ఒకసారి దైవం అని నమ్మితే వాళ్ళ ప్రతి విషయానికి దైవత్వం ఆపాదించడం మానవ సహజం. కృష్ణుడు మట్టి తిన్నా, స్నానం చేస్తున్న ఆడపిల్లల చీరలు దాచి పెట్టినా అదంతా దైవత్వం అనే నమ్ముతాం. ఇప్పుడు సాయి బాబా విషయంలో అదే జరుగుతున్నది. తన చివరి జన్మ దిన వేడుకలలో ఎన్నడూ లేని విధంగా రెండు చేతులు జోడించి నమస్కరించిన విషయాన్ని ఇప్పుడు వెలికి తీసి తన మరణం సంగతి ఆయనకు ముందుగానే తెలుసు కాబట్టే అలా తన భక్తులకు వీడ్కోలు చెప్పాడు. మనమే దానిని గమనించలేక పోయాము అని చెప్తున్నారు ఇప్పుడు.
ఇవన్నీ పక్కన పెడితే, తను 96 సంవత్సరాలు బతుకుతానని చెప్పి ముందుగానే మరణించడమేమిటి అని బాబా విమర్శకులు అంటున్నారు. వీళ్ళ నోళ్ళు మూయించడానికి ఆ మధ్య ఓ పెద్ద మనిషి ఒక టీవీ చానల్లో నానా తంటాలు పడడం చూశాను. బాబా చెప్పింది ఇంగ్లీషు కేలెండర్ అనుసరించి కాదని చాంద్రమాసాన్ని బట్టి అని, ఆ విధంగా లెక్క కడితే 96 సంవత్సరాలకే బాబా మరణం సంభవించింది అని ఆయన ఆ చానల్ బల్ల గుద్ది మరీ చెప్పాడు. లెక్కల్లో బాగా పూర్ కాబట్టి ఆ షో అయిపోయాక కేల్క్యులేటర్ తీసుకొని లెక్క కట్టి చూశాను.
ఆయన పుట్టింది 1926 నవంబర్లో, మరణించింది 2011 ఏప్రిల్లో. మొత్తం 84 సంవత్సరాలు, 6 నెలలు. సంవత్సరానికి 365 రోజుల చొప్పున లెక్కేస్తే ఆయన జీవితం 30,927 రోజులు. ఓ 21 లీపు సంవత్సరాలగ్గానూ 21 రోజులు కలిపితే 30,948 రోజులు. చాంద్ర మాసంలో ఒక నెలకి 29 రోజుల చొప్పున లెక్కేసి ఈ సంఖ్యని 29 తో భాగిస్తే 1067.17 వస్తుంది. రౌండాఫ్ చేసి 1068 మాసాలు అనుకుందాం. ఆయన భూమ్మీద జీవించిన 1068 మాసాలను సంవత్సరాలలో మార్చడానికి దీనిని 12 తో భాగిస్తే 89 వస్తుంది. అంటే ఈ విధంగా చూసినా బాబా వయసుచనిపోయే నాటికి 89 యేళ్ళే.
మరి దీనిని 96 చేయడం ఎలా?
కేలెండర్ అన్నది ఇంగ్లీషోడికి, తెలుగోడికే స్వంతం కాదు. భూమ్మీద నాగరికత ఫరిఢవిల్లిన ప్రతి చోటా ఒక కేలెండర్ ఉంది. పదండి వెతుకుదాం. అన్ని కేలెండర్లనూ వెలికి తీద్దాం. ఈ మధ్య యుగాంతం అని మాయన్ కేలెండర్ బాగా పాపులరయింది. దాన్ని ఓ లుక్కేద్దాం. అలాగే సుమేరియన్, హరప్పా, మొహెంజొదారో, ఈజిప్షియన్, రోమన్, గ్రీకు, ఆఫ్రికన్, అమెరికన్ ఇండియన్ ఇలా ఎక్కడోచోట 30,948 రోజులని 96 సంవత్సరాలుగా లెక్క కట్టే కేలెండర్ దొరక్కపోదు. దాని ఆధారంగా తను 96 సంవత్సరాలు బతుకుతానని బాబా చెప్పారు అని బుకాయిద్దాం.
