నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Monday, April 4, 2011

దేవుడికి వెంటిలేటర్ సపోర్టు పెట్టే మొనగాళ్ళా?


అవును.ఇది మీకందరికీ తెలిసిన విషయమే. టీవీల్లో పేపర్లలో అందరూ చదివే ఉంటారు. దేవుడు స్వంతంగా ఊపిరి తీసుకోలేక వెంటిలేటర్ మీదా, రెండు కిడ్నీలు పాడయ్యి డయాలసిస్ మీద బండి లాగుతున్నాడు.


 
అసలు దేవుడికి జబ్బు చేస్తుందా? మనలాంటి మామూలు మనుషుల్లాగా ఆయనకి వైద్యం అవసరమౌతుందా?ఇదంతా ఆ లీలామానుష చక్రవర్తి. జగన్నాటక సూత్రధారి ఆడుతున్న నాటకమేనా? 


అవును ఇదంతా ఆయన ఆడుతున్న నాటకంలో భాగమే. తన భక్తులకి తన మీద ఉన్న ప్రేమనీ, విశ్వాసాన్నీ, ఆధునిక వైద్య శాస్త్రం యొక్క సామర్ధ్యాన్నీ, తన హాస్పిటల్‌లో ఉన్న డాక్టర్ల మేధస్సునూ పరీక్షకు పెట్టే ప్రయత్నం ఇది. 

చూస్తూ ఉండండి రేపో,యెల్లుండో ఆ మర్నాడో ఆయన తన చేతులకు,ముక్కులోకి.గొంతులోకి పెట్టిన ట్యూబులన్నీ పీకేసి మధ్యందిన మార్తాండుడిలా నడుచుకొంటూ, సారీ వీల్ చైర్‌లో కూర్చుని తోయించుకుంటూ బయటకొచ్చి, చేయెత్తి భక్త కోటిని ఆశీర్వదిస్తాడు.
 


లేదా......? లేకపోతే మాత్రం ఆయన మరణిస్తాడా? నీలాగా నాలాగా ఆయనని మరణం చేరగలదా? సింపుల్‌గా ఈ అవతారాన్ని చాలించి వైకుంఠానికో, కైలాసానికో వెళ్తాడు. లేదా సజీవ సమాధి అయి ఈ భూమ్మీదే భక్త కోటిని సంరక్షిస్తూ ఉంటాడు. ఇంత చిన్న విషయాన్ని అర్ధం చెసుకోలేక ఆయన ఆరోగ్యం మీద ఈ భక్తులూ,బంధువులు,మీడియా వాళ్ళు ఆయన ట్రస్టు వాళ్ళతో గొడవ పెట్టుకుంటారెందుకో. తన కుర్చీకే దిక్కు లేని మన సీఎం ఆయన కోసం ఒక బృందాన్ని పంపడాన్ని చూసి ఆయన లోలోపల నవ్వుకోడూ!?




ఇదంతా ఆయన లీలలో భాగమే, ఆయన ఆడిస్తున్న నాటకమే. చరాచరా జగత్తునీ, ప్రకృతినీ,ప్రాణికోటినీ తన అదుపాగ్నల్లో ఉంచుకొనే ఆ సర్వ శక్తి సంపన్నుడికి వైద్యం చేయడం ఎవరికి సాధ్యం.


ఆయన ఆశ్రమంలో, ఆ చుట్టుపక్కలా సంభవించే మిస్టరీ మరణాలు కానీ, సివిల్స్‌కి సెలక్టయిన ఇద్దరు కుర్రాళ్ళు ఆయన మీద హత్యా ప్రయత్నం వేయడం, ఆ తరువాత కాల్చి చంప బడడం ఈ లీలలో భాగమే ఆయన ఆ కుర్రాళ్ళని తనలో ఐక్యం చేసుకుని ఏ కైలాసానికో, వైకుంఠానికో ట్రాన్స్‌ఫర్ చేసి పారేశాడంతే.



  . బెంగుళూరులో కింద పడి ఆయనకి తుంటి కీలు విరిగినా, ఆపరేషన్ చేసిన సెట్ కాక వీల్ చెయిర్‌లో కూర్చునే పరిస్థితి వచ్చినా అదీ ఆయన లీల తప్ప మరొకటి కాదు. 

