నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, February 20, 2011

ఎయిడ్స్ జబ్బు ఎక్కించడమే లక్ష్యంగా వంద మందితో శృంగారం జరిపిన పురుష ద్వేషి


ముంబయి నగరంలో గ్రాంట్ రోడ్‌లో డాక్టర్ I.S. గిలాడా క్లినిక్ ఉంది. ఎయిడ్స్ పేషంట్లకు చికిత్స మరియు కౌన్సిలింగ్ చేస్తుంటాడాయన. ఎయిడ్స్ అనేది శరీరంకన్నా మనసుని ఎక్కువగా డామేజ్ చేస్తుంది అని నమ్ముతాడాయన. అందుకే HIV పేషంట్లకి చలా ఓపిగ్గా కౌన్సిలింగ్ ఇస్తాడు గిలాడా. ఒకసారి ఆయన దగ్గరకు వచ్చిన ఒక పాతికేళ్ళ యువతి చెప్పిన నిజం విని షాకయ్యాడు ఆయన. 


 
ఆమె తన భర్త నుంచి తనకి ఎయిడ్స్ అంటుకున్నాక అతనికి విడాకులిచ్చి అక్కడక్కడా మధ్య తరగతి, ఉన్నత తరగతి ఇళ్ళలొ పని చేస్తూ జీవనం సాగిస్తూ గత రెండు నెలలుగా గిలాడా క్లినిక్‌కి వైద్యం కోసం వస్తూంది. క్రమేపీ ఆమెకి తన మీద నమ్మకం కలిగించాడు గిలాడా ఓపిగ్గా ఆమె చెప్పేదంతా సానుభూతితో వినడం ద్వారా. గిలాడామీద పూర్తి నమ్మకం ఏర్పడ్డాక ఆమె అతనికి ఒక బాంబు లాంటి నిజం చెప్పింది.


తన భర్త అతనికి ఎయిడ్స్ ఉందని తెలిసి తనతో సెక్స్‌లో పాల్గొని తనకు ఆ జబ్బు అంటించాడని తెలిసి ఆమెకి పురుష జాతి అంటేనే ద్వేష భావం పుట్టి, మగ వాళ్ళందరి మీదా పగ తీర్చుకొనే ప్రయత్నంలో ఉందని ఆమెతో మాట్లాడాక అతనికి అర్ధమయ్యింది. ఆ మిషన్‌లో భాగంగా ఆమె ఇప్పటి వరకూ 100 మందికి పైగా మగ వారితో ౩౦౦ సార్లకి పైగా ఎటువంటి కండోమ్ లాంటి రక్షిత విధానాలు లేకుండా శృంగారంలో పాల్గొన్నానని ఆమె గిలాడాతో చెప్పింది.

 తనకి కావలసిన మగవాళ్ళ కోసం ఈ అమ్మడు తన యజమానులని, వాళ్ళ ఇంట్లో ఎవరయినా టీనేజ్ కుర్రాళ్ళని, వాళ్ళ ఫ్రెండ్స్‌ని, ఆటో,టాక్సీ డ్రైవర్లనీ ఇలా వల వెసి పట్టేదట. ఈ విషయాలు విని దిమ్మ తిరిగి మైండ్ బ్లాకయిన గిలాడా ప్రాంప్ట్‌గా విషయాన్ని National AIDS Control Organisation (NACO) వారికి తెలియ జేసాడు. ఆమెకి తగిన కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె మనఃస్థితిని సరయిన దారిలో పెడుతామని NACO అధికారులు చెప్పడం ఈ కథకి కొసమెరుపు.
 


***Tiimes of India వారి  వెబ్ సైట్‌లో ఈ స్టోరీకి వచ్చిన కామెంట్లలో ఒకటి అవేశపూరిత మైనది. తెలిసి తెలిసి 100 మందికి  జబ్బు అంటించిన ఆమెకి మరణమే తగిన శిక్ష అని ఆ కామెంటు. దానికి రెస్పాన్సుగా, తెలిసి తెలిసి ఫ్రీగా వస్తుందని ఆమెతో సెక్సులో పాల్గొన్న వారిది కూడా తప్పు అని ఒక రెస్పాన్సు. ఆకలితో ఉన్న వాడికి అన్నం పెడతానని ఎవరైనా పిలిస్తే ఆబగా పోయి తింటారు. అందులో విషం ఉందా లేదా అని చూస్తారా అని దీనికి మరో రెస్పాన్సు.  ఆకలేస్తే ఇంట్లో అన్నం తినాలి లేకపోతే మంచి హోటల్‌ని వెదికి చూసి పొయ్యి తినాలి. ఎవరంటే వాళ్ళు పిలిచి పెడతామనగానే  పొయ్యి తినడమేనా?