డొంకతిరుగుడు, దొడ్డి దారి పద్ధతిలాగా ఉందా? అవును నాకూ అలాగే అనిపిస్తుంది. సరే, దీన్ని వదిలేయండి. అసలు సిసలైన రాజ మార్గం లాంటి పద్ధతి ఒకటి చూడండి.
భగవంతుడు ఎప్పుడైనా తానొక్కడే అవతారమెత్తాడా? తనతో బాటు ఆదిశేషుని, తన శంఖు చక్రాలనూ లక్ష్మణుడిగా, బలరాముడిగా తోడు తెచ్చుకున్నాడుగా. కలియుగంలో వాళ్ళను భూమ్మీదకి తెచ్చి బాధ పెట్టడమెందుకని, తానొక్కడే వేంచేయదలచి, భూమ్మీద తన అవతారానికి తగిన పరిస్థితులను సృష్టించే నిమిత్తం తన అవతరణకి పన్నెండేళ్ళ ముందే భూమ్మీదకొచ్చి సత్య సాయి అవతారానికి తగిన పరిస్థితులను కల్పించి అప్పుడు ఒక శుభ ముహూర్తాన టక్కున ఈశ్వరాంబ కడుపులో దూరి భూమ్మీద పుట్టాడు. ఈ లెఖ్ఖన సాయి బాబా సత్య నారాయణ రాజుగా జన్మించే నాటికే ఆయన వయసు 12.
మరణించే నాటికి వయసు 84 తో ఈ 12 కలిపితే 96 కాలేదూ? నీకూ నాకూ ఆయన భూమ్మీద పడ్డనాటి నుంచే లెఖ్క పెట్టడం తెలుసు. భగవాన్కి తాను భూ గ్రహం మీద కొచ్చిన నాటి నుంచే లెఖ్క కాబట్టి ఆయన ఆ విధంగా చెప్పారు. ఎలా ఉంది దెబ్బ. ఇంగ్లీషు కేలెండర్ అని గొంతు చించేకునే మూర్ఖపు ముండాకొడుకులని ఆ ఇంగ్లీషు కేలెండర్తోనే కొట్టాం కదూ?
సరే బాబా గారు తన జన్మానికి పన్నెండేళ్ళ ముందే భూమ్మీద కొచ్చిన విషయం ఎలా తెలుస్తుంది అంటే అది చాలా సింపుల్. ఏ ట్రస్టు మెంబర్కో కలలో బాబా కనపడి ఈ విషయం సెలవిస్తే సరి!
24 comments:
అహాహా.. మహాప్రభో, ఏమి ఙ్ఞానం,ఏమి ఙ్ఞానం. మాలాంటీ అఙ్ఞాణుల అఙ్ఞానానికి మీరిచ్చిన దివ్య సందేశం అంత త్వరగా ఎక్కదు. అయినా సరే మీకు ఇదే నా సలాం.
first we must forget that no GOD will take human womb toget rise on the earth. so forget about the godness of any one . only we must kee[ the goodness of the such a people. their age or life span are immeterial. previously they /he may have some con traversal life but from past 15 years his/their works are use ful to the humans. reagarding the trustees, yes most of the humans will develop a kind of interesto on money when it is visible physically. however donations weather used completely or partially only time or real god knows. but so many thousands of people are got benefited through the works of baba, so he my have the quality of a goodman, which might have gave him the fame of GOD.