అనంతపురంలో భూకంపం పుకార్లు వచ్చినప్పుడు ఆయన ఆశ్రమంలోంచి బయటకొచ్చి పచార్లు చేయడం ప్రాణ భయం వల్ల కాదు. సాక్షాత్తూ భూదేవి నే "చప్పుడు చేయక గమ్మునుండు" అని అదిలించడానికే.


కాబట్టి దేవదేవుడూ, విశ్వానికే చక్రవర్తి అయిన ఆయనకి వైద్య చేయడం, చేయించుకోవడం, ఆయన మరణించడం ఇవన్నీ ఆయనకి వర్తించవు అన్న విషయం అందరూ తెలుసుకోవాలి. 

26 comments:

Anonymous said...

:))

రవి said...

బాగా చెప్పారు. మనది లౌకికరాజ్యం, ప్రజల సెంటిమెంట్లు దెబ్బతింటాయి కాబట్టి ఇంతకంటే ఖచ్చితంగా చెప్పకూడదేమో.

శరత్ లిఖితం said...

KEVVVU KEKA

ANALYSIS//అనాలిసిస్ said...

>>@ అవును ఇదంతా ఆయన ఆడుతున్న నాటకంలో భాగమే. తన భక్తులకి తన మీద ఉన్న ప్రేమనీ, విశ్వాసాన్నీ, ఆధునిక వైద్య శాస్త్రం యొక్క సామర్ధ్యాన్నీ, తన హాస్పిటల్‌లో ఉన్న డాక్టర్ల మేధస్సునూ పరీక్షకు పెట్టే ప్రయత్నం ఇది.





అవును ... ఇదంతా ఆ జగన్నాటక సూత్రధారి ఆడుతున్న నాటకమే ... మానవమాత్రులైన డాక్టర్లకి పెట్టిన పరీక్షే ఇదంతా ... ఆయనపై మనకున్న భక్తినీ, ఆధునిక వైద్య శాస్త్రం యొక్క సామర్ధ్యాన్ని పరీక్షించడానికే ఈ నాటకం ... చూస్తూ ఉండండి ఈ పరీక్షలో ఆయనే నెగ్గుతాడు ఎంతైనా భగవంతుడు కదా ... ఆయన ముందు మనమెంత ? ... మన ప్రయత్నమెంత ? ... మన సామర్ధ్యమెంత ? ... ఈ పరీక్షలో మానవమాత్రులమైన మనమంతా ఓడిపోవడం ఖాయం ... మనిషిగా , ఆయన చేసిన బొమ్మలుగా ఈ పరీక్షలో ఓడిపోవడం మన కర్తవ్యం .

Anonymous said...

Bombay లో Appendicitis operation చేయించుకోవడం కూడా ఆ లీల లో భాగమే.

Anonymous said...

abba baga chepparu, kaani meeru tittara pogidara,e desamlo inka avataralu,manishini mokkadalu povu. mokke devudu lo kuda fancy kavali,modern kavali. mukkoti devatalu vunna kotha devullu kavali.

Praveen Mandangi said...

సత్యసాయిబాబా అయినా, బాలసాయి బాబా అయినా, నిత్యానంద స్వామి అయినా, చంద్రస్వామి అయినా వీళ్లందరూ సాధారణ మనుషులే. మాంత్రిక వేత్తనని చెప్పుకున్న చంద్రస్వామికి కూడా తన మీద ఉన్న కోర్ట్ కేసుల నుంచి బయట పడే మంత్రం తెలియలేదట. అతనికి నిజంగా మహిమలు ఉంటే పోలీసులు అరెస్ట్ చెయ్యకముందే మాయమైపోయేవాడు. ఏ బాబా అయినా, స్వామీజీ అయినా తన మంత్రాలతో తనని తాను కాపాడుకోలేడు.

Praveen Mandangi said...

http://sahacharudu.blogspot.com/2011/04/blog-post.html

కెక్యూబ్ వర్మ said...

చాలా బాగా మంచి వ్యంగ్యంతో కూడిన విసుర్లతో కళ్ళు తెరిపించేలా రాసారు... థాంక్స్..

Anonymous said...

ఓహో! మార్క్స్‌ని దేవుడిలా బుర్రతక్కువ కమ్యూనిస్టులు ఆరాధిస్తారు, అది మాత్రం బాగుంటుందే

Anonymous said...

మార్క్స్ ని దేవున్నింకా చేయలేదు మీ శంకరాచార్యుల వారు... లేకపోతే ఈపాటికి 12, 13 అవతారంగా కలిపేసి వుండేవారు...అది తక్కువెవరికో తెలుస్తోంది...

