నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, August 21, 2011

జగన్‌ని జైల్లో పెట్టే దమ్ముందా?


2G స్కాములో ఒక రాష్ట్ర ముఖ్య మంత్రి ముద్దుల కూతుర్నీ, మేనల్లుడినీ తీహార్ జైలులో పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అంత కన్నా పెద్ద ఎత్తులో, అంత కన్నా తెలివిగా అవినీతికి పాల్పడ్డ యువనేతని తీహార్ ఊచలు లెక్కపెట్టించ గలదా? ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. రాజాకి గానీ, కనిమోళికి గానీ జగన్‌కి ఉన్నంత తెలివి లేదు. ఇంట్లో డబ్బంతా మూటగట్టుకొని పోతూ పోతూ ఆ ఇంట్లో వాళ్లతో "నేను మీ మంచికే ఇదంతా చేస్తున్నాను, పగలు కూడా నేను రావడానికి మీ ఇంటి తాళాలు నా చేతిలో పెడితే మీకు స్వర్గం చూపిస్తాను" అని చెప్పెంత టాలెంట్ లేదు. కాబట్టి వాళ్ళిద్దర్నీ జైల్లో పడేశారు.


 
ఇప్పుడు మహానేత, ప్రియతమ నాయకుడు, దివంగత వైఎస్సార్ తో కలిసి ఆయన బతికున్నపుడు యువనేత జగన్ సాగించిన దోపిడీని సీబీఐ వాళ్ళు కళ్ళకి కట్టినట్లు వివరంగా విడమరచి చూపిస్తుంటే అందరికీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాకయ్యింది. అయినా ఇది ప్రతీకార చర్య, ఇది మమ్మల్ని వేధించడం, ఆ కేసులో ఇంత దర్యాప్తు చేశారా, ఈ కేసులో చేశారా, మా మీదే ఇంత దర్యాప్తు ఎందుకు అని తల్లి చేత ప్రధాన మంత్రికి లేఖ రాయించాడు జగన్. జగన్‌ని ఏమైనా చేస్తే రాజీనామా చేస్తాం అని జగన్ గ్రూపు ఎమ్మెల్యేలు ఒక వైపు బెదిరిస్తున్నారు, రాష్ట్రమంతా బస్సు యాత్ర చేసి నానా యాగీ చేస్తాం అని మరొక వంక బెదిరింపులు. 


 
యువ నేతకి నీళ్ళు తాగిస్తున్న అవ్వ, బువ్వ తినిపిస్తున్న అక్క, చెమట తుడుస్తున్న చెల్లి అని ఫోటోలతో సానుభూతి రేపడానికి సాక్షి అనే ఆయుధం ఉంది. అన్నింటినీ మించి స్కాములో కూడబెట్టిన కోటానుకోట్ల డబ్బుంది. ఎన్ని ఖాతాలు స్తంభింపజేసినా, అనంత పద్మనాభ స్వామి నేలమాళిగలా తరగని సంపద కదా అది. ఇన్ని హర్డిల్స్‌ని ఎదుర్కొని జగన్‌ని జైల్లో పెట్టె దమ్ము సోనియా అమెరికాకి వెళ్తూ, వెళ్తూ నియమించిన బృందానికి ఉందా అన్నది మిలియన్ డాలర్ల, సారీ, లక్షా యాభయ్ వేల కోట్ల రూపాయల ప్రశ్న.
  


నిజంగా తలచుకుంటే జగన్‌ని జైల్లో పెట్టడం పెద్ద సమస్య కాదు. తోక జాడించే ఎమ్మెల్యేల అవినితి చిట్టాని ముందుగానే సేకరించి, వేషాలేస్తే ఇవన్నీ బయటకొస్తాయి అని భయ పెట్టవచ్చు. వాళ్ళు మరీ తెగించి ప్రభుత్వాన్ని పడగొడితే ఆరు నెలలు రాష్ట్రపతి పాలన పెట్టి మెల్లిగా అన్నీ చక్క దిద్దుకోవచ్చు. సాక్షి పేపర్, టీవీ చానల్‌ని విచారణ పేరుతో మూయించవచ్చు. ఆరు నెలలు జగన్ జైలులో ఉండి, పేపర్, చానల్ లేకుండా ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ మూత పడి పోతుంది. అది ఇప్పుడు చిన్న మొక్క. ప్రతి రోజూ జగన్ దానికి లక్షలు లక్షలు పోస్తూ ఉంటేనే జీవంతో ఉంటూంది. అలా పోయడం ఆగి పోయిన మర్నాడు  అదీ ఆగి పోతుంది.


చూడాలి మరి సోనియా జగన్‌లు ఈ విషయంలో fight to finish అంటారో, లేక ఒక ఉదయాన్నే జగన్ వెళ్ళి అధినేత్రికి మోకరిల్లి,మళ్ళీ కాంగ్రెస్ కండువా  కప్పుకొని, అవినీతి అంటని పవిత్ర నేతగా బయటపడి, తన టైం కోసం వెచి చూస్తాడో?

4 comments:

Anonymous said...

ఒక ఉదయాన్నే జగన్ వెళ్ళి అధినేత్రికి మోకరిల్లి,మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకొని, అవినీతి అంటని పవిత్ర నేతగా బయటపడి,
This might happen.

Anonymous said...

ఒకరిని ఒకరు finish చేసుకుంటే, దేశానికి పట్టిన శని వదులుతుంది.

Anonymous said...

ఇది అన్యాయం. కాంగ్రెస్లో ఎవరు తినలేదు? సోనియా, షీలా, చిదంబరం, వైఎస్సార్ మంత్రులంతా తిన్నారు. తండ్రిలేని పిల్లోడనే జాలి, కనికరం లేకుండా CBI ని ఉసిగొల్పాలా? మమ్మల్నే ఎందుకు? వేలకోట్లు మూటలు కట్టి ఇచ్చామే, దాంట్లో మేము కొంత గిల్లి తింటే తప్పేమిటి? మమ్మల్నే ఎందుకు? మాకే ఈ కష్టాలెందుకు?
దేవుడు అంతా చూస్తున్నాడు. అమాయకులను హింసిస్తే వూరుకోడు. నా కొడుకును నమ్ముకున్న అంబటి, నాగిరెడ్డి దంపతులు, పొన్నాల, సబిత, కొండాసురేఖ లాంటి గొప్ప నేతలు ఏమైపోవాలి?

Anonymous said...

ఈ రాజకీయ సీరియల్ చాల సస్పెన్స్ గా వుంది .చివరికి ఏమి జరుగుతుందో ఎవరైనా గెస్స్ చెయ్యగలరా ?