నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Monday, July 4, 2011

రాష్ట్ర లక్ష్మి ఇంత చీప్ అయిపోయిందా?


రాజ్యం వీర భోజ్యం అని పెద్దలు చెప్పారు. అంటే రాజు కావాలంటే వీరుడయి ఉండాలి. వంశం, వారసత్వం ఒకతె సరిపోదు. రాజ్యం కోసం పాండవులు, కౌరవులు తమలో వీరులెవరో తెలుసుకోవడానికి భీకర యుద్ధం చేస్తే చివరికి ఆ రాజ్యలక్ష్మి పాండవుల వశమయింది. ఇప్పుడు రాజ్యాలు పోయి రాష్ట్రాలు వచ్చాయి. మిగతా రాష్ట్రాల మాటేమో కానీ మన రాష్ట్రలక్ష్మి కొన్ని సార్లు వీర భోజ్యం అయితే మరికొన్ని సార్లు అధిష్టాన బిక్షం అవుతుంది.


  
N.T. రామారావు రాష్ట్ర లక్ష్మిని తన వీరత్వంతో చేపట్టిన అసలు సిసలు వీరుడు. స్వంత పార్టీ పెట్టి, చైతన్య రధమ్ మీద రాష్ట్రాన్ని చుట్టి అప్పటి వరకు ఎదురు లేని కాంగ్రెస్ పార్టీని పెకళించి సింహాసనమెక్కాడు. తదుపరి చంద్రబాబుని కూడా వీరుడని చెప్పడానికి వీలు అసలు లేకపొయినా స్వసక్తితో అందలమెక్కినవాడని చెప్పక తప్పదు. అస్త్రమేకాదు తంత్రం కూడా అందలమెక్కిస్తుందని నిరూపించిన రాజకీయ కౌటిల్యుడు చంద్రబాబు. దుష్ట శక్తి బూచిని చూపించి ఎన్టీయార్ బిక్ష పెడితే ఎమ్మెల్యేలయిన వాళ్ళని, ఆయన కుటుంబాన్ని తన వైపుకి తిప్పుకొని చాకచక్యంగా పదవి దక్కించుకొన్న ఆయన్ని కూడా వీరుల లిస్టులో వేయవచ్చు.


    
ఇక వైఎస్సార్ అసలు సిసలు వీరుల లిస్టులో ఎన్టీయార్ సరసన కూర్చుంటాడు. అప్పటి వరకు రొటీన్ రాజకీయాలు చేసి విఫలుడయిన వైఎస్ పదవికి దగ్గర దారి ప్రజల గుండెలకి దగ్గరవడమే అని తెలుసుకొని ప్రజా ప్రస్థాన యాత్ర పేరిట వేల మైళ్ళు కాలి నడకన నడిచి ఆ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకున్నాడు.  అధికారంలోకి వచ్చాక కూడా తను తెలుసుకున్న రహస్యాన్ని వదిలి పెట్టకుండా అనేక ప్రజా సంక్షెమ పథకాలతో మళ్ళీ అధికారం దక్కించుకున్నాడు.
 


అయితే గత కొన్నేళ్ళుగా వీర భోజ్యంగా ఉన్న రాష్ట్ర లక్ష్మి తిరిగి అధిష్టాన బిక్షంగా మారి చీప్ అయిపోయినట్లు అనిపిస్తోంది. నేను దారిన పోయె దానయ్యను, నన్ను అమ్మ అధికార పీఠమెక్కించింది. ఆమె ఎప్పుడు పొమ్మంటే అప్పుడు పోతాను అని చెప్తూ వచ్చిన రోశయ్య చివరికి అలాగే పోయాడు. ఐ మీన్ దిగి పోయాడు. తరువాత డిల్లీ నుంచి వచ్చిన ఒక పెద్దాయన తనతో అమ్మ పంపిన చీటీ ఇక్కడ విప్పి చూస్తే కానీ ముఖ్యమంత్రి ఎవరో తెలియలేదు.
    
ఇప్పుడు ఈ పదవికోసం బొత్సా సత్యనారాయణ కూడా అర్రులు చాస్తూ ఉన్నాడు. సరిగ్గా అయిదేళ్ళు పార్టీ నడపడం కూడా చేత కాని చిరంజీవి కూడా ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నాడంటే మన రాష్ట్ర లక్ష్మి ఇంత చీప్ అయిపోయిందా అని బాధ కలుగుతూ ఉంది.

6 comments:

Anonymous said...

అల్లుడి చేతిలో కుక్క చావు చచ్చిన ఎన్.టి.ఆర్ వీరుడా ? మీ బ్లాగులో వ్రాసుకుంటే పర్వాలేదు. బయట అనోద్దు. పెళ్ళుమని నవ్వుతారు.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

దొంగ చాటుగా గద్దెనెక్కిన ఆ అల్లుడిని కూడా వీరుడి ఖాతాలోనే వేశాను. ఇక్కడ వీరుడు అంటే కష్టపడి అధికారం చేజిక్కించుకున్నవాడు అన్న అర్ధంలో వాడాను అంతే కానీ కత్తి పట్టుకొని మగధీర సినిమాలో లాగా వంద మందిని చీల్చి చెండాడే వాడు అని కాదు. గమనించగలరు. రేపు తెలంగాణా వచ్చి కేసీఆర్ సీఎం అయినా ఆయన్ని కూడా వీరుడు లిస్టులో వేస్తాను.

Anonymous said...

lanjaaa kodakaa, NTR veerudu raaa, Ee sanfgati Eaverni adiginaa cheputaaru

Apparao said...

@మొదటి అజ్ఞాతా
కాంగ్రెస్ ని కుమ్మేసిన వీరుడు ntr
@రెండవ అజ్ఞాతా
ntr మీద మీకున్న అభిమానానికి జోహార్లు
ఆయన మీద మీకున్న అభిమానానికి , మీ అభిమానాన్ని చంపుకుని కామెంట్ రాసారు
So మీరు కూడా వీరుడే :)
@ కృష్ణ గారు
పోస్ట్ అదిరింది

Apparao said...

@మొదటి అజ్ఞాతా
కాంగ్రెస్ ని కుమ్మేసిన వీరుడు ntr
@రెండవ అజ్ఞాతా
ntr మీద మీకున్న అభిమానానికి జోహార్లు
ఆయన మీద మీకున్న అభిమానానికి , మీ అభిమానాన్ని చంపుకుని కామెంట్ రాసారు
మీరు కూడా వీరుడే :)
@ కృష్ణ గారు
పోస్ట్ అదిరింది

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Thank you Sastry garu.