ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది అని ఒక అడ్వరటైజ్‌మెంట్‌లో కేప్షన్. ఐడియా మాటేమో గానీ ఒక మర్డర్ మాత్రం జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది. హత్య చేసి జైల్లో పది,పద్నాలుగేళ్ళు ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నా జీవితాలు మారిపోతాయి. అలా కాకుండా హత్య చేసి, దాని వల్ల దశ తిరిగి, బూరెల బుట్టలో పడడం అంటే ఏమిటో మరియా సుసయ్‌రాజ్‌ని చూస్తే తెలుస్తుంది.
ఎలాగైనా తాము అనుకున్నది సాధించాలి, అందుకు ఏ మార్గం ఎంచుకోవడానికైనా సిద్ధం అనుకొనే నేటి తరానికి ప్రతీకగా అవకాశాల కోసం టీవీ ప్రొడ్యూసర్ అయిన నీరజ్ గ్రోవర్‌తో సంబంధం పెట్టుకొని, అతనితో కలిసి తన ఫ్లాట్‌లో శృంగారం చేస్తుండగా ఆమె కాబోయే మొగుడు ఎమిల్ జెరోమ్ మాత్యూ చూసి ఇద్దర్ని రెడ్ హాండెడ్‌గా పట్టుకొంటే, కాబోయే మొగుడితో కలిసి ప్రియుడ్ని చంపి, అతని శవాన్ని ముక్కలుగా నరికి పారేసి పోలీసులకి చిక్కి, తేలికైపాటి శిక్షతో బయట పడిన ఈ అమ్మడి ముందు బాలీవుడ్, రియాలిటీ టీవీ ఇప్పుడు బారులు తీరి నిల్చున్నాయి.
ఇలాంటి హింసాత్మక, జుగుప్సాకరమైన విషయాలంటే చెవి కోసుకునే రామ్ గోపాల్ వర్మ ఈ కథ ఆధారంగా నిర్మించిన ఎ లవ్ స్టోరీ షూటింగ్ పూర్తి చేసుకొని సిద్ధంగా ఉంది. తన్నకుండానే బూరెల బూరెల బుట్టలో పడ్డట్టు ఇప్పుడే ఈ కేసు మీద తీర్పు వెలువడడంతో ఎప్పుడూ పబ్లిసిటీ కోసం నానా గడ్డి కరిచే వర్మకి బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ దొరికింది. .అయినా వర్మకి ఈ కథ మీద మోజు ఇంక తగ్గలేదు. ఈ ప్లాట్‌లో విషయం ఇంకా ఉందని భావించిన వర్మ, మరియా ఇప్పుడు జైలునుంచి బయట పడడంతో ఆమె కథని ఆమె నోటి వెంటే విని ఆ కథ హక్కులు కొని సినిమా తీసి, అందులో నటించే అవకాశం మరియాకి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు.
రియాలిటీ టీవీ షో బిగ్ బాస్‌లో పాల్గొనడానికి ఈ అమ్మడికి అహ్వానం వచ్చింది. ఇవే కాక ఇంకా మరెన్నో ఆఫర్లు ఈ అమ్మడి ముందున్నాయి.మహేష్ భట్ కూడా ఈ కథ మీద ఒక సినిమా తీస్తున్నట్తు ప్రకటించాడు.
మొత్తానికి నీరజ్ గ్రోవర్‌ని ఉపయోగించుకొని అవకాశాలు దక్కించుకోవాలన్న ఈ ఆమ్మడి ఆశని తను మరణించి నిజాం చేస్తున్నాడు గ్రోవర్. నటిగా తన ప్రతిభతో సాధించలేనిది హంతకురాలిగా మారాక సాధించి ఒక మర్డర్ జీవితాన్నే మార్చిపారేస్తుంది అని నిరూపించింది మరియా సుసయ్‌రాజ్.
6 comments:
ituvamti panikimaalinadaanigurchi meeru vraayatam memu chadavatam avasaramaa ?
nenu khachitanga cheptunna, epudo okappudu ee ammadu kooda murder ki guri avutundi. no doubt
varma eppudu moneyminded gaane kaakunda koncham saamaajika badhyata to aalochiste baguntundi kada .
aayanaa baagupadataaru,samaajam baagupadutundi
ఇటువంటి మృగాలు మన మధ్య జీవిస్తున్నప్పుడు వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా సార్, కనీసం మన రక్షణ కోసమైనా తెలుసుకొని జాగ్రత్త పడాలి కదా?
మామూలు మనుషులు తనలో ఆసక్తి కలగజేయలేరని, సెంటిమెంట్లు, సామాజిక స్పృహ తన వంటికి సరిపడవని ఆ మధ్య ఓ టీవీ చానల్‌లో వర్మ గారే స్వయంగా చెప్పారు.
ఇటువంటి మృగాలు మన మధ్య జీవిస్తున్నప్పుడు వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా సార్, కనీసం మన రక్షణ కోసమైనా తెలుసుకొని జాగ్రత్త పడాలి కదా?
మామూలు మనుషులు తనలో ఆసక్తి కలగజేయలేరని, సెంటిమెంట్లు, సామాజిక స్పృహ తన వంటికి సరిపడవని ఆ మధ్య ఓ టీవీ చానల్‌లో వర్మ గారే స్వయంగా చెప్పారు.
RGV KI EDE PANI...SANCHALANU UNDALI...CINEMA LO SARUKU KADU...EDAVA VEEDIKI DABBU UNDI KANI BRAIN LEDU
Post a Comment