నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, August 5, 2011

బయట పడ్డ ఆరోగ్య శ్రీ అసలు స్వరూపం


ఆరోగ్య శ్రీ అసలు ఉద్దేశ్యం కార్పొరేట్ ఆసుపత్రులకు దోచి పెట్టడమే అని గతంలో ఒక పోస్టులో రాయడం జరిగింది. ఇది ఒక అశాస్త్రీయమైన పథకం అని చాలా మంది నిపుణులు మొదటినుంచీ చెప్తూనే ఉన్నారు. ఈ వేదికలో ప్రవీణ్ శర్మ కూడా చాలా సార్లు ఆరోగ్య శ్రీ లో తప్పులని ఎత్తి చూపారు. అయితే గత వారం రోజులలో జరిగిన సంఘటనలు ఈ పథకాన్ని నగ్నంగా ప్రజల ముందు నిలబెట్టాయి.
 


ఇందుకు కారణం ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి రమేష్. ఆరోగ్య శాఖలో చాలా కాలం పని చేసిన అనుభవం, అంతకు మించి సిన్సియారిటీ ఉన్న రమేష్ ఈ దోపిడీని దగ్గరనుంచీ చూశారు. ఆరోగ్య శ్రీ బిల్లులు మంజూరు చేసిన ప్రతి సారి ఏ విధంగా కోట్లకు కోట్లు కార్పొరేట్ హాస్పిటల్స్ దండుకుంటున్నాయో చూసి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో చేయగలిగిన కొన్ని ఆపరేషన్లకి అధిక మొత్తంలో డబ్బు ప్రైవేట్ హాస్పిటల్స్ దోచుకోవడం చూసి ఆయన ఆ ఆపరేషన్లు పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రులకి పరిమితం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు.
   
దీంతో గగ్గోలు మొదలయింది. అప్పటివరకూ ఆ ఆపరేషన్లు పేషంట్లకి అవసరం ఉన్నా లేకున్నా ఎడా పెడా చేసి పారేసి డబ్బు దోచుకోవడం అలవాటైన కార్పొరేట్ హాస్పిటల్స్ గతుక్కు మన్నాయి. ఆ ఆపరేషన్లు తమ పరిధి లోంచి తీసేస్తే అసలు ఆరోగ్య శ్రీ లోంచే తాము తప్పుకొంటామని ఒక అల్టిమేటమ్ జారీ చేశాయి. దీంతో ఆరోగ్య శ్రీని ఈ ప్రభుత్వం ఎత్తేస్తుందని సాక్షి మెయిన్ పేజీలో వార్తలు ప్రచురించి ప్రభుత్వానికి దడ పుట్టించింది. 


ఆరోగ్య మంత్రి మేలుకొని దోపిడీ కొనసాగుతుందని కార్పొరేట్ హాస్పిటల్స్‌కి భరోసా ఇచ్చి రమేష్‌ని ఆరోగ్య శాఖ నుంచి తప్పించి, ఆరోగ్య శ్రీ అమలు చేయడానికి ప్రభుత్వాసుపత్రుల్లో సదుపాయాలు లేవని ఒక మూర్ఖ శిఖామణి స్టేట్ మెంట్ ఇచ్చి స్టేటస్ కో మెయిన్‌టెయిన్ అయ్యేలా జాగ్రత్త పడ్డారు.


 
అపెండెక్టమీ, హిస్టెరెక్టమి లాంటి కొన్ని ఆపరేషన్ల మీదే ఆరోగ్య శ్రీలో ఎక్కువ బిజినెస్ నడుస్తోంది. ఈ ఆపరేషన్లని జిల్లా కేంద్రల్లో ఉన్న ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా చేయడానికి అవసరమైన సదుపాయాలు దండిగా ఉన్నాయి. వీటిని ప్రభుత్వ ఆసుపత్రులకి పరిమితం చెసి, ఆపరేషన్లు చేసిన డాక్టర్లకి ప్యాకేజీ లోంచి కొంత మొత్తం అందేలా చేస్తే వాళ్ళూ హ్యాపీగా చేస్తారు. బాగా డబ్బుండీ ఆరోగ్య శ్రీ కార్డులున్న వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులకి పోవడం ఇష్టం లేని వాళ్ళు అవసరమైతే బయట ఆపరేషన్లు తమ డబ్బుతో చేయించుకుంటారు. చేయించుకోనివ్వండి. తప్పేముంది.


