ఇప్పుడు ఏ మాత్రం సమకాలీన రాజకీయాలను ఫాలో అవుతున్న వారెవరైనా ఒకటే మాట; అన్నా హజారే, లోక్ పాల్. డెబ్బయ్యేళ్ల వయసులో జాతి మొత్తాన్ని, లేదా కనీసం మధ్య తరగతి ప్రజలందరినీ తనతో నడిపిస్తున్న హజారేని చుస్తే ఆశ్చర్యమనిపించక మానదు. కానీ ఈ రామ్‌లీలా మైదానంలో జరుగుతున్న జాతర పూర్తయితే పరిస్థితి మళ్ళీ back to square one అవుతుందని నా అభిప్రాయం.
అధికారం అడ్డు పెట్టుకొని దోచుకోవడాన్ని కార్పొరేటైజ్ చేసి తన వారికి ప్రజల సంపదని పందేరం చెసి తను కోట్లు మూట గట్టుకొని, ఆ కోట్లను విదేశాల్లో గుడ్లు పెట్టడానికి వాడుతున్న నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో అన్న హజారే ఏజెంట్‌లాగా అవినీతి వ్యతిరేక ఉపన్యాసాలు దంచుతున్నాడు.
లోకాయుక్త చెప్పుతో కొట్టినా గాలి సోదరులు తమ పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి చాలా కష్టపడ్డారు(అంటే డబ్బు పోసి ఎమ్మెల్యేలను కొన్నారు అని) కాబట్టి వారికి మంత్రి పదవులు ఇవ్వాల్సిందే అని కర్ణాటక బీజేపీలో నాయకులు వాదిస్తున్నారు. గాలి బ్రదర్స్ కర్ణాటక, ఆంధ్ర ప్రదేస్ అని తేడా లేకుండా జాతి సంపదని లూటీ చేస్తుంటే అండగా నిలిచిన సుష్మా స్వరాజ్ ఇప్పుడు లోక్ పాల్ బిల్లు పటిష్టంగా ఉండాలి అని కేకలేస్తున్నారు.
తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని వేలకు వేల కోట్ల డబ్బు మేశాడని సీబీఐ సాక్ష్యాలతో సహా చూపిస్తుంటే, దేవుడుకి మకిలి అంట కడ్తారా, దేవుడి కొడుకు మీదే విచారణా అని ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధులు రాజీనామా చెసి మరీ సమర్ధిస్తుంటే, వారికి ప్రజలు పూలు పరిచి మరీ స్వాగతం పలుకుతున్నారట(source:Saakshi). వీళ్ళు సిగ్గు లేకుండా బస్సెక్కి మరీ ప్రజల వద్దకెళ్ళి అన్యాయాన్ని విప్పి చెప్తారట.
తాతగారూ, ఇది జరిగే పని కాదు కానీ, శిబిరం ఎత్తేసి ఎక్కడో ఒక పర్ణశాల నిర్మించుకొని మొక్కలు పెంచుకుంటూ ఉంటే కనీసం గ్లోబల్ వార్మింగ్ అయినా తగ్గుతుంది చూడండి. మీ దీక్ష ఫలించి మీరు అనుకున్న బిల్లు వచ్చినా ఈ దొంగ నా _______ లు తమ లూటీని కొనసాగించడం ఆపరు. వీళ్ళకున్న తెలివి తేటలను ముందుగా పసి గట్టి అడ్డుకట్ట వేసే బిల్లు తీసుకు రావడం ముక్కోటి దేవతలు కలిసి కట్టుగా ఆలోచించినా జరగదు.
11 comments:
మీ ఆవేదన అర్దం అయ్యింది. good.
అన్నా హజారే ప్రతిపాదించిన జన్ లోక్‌పాల్ చట్టం పరధిలోకి ప్రైవేట్ వ్యక్తులు రారట. టాటా, రిలయన్స్, మిత్తల్, వేదాంత లాంటి బహుళజాతి కంపెనీలు దేశాన్ని ఎంత కావాలంటే అంత దోచుకోవచ్చు. మన జిల్లాలో ఒక చర్చ్ పాస్టర్ మూడు వందల ఎకరాల భూమిని ఆక్రమించుకున్నాడు. అది ప్రైవేట్ వ్యక్తి చేసినది కనుక ACB పరధిలోకి అది రాదు. అది రెవెన్యూ చట్టం ప్రకారం నేరం. పల్లెటూరి చర్చ్ పాస్టరే 300 ఎకరాల భూమిని ఆక్రమించుకుంటే కార్పొరేట్ కంపెనీ యజమానులు ఎంత దోచుకోగలరో ఊహించుకోవచ్చు.
ఒకటో రెండో రోజులు నిరాహార దీక్షలు చేసి ,ఈ వెర్రి పీనుగలని నమ్మించడానికి ఇది చాల్లే అనుకునే జగన్ ,బాబు లాంటి వాళ్ళకన్నా,౮ రోజులనుంచీ మంచినీళ్ళు తప్ప ఏమీ తీసుకోకుండా దీక్ష చేస్తున్న 75 ఏళ్ళఅన్న హజారే అసలైన యువకుడు.
ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేశాడు అనేది పాయింట్ కాదు. పూర్వం ఆచార్య భన్సాలీ మందిమార్బలం ప్రదర్శించకుండా ఒంటరిగానే నిరాహార దీక్ష చేసేవాడు. అతనికి అభిమానులు ఉన్నా అభిమానులని వెనకేసుకుని నిరాహార దీక్ష చెయ్యలేదు. వ్యక్తిగత పాపులారిటీ కోసం పాకులాడకుండా ఒంటరిగా నిరాహార దీక్ష చేసేవాడు. ఆచార్య భన్సాలీకీ, అన్నా హజారేకీ మధ్య అసలు పోలికే లేదు.
అన్న హజారే దీక్ష వలన ఏదో అవినీతి అంతం అవుతుంది ఆకాశం నుండి రత్నాలు కురుస్తాయ అని నేనూ అనుకోవట్లేదు.
కాని అది ఒక platform, ఒక ఉద్యమం రూపంలో జనాన్ని పోగు చేయటం, ప్రభుత్వాన్ని కట్టడి చేయటం, అహింస, రాజయామ్గా బద్ధంగా నిరసన చేయటం ఇవన్నితికి ఒక రెఫెరెన్స్.
ఇది భావి భారత నిరసనలని ఉద్యమాల్ని తప్పకుండా మారుస్తుంది.
ఉద్యమం అంటే గొడవలు, అల్లర్లు, రాళ్ళూ విసురుకోవటం కాదు అని ఏర్రోల్లకి , ఆకుపచ్చోల్లకి తెలిపే ఉద్యమం.
వేదాంత రిసోర్సెస్, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ లాంటి ప్రైవేట్ కంపెనీలు చేస్తున్న అవినీతి స్పష్టంగా కనిపిస్తున్నా అన్నా హజారే ప్రభుత్వ అవినీతిని మాత్రమే ఎందుకు విమర్శిస్తున్నట్టు? ప్రభుత్వంలో మాత్రమే అవినీతి ఉంటుందని చెప్పి ప్రైవేటీకరణని జస్టిఫై చెయ్యడానికా? లోక్‌పాల్ బిల్ పరధిలోకి ప్రైవేట్ కంపెనీలని తేవాలని అన్నా హజారే డిమాండ్ చేసి ఉంటే నేను అన్నా హజారేకి సపోర్ట్ ఇచ్చేవాణ్ణి.
ఆచార్య భన్సాలీకీ, అన్నా హజారేకీ మధ్య అసలు పోలికే లేదు.
who compared these two people!!!
లోక్‌పాల్ బిల్ పరధిలోకి ప్రైవేట్ కంపెనీలని తేవాలని అన్నా హజారే డిమాండ్ చేసి ఉంటే నేను అన్నా హజారేకి సపోర్ట్ ఇచ్చేవాణ్ణి.
who asked your support. shut your mouth and do your work
It's not the matter of individual's support. ప్రైవేట్ కంపెనీలకి అవినీతి చేసే హక్కు ఉంది కానీ ప్రభుత్వానికి లేదు అంటే ప్రభుత్వం అవినీతి వ్యతిరేక చట్టాలు తయారు చేస్తుందా?
praveen,
అన్నాచేసే దీక్ష పారదర్శకం గనుకనే జనం నమ్మగలుగుతున్నారు.అదే సేక్రేట్ గా చేస్తే ఎవరు నమ్ముతారు /" లోక్‌పాల్ బిల్ పరధిలోకి ప్రైవేట్ కంపెనీలని తేవాలని అన్నా హజారే డిమాండ్ చేసి ఉంటే నేను అన్నా హజారేకి సపోర్ట్ ఇచ్చేవాణ్ణి."అన్నారు మీరు ప్రతిపాదించవచ్చు కదా 75 ఏళ్ల వ్యక్తి ఇంత కఠోర దీక్ష చెయ్యగలుగుతున్నారంటే దాని వెనుక వున్న స్ఫూర్తి ని గ్రహించండి
అన్నా హజారే రెండు వేల మంది అనుచరులని ప్రదర్శించి నిరాహార దీక్ష చేస్తానన్నాడు. ఇది వ్యక్తిగత పాపులారిటీ కోసం ప్రాకులాడేవాళ్ళు చేసిన దీక్షలాగ ఉంది. ఆచార్య భన్సాలీ మంది మార్బలాన్ని ప్రదర్శించకుండానే బహిరంగంగా నిరాహార దీక్ష చేశాడు. అయినా భన్సాలీ నిరాహార దీక్షకి అప్పటి కాంగ్రెస్ నాయకులు దిగివచ్చి గ్రామం నుంచి వెలివేతకి గురైన దళితులని తిరిగి గ్రామంలో గుడిసెలు వేసుకోనిచ్చారు.
అన్నా హజారే పాలక వర్గాన్నైతే ఏమీ పీకలేడు. అన్నా హజారే బాటలో నడిస్తే అవినీతి మాయమవుతుంది అని కొంత మంది అమాయకులలో భ్రమలు కల్పించడానికి మాత్రం ఒక వర్గంవాళ్ళకి ఉపయోగపడతాడు.
Post a Comment