సత్యసాయి 30,834 రోజులు జీవించారట. నక్షత్ర ఆవర్తన పధ్ధతిలో సంవత్సరానికి 324 రోజులట. ఆ విధంగా చూస్తే వారు 96 సంవత్సరాలు వరకూ జీవించినట్లు అవుతుందట. అధిక మాసములు ఇలా కూడా చూడాల్సి ఉంటుందట. ఒక సంవత్సరానికి 324 రోజులు అయితే 96 సంవత్సరాలకు ఎన్ని రోజులు ? అనగా 96 ఇంటూ 324 చేస్తే............31,104. రోజులు అని వచ్చింది. అంటే 96 సంవత్సరాలకు 31,104 రోజులయినప్పుడు వారు చెప్పినట్లు లెక్క సరిపోయినట్లుంది. నాకు పెద్దగా లెక్కలు రావండి. నక్షత్ర ఆవర్తన పధ్ధతి గురించి కూడా తెలియదు. పండితులు చెప్పినదాన్ని బట్టి..................అజ్ఞాత.
బాబూ ప౦డిత పుత్రా, పెద్దగా లెక్కలు రాక పోతే ఏ౦ గాని, ఇకను౦డి నీ వయసు అట్టాగ నే లెక్కెట్టుకో.
సత్యసాఇబాబా దేవుడా? అంటే మహిమలన్నారు సాగినంతకాలం. అదంతా ట్రాష్ అని తేలింతర్వాత ఆస్పత్రి కట్టిచ్చినాడు కదా అన్నారు. అది కూడా ఎవరైనా చేయచ్చు కదా అంటే అన్నికోట్లమందిని అట్రాక్ట్ చేశాడన్నారు. అతని విమర్శకులయిన వేరే బాబాలకు కూడా కోట్లలో భక్తులున్నారు కదా అంటే తూచ్ అంటున్నరు.
ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఇంకా సులభం. ఆయన కల్లో కనిపించిండు అంటే చాలు. ఏదైనా నిజమైపోతుంది.
Good analysis...
ఐతే ఏంటంటావ్? నీలాంటి టైంపాస్ బ్లాగ్బేవార్స్ గాళ్ళు చెప్పింది ఇనాలా?
జై సాయి రాం
సాయి రాం సాయి రాం సాయి రాం రాం రాం.
సాయే సత్యం, సాయే దేవుడు, సాయి ఇలాంటి పాపులను అనుగ్రహించుటకు మళ్ళీ అవతరించును.
"సాయి ఇలాంటి పాపులను అనుగ్రహించుటకు మళ్ళీ అవతరించును"
Have a heart, India suffered enough torture in 86 years!
Jai Kovoor, jai PC Sorcar!
అజ్ఞాత గారూ, మీరు పండితపుత్ర ......... అని నన్ను ఏ అర్ధంతో అన్నా సరే, కృతజ్ఞతలు.. నేను ఒక సామాన్య వ్యక్తిని. నాలాంటివాళ్ళు వయసును ఏ ప్రకారం లెక్క వేసుకున్నా వచ్చే నష్టమేమీ లేదండి.. సరే, కొందరు తమ పుట్టినరోజును నక్షత్రం ప్రకారం జరుపుకుంటారు. కొందరు ఇంగ్లీష్ తేదీ ప్రకారం జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల వాళ్ళు ఉగాదిని చాంద్రమానం ప్రకారం, కొందరు సౌరమానం ప్రకారం జరుపుకుంటారు. . ఇలా రకరకాల పధ్ధతులు ఉన్నాయి.
ఏ కాలేండర్ వాడినా తప్పులేదు లెక్క సరిపోతుంది ఆ కాలెండర్ ప్రకారం. కాని బాబాగారి విషయంలో విచిత్రమేమంటే, పుట్టిన తేదీన ప్రతీసంవత్సరం యింగ్లీష్ కాలండర్ తోనే జరుపుకున్నరు. అంటే పుట్టుకతేదీకి ఒక కాలమానం, చావుకు వేరే కాలమానం. మాథ్స్ మళ్ళి చదవాలోమో వీరి లెక్కలు తగలెయ్య!
