది స్థాయి కోర్టుల నుంచి ఎందుకు మొదలెట్టాలి? అసలు రాష్ట్రపతి దగ్గర ఇన్ని applications ఎందుకు పెండింగ్ లో ఉండాలి? తొందరగా తేల్ఛలేరా?
దేశం లో తిండి లేక ఎంతో మంది ఆకలి చావులు చస్తూ ఉంటే, నాలాంటోళ్ళు కట్టిన tax తో ఇలాంటి దేశద్రోహులను మేపుతున్నారు. బహుశా దీన్ని వ్యతిరేకిస్తూ ముందు మనం ఉద్యమం చేయాలేమో.
మీ చివరి వాక్యం బాగుంది.
వాడి టికెట్ Waitlist నుండి RAC కి వచ్చినందుకు వాడికి నవ్వు వచ్చి ఉంటుంది.
Post a Comment