5 comments:

Anonymous said...

ఆకలేస్తే ఇంట్లో అన్నం తినాలి లేకపోతే మంచి హోటల్‌ని వెదికి చూసి పొయ్యి తినాలి. ఎవరంటే వాళ్ళు పిలిచి పెడతామనగానే పొయ్యి తినడమేనా?

మాష్టారూ..మీరు ఆలోచించే మాట్లాడుతున్నారా? AIDSకు మందులేదు నివారణ ఒక్కటే మార్గం. అది తెలిసీ అంతమందికి AIDS ఎక్కించడం హత్యా నేరంతో సమానమైంది అవుతుంది (చట్టపరంగా కాకపోవచ్చు). మగాడు సెక్సు కోసం పడిచచ్చే చిత్తకార్తె కుక్కే అనుకుందాం, దానికి శిక్ష మరణమా? లేక మరణం కంటే ఘోరమైన AIDS లాంటీ వ్యాధిని అంటించడమా? మానవత్వం ఏమూల కొద్దిగా మిగిలున్న వారైనా ఇలాంటి శిక్షలను ఒప్పుకోరు. సమర్ధించరు. దానికి తోడు, వాళ్ళేమైనా ఆమెను మానభంగం చేసారా? ఆమె కూడా ఒప్పుకుంటేనే కదా సెక్స్ చేశారు. మరి ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో జరిపే సెక్సు అసలు తప్పేకాదు. మరే తప్పు చేశారని వారికి ఈ శిక్ష. సెక్సు కేవలం వివాహ బంధములో మాత్రమే ఉండాలి, బయట ఉండకూడదు అనే నీతి సూక్తులు మీరు చెప్పాలనుకుంటే నాకే మాత్రం అభ్యంతరం లేదు. You are most welcome. కానీ, ఒక వ్యక్తి జీవితముతో ఆడుకుంటున్న ఒక సైకో చేసిన పనిని చూసిన తరువాత ఇలాంటీ నీతులు చెప్పడం మాత్రం దారుణం. Those men don't deserve this.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

సారీ!నా అభిప్రాయం క్లియర్‌గా చెప్పలెకపోయానేమో? ఈ అమ్మాయి సంగతి వదిలేసినా ఎంతో మంది తాము HIV పాజిటివ్ అని తెలియక శృంగారంలో పాల్గొనే వాళ్ళుంటారు. వారి వల్ల కూడా రిస్క్ ఉంటుంది. కాబట్టి సేఫ్ సెక్స్ పాటించాలన్నది నా అభిప్రాయం. ఒకే భాగస్వామితో పరిమితమ్ అయితే ఏ గొడవా ఉండదు కదా!

Anonymous said...

I agree with Akash.

Krishna, sorry you arguement is not valid.

Anonymous said...

Okka manishi chesina tappu ki magavaallu andari meeda dwesham penchukovadam aame tappu. Govt. roju ki padi sarlu AIDS gurinchi, safe sex gurinchi mottukuntunna Krishna garu annattu yekkada tintunnamo choosukokapovadam vaalla tappu. aavida ante telisi chesindi. ade AIDS undi ani teliyani vyakthi to ayina "tappudu" sambandhaalu pettukunte daani phalitham ilane untundi. oka vela yevaraina ilanti vaatini samardhinchaali / saaginchaali anukunte daaniki maargam kuda Govt. ads lo ne cheptunnaru kada...helmet vaadamani. kattubaatlu lekunna / jagratha teesukokunna ilante consequences face cheyyalsi untundi. ee situation lo tappu rendu parties di undi.

syedrafiq said...

Sir,
"రజనీ దెబ్బకి మైండ్ బ్లాకయిన అమితాబ్"
Post is very good