దానిదేముంది. మనం జనవరి 1 జరుపుకుంటాము. ఉగాది పండుగ జరుపుకుంటాము. ఎందుకు రెండు రకాలు ? అనుకోవటం లేదు కదా ! పెద్దవాళ్ళు తమ మరణం గురించి సూటిగా చెప్పకపోవచ్చు కూడా. దానికి రకరకాల కారణాలు ఉంటాయి.. అందుకే ఈ మార్గం ఎంచుకున్నారేమో !
కృష్ణ గారు, మొన్న నే ఎక్కడో చదివాను - సత్య సాయి బాబా గారు ఎప్పుడూ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అని. అంటే ఎవరో జబ్బు పడ్డ వ్యక్తికి నీ జబ్బ్బు నా మహిమ వల్ల నయం అయిపోతుంది అని చెబితే వారికి డాక్టర్ ట్రీట్మెంట్ వల్ల జబ్బు నయం అవ్వడం లాంటి మాటలు కాదు. మీకు, నాకు, మన లాంటి బాబాలను గుడ్డిగా నమ్మని (భక్తాగ్రేసరుల దృష్టి లో) దైవ ద్రోహులకి తెలిసే విధం గా ససాక్ష్యం గా నిలబెట్టుకోలేదు అని. ఆయన ఎవరిని అయినా రెండు రోజుల్లో కలుస్తాను అని చెప్పి చాలా రోజులు కలవకపోవడం లేదా అసలు కలవకపోవడం లాంటి వి చేసేవారట. దానికి వారి భక్త శిఖామణుల భాష్యం - వారి కాలమానం వేరు, మన కాలమానం వేరు. భగవంతుడి లెఖ్ఖ లో రెండు రోజులు అంటే మన లెఖ్ఖ లో రెండు రోజులు కాదు అని. అది అర్ధం చేసుకోకుండా మీరు ఇలా బాబా గారి మీద ఇలాంటి పోస్ట్ రాస్తారా? హన్నా!
గురువుని కూడా దైవసమానంగా పూజిస్తారు చాలామంది. బాబా ప్రవచనాలు వినటం, తద్వారా మంచిని ఆచరించటం ద్వారా ఆ దైవం దయ వల్ల జీవితంలో ఎన్నోసార్లు కష్టాలనుంచి గట్టెక్కామని చెప్పినవాళ్ళూ చాలామందే ఉన్నారు.. ఎవరి మాట నమ్మాలన్నది ఎవరిష్టం వాళ్ళది.. డాక్టర్ కూడా నీ జబ్బు రెండు రోజుల్లో నయమయి పోతుందని మందులు ఇస్తారు. ఆ మందులు సరిగ్గా వాడకపోవటం, సరిగ్గా పధ్యం పాటించకపోవటం వల్ల కూడా జబ్బు తగ్గకపోవచ్చు. అలాగే కొంతమందికి కష్టాలు పోలేదంటే దానికి చాలా కారణాలుంటాయి. ఇవన్నీ రాయాలంటే బ్లాగులో చాలా స్థలం తీసుకుంటోంది. సోదరుడు కృష్ణ గారు ఏమనుకుంటారో ! అందుకని నేను..........
@జనవరి ఒకటి జరుపుకుంటాము, ఉగాది జరుపుకుంటాము.
>>>
మరి బాబాగారి ప్రతి పుట్టినారోజునాడు (యింగ్లీష్ కాలమానంప్రకారం) తెల్లబట్టలు మాత్రమే వేసుకుంటారని వినికిడి. మరి బాబాగారు 94వ,95వ పుట్టినరోజు సంబరాలు చేసుకోలేదేమిటి? ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందేశంకూడా యివ్వడం కూడా ఆయిన ఆనవాయితీ కాదా? మరి మన లాంటి మేధావులకి అయిన యిది నా 85 వ పుట్టిన సంవత్సరం కాదు అని జ్ఞానోపదేశం చేయలేదేమిటి ఏనాడు?