Saahitya Abhimaani said...

సాయిబాబా భాగావంతుడో కాదో కాలమే నిర్ణయిస్తుంది. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నప్పుడు, ఇలా వ్యాఖ్యానించటం సబబేనా?

Praveen Mandangi said...

బాబూ అజ్ఞాతా. మార్క్సిస్టులు మార్క్స్‌ని దేవునిగా ఆరాధించరు. ఓసారి మార్క్స్ విలియం బ్లాస్‌కి వ్రాసిన ఉత్తరంలో వ్రాసాడు "పాలక వర్గంపై మూఢ భక్తిని కలిగించే ఏ అంశాన్నైనా అంగీకరించను" అని. వ్యక్తిపూజని అంగీకరించను అని చెప్పడానికి అలా వ్రాసాడు.

SRRao said...

మీకు శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు

- శి. రా. రావు
ఉగాది ఊసులు
http://sirakadambam.blogspot.com/2011/04/blog-post_04.html

Anonymous said...

మార్క్స్‌గారికి అలా చెప్పుకొనేలా ఆ కాలానికే బాగా విసిగించారన్న మాట, లేదంటే ఆ ఆలోచనెలా వస్తుంది? లెనిన్ శవారాధన చేసింది వీళ్ళు కాదేటి? వీళ్ళు మారరు గాక మారరు.

Praveen Mandangi said...

బాబూ అజ్ఞాతా, ఈ లింక్ చదువు: http://www.marxists.org/archive/marx/works/1877/letters/77_11_10.htm
>>>>>
Neither of us cares a straw for popularity. Let me cite one proof of this: such was my aversion to the personality cult that at the time of the International, when plagued by numerous moves — originating from various countries — to accord me public honour, I never allowed one of these to enter the domain of publicity, nor did I ever reply to them, save with an occasional snub. When Engels and I first joined the secret communist society, we did so only on condition that anything conducive to a superstitious belief in authority be eliminated from the Rules.
>>>>>

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

బాంబేలో అపెండిసైటిస్ ఆపరేషన్ సంగతి నాకు తెలియదండీ, అందుకే రాయలేదు. ఈ బ్లాగుకీ,బ్లాగరుకీ మార్క్సుకీ,లెనిన్‌కీ వాళ్ళ సిద్ధాంతాలకీ సంబంధం లేదు.

బాబాగారు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇలా రాయడం సబబు కాదు. అయినా ఈ etiquette సాధారణ మానవులకి సంబంధించింది. మానవాతీతులకు, దైవాంశ సంభూతులకూ వర్తించదు.

Praveen Mandangi said...

మన తెలుగు టివి చానెల్స్ వాళ్లు బాబా ఆరోగ్యం గురించి తెగ భయపడిపోతున్నట్టు నటిస్తున్నారు. రాత్రి టివిలో చూశాను.

gajula said...

namO..namha..krishnaswamy.....maa kaLLu teripinchaaru

Anonymous said...

http://ravigaru.blogspot.com/2011/04/blog-post.html

Jai said...

This man predicted he will live till the age of 95. There are nine more years to go, no need for "devotees" to worry!

PDSUKAVALI said...
This comment has been removed by the author.
VEERU said...
This comment has been removed by the author.
Sree said...

konnaalla taruvata kaliyuga daivam (?) kalki bhagawan elanti adbhutalu chestaro choodali mari :)

Praveen Mandangi said...

మూఢ నమ్మకాలని నమ్మకూడదు అంటే దేశంలో వేరే సమస్యలు లేవా అని అడుగుతారు. దేశంలో వేరే సమస్యలు లేవనలేదు కానీ వాళ్లే అసలు విషయం దాటవెయ్యాలనుకుంటారు. ఈ లింక్ దర్శించండి: https://profiles.google.com/praveenmandangi/posts/bZK8VjjNNJD

Siri said...

hai all, satya sai devoduo/ bagavath swarupamo naku telidu kani, money yevaridina kani koni manchi panu chesarukada, ayyana bhaktulu eichindantlo nunchi kochamina prajalaki use ayye works chesarukada, inka attani health kosam mari anta worry kanavasaram ledani na abhiprayam. peddalu chepinattlu bhumi meeda nukalu vunte vuntaru that's all.