తిరుమల కొండల హద్దుల మీద అటవీ శాఖకీ, టీటీడీ వాళ్ళకీ మధ్య ఏదో నడుస్తున్నట్లుంది. ఈ విషయమ్మీద మొన్న (27 ఆగస్ట్) టీవీ9 ఒక స్టోరీ ప్రసారం చేసింది. సరే వార్తా ఛానల్‌గా అది వాళ్ళ పని. అయితే ఆ వార్త మొత్తం అదేదో స్వయానా స్వామి వారి ఆస్థిని ఎవరో కాజేస్తున్నట్లు శ్రీవాసుడికి మిగిలేది రెండు కొండలేనా, ఆయన ఆస్థి ఇక రెండు కొండలకే పరిమితమా? అన్న వాక్యాలు పదే పదే వల్లించడం మూర్ఖత్వంగా అనిపించింది.
స్వామి సర్వాంతర్యామి. ఒక అడుగుతో ఆకాశాన్ని, మరొక అడుగుతో భూమండలాన్ని ఆక్రమించిన వాడు. ఆయనకి రెండు కొండలు మిగలడమేమిటి? అటవీ శాఖకెంత, టీటీడీకెంత అని చూసుకోవాలి గానీ, స్వామివారికెంత ఉంటుంది, ఎంత పోతుంది అని లెక్కలేమిటి?
దీనికి ముక్తాయింపు ఏమిటంటే తిరుమల కొండలన్నీ టీటీడీకే చెందుతాయని అతవీ శాఖా మంత్రిగారు సెలవిచ్చారు.
3 comments:
వామ్మో ,మీకింత దైవ భక్తి వుందనుకోలా, కృష్ణ గారూ.
థాంక్స్ సార్.
TV9 "evari gola varidi" tappite migata chetta anta choodatam waste.
Post a Comment