@ఆయన ఎవరిని అయినా రెండు రోజుల్లో కలుస్తాను అని చెప్పి చాలా రోజులు కలవకపోవడం
>>>
బాబాగారు వేరే కాలమానం ప్రకారం నడుస్తున్నార్నుకుందా కాసేపు? మరి వారి భక్తులకు యింగ్లీష్/తెలుగు కాలామానే వాడుతున్నారు, ఆ విధముగానే స్వామి వారి పుట్టినరోజు పండగలూ చేస్తున్నారు. మరి రోండు రోజులలో కలుస్తానంటే భక్తులకు వారి భావ్యం అర్థం అవుతుందేననే అనుకోవాలా?
బాబాగారోక్కరే ఫాలో అయ్యే ఆ కాలమాన కిటుకు బాబాగారికి మరియు కొద్దిమంది వారి ప్రియాతిప్రియమైన శిష్యులకు మాత్రమే తెలుసన్నమాట. సామాన్య జనాలు మాత్రమం ముక్కున వేలేసుకొనకమానరు. సారువారు వాడిన కాలమానం శిష్యులకు ఆయిన పోయినతరువాతగాని తెలియరాలా ఆకాలమానం!
నమ్మండి ఎవరూ కాదనరు.. గుడ్డిగా మూఢంగా కిందపడినా గెలుపు నాదే అన్నట్లు వాదించకండి.
@Anonymous: అయ్యో! పుట్టపర్తి బాబా గారు సామాన్య డాక్టర్ల కంటే చాలా గొప్ప వారు అనుకున్నానే! కాదా? అయితే ఇంక అనేందుకు ఏమి ఉంది?
ఇట్లు
మీ పై anonymous :-)
యురేకా.. నాకు నక్షత్రావన పధ్ధతి కొత్తగా అర్థమైపోయిందహో!! క్రిష్ణ గారి లెక్క ప్రకారం బాబా వయసు 30927 రోజులు. మనకు 27 నక్షత్రాలు కదా. ఒక నక్షత్ర దర్శనాన్ని ఒక రోజు కింద లెక్క వేసుకుంటే అతను జీవించింది (30927/27)/12 సంవత్సరాలు. అంటే 95.45 years. అరె కొంచెం తక్కువైందే. మ్మ్ మ్మ్. కడుపులో ఉన్న కాలాన్ని కూడా కలుపుకుంటె సరిపోతాదిగదా.
బాబా దేవుడంటూ తెగ గొడవ చేస్తున్న మూర్ఖులారా. ఒకసారి మన పురాణాలు చదవండి. అష్టాదశ సిధ్ధులున్న ఏ వ్యక్తి అయినా కొన్ని మహత్యాలు చూపగలడు. అయినా అతను దేవుడు కాజాలడు. బాబా కూడా అలాంటి చిన్ని శక్తులతో కొందరి కలలోకి వచ్చి ఉండవచ్చు. లేదా మన చిరు తో సహా అందరూ కావాలని అబధ్ధాలు చెప్పి ఉండవచ్చు. అతను చేసిన సేవా కార్యక్రమాలకూ అధ్యాత్మిక ప్రవచనాలకూ ఓ గొప్ప గురువుగా లేదా సంఘ సేవకునిగా గౌరవించుకుందాం. అంతే గాని ఇలా ప్రతి ఒక్కరినీ దేవుడిని చేసుకుంటూ పోయి మరింత confusion create చెయ్యొద్దు.
అజ్ఞాన గారు, దేవుడు అంటే ఏమిటో మీరు, వాసయ్య గారు, ఈ తెగిన హవాయి సెప్పుదండ గారు కలిసి నిర్వచించండి.