రమేష్ బదిలీ వెనకా, ఆయన తీసుకున్న నిర్ణయాలు రద్దు కావడం వెనకా కార్పొరేట్ హాస్పిటల్స్ ఆరోగ్య మంత్రి చేయి తడపడం కారణం అని ఎవరైనా ఇట్టె చెప్తారు.     

10 comments:

Praveen Mandangi said...

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రింటింగ్ ప్రెస్ పెట్టి దొంగ నోట్లు ప్రింట్ చేసి కార్పొరేట్ ఆసుపత్రులకి ఇస్తాడా?

Anonymous said...

వామ్మో..ఈ కామెంట్ నాకు అర్ద్థం కాలేదు... ఎవరైనా చెప్పి పుణ్యం కట్టుకోండి...

Praveen Mandangi said...

ఇది రమణి స్టైల్‌లాగ ఉందే. రమణి, నువ్వు అజ్ఞాత పేరుతో కామెంట్ వ్రాసినా దొరికిపోతావు.

Praveen Mandangi said...

నీకు టాపికే అర్థం కానప్పుడు కామెంటేమి అర్థమవుతుంది. సీతాయణం అంతా చదివి సీతకి రాముడు ఏమవుతాడు అని అడిగాడట నీ లాంటోడకడు.

Praveen Mandangi said...

http://audios.teluguwebmedia.in/63960839 ఇదైనా అర్థమవుతుందా, సీతాయణం ప్రశ్నలు అడిగేవాళ్ళకి?

Anonymous said...

ఆరోగ్యశ్రీ పేరిట డబ్బులు గవర్నమెంటు ఇస్తుంది కదా అని అవసరం లేకపోయినా వేలాది ఆపరేషన్లు జరిగిపోయాయి...కోట్లాది రూపాయల్ని తెలివైన డాక్టర్లు జోబులో వేసుకు పోయారు...౯౦% ఆపరేషన్లు అనవసరంగా జరిగినవే...ఇప్పటికైనా ఈ దోపిడీ ఆపాల్సిన అవసరం ఉంది....ఎవరికైతే ఆపరేషను అవసరమో వాళ్ళకే సహోయం అందాలి అంటే ప్రైవేటు ఆసుపత్రులకు ఈ పదకాన్ని నిలిపివేయడమే ఉత్తమం...కొద్ది పాటి మెటీరియల్ ప్రభుత్వ ఆసుపత్రులకు కేటాయించినట్లయితే వాళ్ళే చక్కగా ఈ పధకాన్ని అమలు చేయగలరు....అనవసరమైన ఆపరేషన్లు ఆగిపోతాయి...

Praveen Mandangi said...

ఆరోగ్యశ్రీని పూర్తిగా రద్దు చెయ్యడం మేలు. ఆ స్కీమ్‌ని రద్దు చేస్తే తన తండ్రి పెట్టిన స్కీమ్‌కి గ్లోరీ తగ్గిందని కక్షగట్టి జగన్ సాక్షిలో ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వ్రాస్తాడు. వ్రాసినా వచ్చే నష్టం ఏమీ లేదు. అవి జగన్ డబ్బులు కావు కాబట్టి జగన్ ఎంతైనా వ్రాస్తాడు. జనం ఈ విషయం తెలియనంత అమాయకులు కారు.

Praveen Mandangi said...

ఫ్రీగా వస్తే ఫినైల్ తాగేసేవాళ్ళలాగ మందులకి నయమయ్యే వాటికీ ఆపరేషన్‌లు చేసి డబ్బులు సంపాదించే డాక్టర్లకి ఆరోగ్యశ్రీ గొప్ప వరమే. ఆ ఆపరేషన్‌లతో సైడ్ ఎఫెక్ట్‌లకి గురయ్యేవాళ్ళకి శాపం.

Praveen Mandangi said...

ఆరోగ్యశ్రీ కార్పొరేట్ ఆసుపత్రుల ధన వర్షిణి http://www.youtube.com/watch?v=4WweNYFvrzM

Praveen Mandangi said...

https://plus.google.com/111113261980146074416 Arogyasree is the second biggest scam after Janmabhoomi in our state.