భూమిని నమ్ముకొని వ్యవసాయం చేయడం అనేది చాలా కష్టాలతో కూడుకున్న విషయమైపోయింది. నాట్లు వేయాలంటే వర్షాలుండవు. గింజలు కల్తీవి అయి ఉంటాయి. ఒకవేళ నాట్లు వేసినా, వేశాక అవి సరిగ్గా ఎదగాలంటే తగిన నీరుండదు. ఎరువులు, పురుగు మందులు కొంటే అవి కల్తీవి అయి చస్తాయి. ఇన్ని తంటాలు పడి పంట పండిస్తే దళారుల చేతులలో మోసపోవాల్సి వస్తుంది. ఇది భూమాతని నమ్ముకొని వ్యవసాయం చేసి నలుగురికీ తిండి పెడదాం అనుకొనే రైతన్న పరిస్థితి.
అదే భూమాతని అడ్డంగా తవ్వేసి ఆమె గర్భంలోంచి విలువైన ఖనిజ సంపదను అడ్డంగా దోచేసే వారి సంగతి చూడండి. ఇళ్ళలో బంగారు సింహాసనాలు, కోట్ల కోట్ల డబ్బులూ, అధికారం... అబ్బో!
ఇంకా కావాలంటే దేవుడికి కూడా బంగారు కిరీటాలిచ్చి ఆయన్ని కూడా మంచి చేసుకోవచ్చు.
3 comments:
గాలి జనార్ధన రెడ్డి దేవుణ్ణి కూడా ఫూల్ చేశాడు. నలభై కోట్ల విలువైన బంగారం ఇచ్చినట్టు చెప్పుకున్నాడు. దాని విలువ లెక్కేస్తే 25 కోట్లని తేలింది.
దేవుణ్ణి ఫూల్ చెయ్యడమేంటి? దేవుని పేరు చెప్పి,లెక్కలు తప్పు జెప్పి, అధికార్లను ఫూల్ చేశాడు అని చెప్పాలి.
దేవుణ్ణే ఫూల్ చేయగా లేనిది ఈ సీబీఐ వాళ్ళు నాకొక లెక్కా అనుకొంటున్నట్టున్నాడు. పాపం. అతని ఆటలు సాగేలా లేవు.
Post a Comment