నేను నా కమనీయం బ్లాగులో సత్యసాయిబాబా గురించి నాకు తెలిసిన విషయాలు రాసాను. మళ్ళీ అవన్నీ రాయనవసరం లేదు. వివాదాలలోకి దిగాదలుచుకోలేదు.ఆయన వయసు గురించి
మాత్రం చెప్తాను. ఉరవకొండహైస్కూల్ లో నేను ౭వ తరగతి చదివేప్పుడు ౧౯౪౦-౧౯౪౧లొ నాకు౧౦ ఏళ్ళు పూర్తయాయి.సాయిబాబా నాకు సేనియర్ క్లాసులో వుండే వాడు. కాని నాకన్నా ౫ లేక ౬ సం. పెద్దతూమాదోణప్ప ,(తెలుగు విశ్వవిద్యాలయంవైస్ చాన్సెలర్ ) నా క్లాస్మేట్ .,కానీ,నాకన్నా ౩ ఏళ్ళు పెద్ద.దీనికి కారణం ఏమంటే ,మాదివిద్యావంతుల కుటుంబం. అందువలన తొందరగా స్కూల్లో చేర్చి చదివించేవారు.ఆ కాలంలో ఆప్రాంతం చాలా వెనుకబడి వుండేది.చాలామంది లేటుగా స్కూల్లో చేరేవారు. అందువల్ల.బాబా పరమపదిన్చేసరికి ఆయనవయస్సు
౮౬ లేక ౮౭ ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను. =రమణారావు .ముద్దు
నేను నా కమనీయం బ్లాగులో సత్యసాయిబాబా గురించి నాకు తెలిసిన విషయాలు రాసాను. మళ్ళీ అవన్నీ రాయనవసరం లేదు. వివాదాలలోకి దిగాదలుచుకోలేదు.ఆయన వయసు గురించి
మాత్రం చెప్తాను. ఉరవకొండహైస్కూల్ లో నేను ౭వ తరగతి చదివేప్పుడు ౧౯౪౦-౧౯౪౧లొ నాకు౧౦ ఏళ్ళు పూర్తయాయి.సాయిబాబా నాకు సేనియర్ క్లాసులో వుండే వాడు. కాని నాకన్నా ౫ లేక ౬ సం. పెద్దతూమాదోణప్ప ,(తెలుగు విశ్వవిద్యాలయంవైస్ చాన్సెలర్ ) నా క్లాస్మేట్ .,కానీ,నాకన్నా ౩ ఏళ్ళు పెద్ద.దీనికి కారణం ఏమంటే ,మాదివిద్యావంతుల కుటుంబం. అందువలన తొందరగా స్కూల్లో చేర్చి చదివించేవారు.ఆ కాలంలో ఆప్రాంతం చాలా వెనుకబడి వుండేది.చాలామంది లేటుగా స్కూల్లో చేరేవారు. అందువల్ల.బాబా పరమపదిన్చేసరికి ఆయనవయస్సు
౮౬ లేక ౮౭ ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను. =రమణారావు .ముద్దు
I am happy to find that there are people who do not believe Satya Sai is a god.
ayya ramaneeyam garoo, maaku telugu aksharaale kaani, ankelu raavu. maaboti agnaanulaku aa ankelu kaasta anglam lo rasi mammalni tarimpajeyavalasindigaa manavi.
మూర్ఖులు భగవంతున్ని , భగవతత్వాన్ని అర్దం చేసుకోవడం సాధ్యంకాదు. పాపం ఎంత సమయాన్ని వృధా చెసుకున్నరు ఈ బ్లాగ్ వ్రాయడానికి.
భగవాన్ బాబా గురించి ప్రాచీన గ్రంధాలలో..
భారత జ్యొతిష పరిశోధన మండలి, సభ్యుడు డా.ఇ వి వి శాస్త్రి గారు కొన్ని వేల సంవత్సరముల క్రితం ఋషుల చేత రచింపబడిన కొన్ని నాడీ గ్రంధాలని పరిశీలించి వాటిల్లో భగవాన్ సత్య సాయి బాబా గురించి చెప్పబడిన అద్భుతమైన విషయాలను ప్రకటించారు.
అగస్త్య నాడీ గ్రంధంలో "సత్య సాయి బాబా విద్యుత్ వేగంతో రోగ నివారణ చేస్తారు. సంకల్ప మాత్రం చేతనే ఆరోగ్యం ప్రసాదిస్తారు. అనేక విధ్యా సంస్థలను స్తాపిస్తారు. ధార్మిక జీవితం గురించిన గ్రంధాలెన్నో ప్రచురిస్తారు. మానవులలో ఆధ్యాత్మికతత్వాన్ని పెంపోదింపచేస్తారు. ధర్మోద్దరణ, ధర్మసంస్తాపన వారి ప్రధానమైన జీవీత ధ్యేయాలు. పూర్వ జన్మలో ఆయన షిరిడి సాయి బాబా! ఆయన మూర్తీభవించిన అనుభవము! ఆయన జగత్పిత!" అని పేర్కొనబడినది.
బుధ నాడిలో "బాబా నిరంతరము తన్మయత్వంలో నిమగ్నులై ఉంటారు!" అని ఉన్నది.
శుక్రనాడి గ్రంధంలో "ఆయన నివసించే మందిరానికి ప్రశాంతి నిలయమని పేరు ఉంటుంది. ఆయన సత్య ధర్మ ప్రేమ శాంతి మార్గాలలో శాశ్వతానందాన్ని లోకంలో స్థాపించి వ్యాపింప చేస్తారు. ఆయన మానవులకు సేవచేయటంలో ఎంతో ఆనందాన్ని పొందుతారు. ఆయన అవతార పురుషుడు!" అని వ్రాయబడి ఉంది.
శ్రీ చిన్నదురై బ్రహ్మనాడిని పరిశీలించి చెప్పిన అంశాలు సత్య సాయి నాధునికి అక్షరాలా సరిపోతాయి.- "ఆయన జీవితంలో గురువారములు పవిత్ర దినములు. ఆయన మానవ మాత్రుని వలె, పుట్టపర్తి నివాసి వలె బ్రాంతి కలిగిస్తుంటారు. ఆయన నారాయణుడను పేరు కలిగి ఉంటాడు. ఆయన శివశక్తి అంశమున ఉద్భవించిన అవతారము. షిరిడి సాయి పునరవతారము. చిత్రావతి తీరంలో, ప్రశాంత వాతావరణంలో ఆవిర్భవించిన ఆయన పరమ శాంతమూర్తి!" అని గ్రంధాలలో ఉంది.
పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో బద్రపరచబడిన నాడి గ్రంధంలో "తమిళ కేరల కర్నాటక దేశముల మద్య గల ఆంధ్రదేశంలో, చిత్రావతి నది తీరంలో భగవంతుడు అవతరిస్తాడు. ఆయన నామధేయము సత్యనారాయణ! ఆయన యోగీశ్వరుడు! పరమ యోగి, ఆయన నిద్రించడు" అని ఉంది.
పరాశర మహర్శి రచించిన పద్మ పురాణంలో "పర్తి అనే గ్రామంలో సత్యం అని పేరుతో ఒక వ్యక్తి ఉద్భవిస్తాడు. ఆయన 5 అడుగుల 3 అంగుళాల పొడవు ఉంటాడు. ఆయన యావత్తు ప్రపంచాన్ని ఆకర్శించే శక్తివంతమైన అయస్కాంతమువలె విలసిల్లుతాడు." అని ఉన్నదని ఆ పురాణాన్ని విల్సన్ అనే ఆంగ్లేయుడు ఇంగ్లీషులోనికి అనువాదము చేశాడని భగవాన్ బాబా తెలిపారు. జైమినీ భారతం సమగ్ర గ్రంధం హిమాలయాలలోని కొందరు విశిష్ట వ్యక్తుల దగ్గర ఉన్నదని, అందులో సత్య సాయి గురించి స్పష్టంగా ఉన్నదని కూడా ఉన్నదని భగవన్ బాబా తెలిపారు.
అరవింద మహర్శి మహా యోగి,మహా ఋషి, ఆయన పుదుచ్చేరిలోని తన ఆశ్రమంలో 1923 నుంది 1926 వరకు తీవ్ర తపస్సాధనలో నిమగ్నులై ఉన్నారు. మానవోద్దారణ కోసం భగవంతుడు మానవలోకంలో అవతరించాలని ఆయన ప్రాధిస్థున్నారు. 1926వ సంవత్సరము నవంబరు 24వ తేదీన ఆయన తపస్సమాధి లోనుండి బయటకి వచ్చి "నిన్నటి రోజున భగవంతుడు భూమి మీద అవతరించాడు! ఆయన తన అనంత దివ్య శక్తితో మానుష భావాలను ఊర్ధ్వముఖంగా మళ్ళించి దివ్య జ్యోతిని ప్రతి హృదయంలోను వెలిగిస్తాడు.అతని దివ్యవాణిని ప్రపంచములోని అశేష జనావళి వినగలదు." అని ప్రకటించారు. అరవింద మహర్శి ఉద్దేశించినది శ్రీ సత్య సాయి భగవానుణ్ణే అనేది ఆయన చెప్పిన జన్మ తిధిని బట్టి విశదమవుతున్నది.
మహమ్మదు ప్రవక్త ప్రసంగాలు ఆయన జీవిత కాలం తరువాత 700ల సంవత్సరాలకు "ది ఓషన్ ఆఫ్ లైట్" అనే 25 సంపుటాలుగా వెలువడినాయి. అందులో రాబోయే జగత్ప్రభువును గుర్తు పట్టదగిన అంశాలు ఇలా పేర్కొనబడి ఉన్నాయి. - "ఆయన శిరోజములు దట్టముగా ఉంటాయి. నుదురు విశాలంగా ఉంటుంది. బుగ్గ మీద పుట్టుమచ్చ ఉంటుంది.గడ్డము ఎప్పుడూ గీయబడి ఉంటుంది.ఆయన రెండు వస్త్రము ధరిస్తారు.ఆయన వస్త్రము అగ్నిజ్వాల వలె ఉంటుంది. ఆయన ముఖ కాంతి ఒకప్పుడూ రాగి రంగులో, ఒకప్పుడు బంగారు రంగులో, ఒకప్పుడు శ్యామల వర్ణంలో,ఒకప్పుడు చంద్రబింబం వలె ఉంటుంది. ఆయన ఆకృతి చిన్నదిగా ఉంటుంది. ఆయన పాదాలు స్త్రీ పాదాల వలె సుకుమారంగా ఉంటాయి. పుట్టుక నుంచి ప్రపంచములోని సర్వ మతములు,సర్వ బోధలు ఆయన హృదయములో ఉంటాయి. ప్రపంచములోని సర్వ విజ్ఞానాలు ఆయన తలలో ఉంటాయి. నీవు భగవంతుని వేడుకునే సర్వ పదార్దాలు ఆయన ప్రసాదించగలడు. ప్రపంచములోని నిధి,నిక్షేపాలన్ని ఆయన పాదాలక్రింద ఉంటాయి. ఆయన భక్తుల మధ్యకు వెల్లి తన చేతితో వాళ్ళ శిరస్సును సృశిస్తారు. ఆయనను చుచిన ప్రతి వారు ఆనందం అనుభవిస్తారు. ఆయన ఒక కొండ మీద నివసిస్తారు."
Post a Comment