నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, February 14, 2012

25౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦


ఈ సంఖ్య ఏమిటా అని ఆశ్చర్య పోతున్నారా? దీన్ని విడ దీసి, కామాలు పెట్టి చదివితే పాతిక లక్షల కోట్లు అవుతుంది. మన దేశం నుండి విదేశీ బ్యాంకులకి తరలించబడ్డ డబ్బు విలువ అది. రూపాయల్లో. ఇదేదో ప్రతిపక్షాల వాళ్ళు చేసిన ఆరోపణ కాదు. సిబీఐ ఛీఫ్ AP సింగ్ చెప్పిన గణాంకాలు ఇవి.

 స్విస్ బ్యాంకుల్లో ఉన్న కాతాలలో అధిక భాగం మన దేశానికి చెందిన వారివే అని కూడా ఆయన వెల్లడించారు. ఇప్పటివరకూ ఎంత నల్ల డబ్బు విదేశాలకు తరలి పోయిందో ఖచ్చితంగా లెక్కించడం అయ్యే పని కాదని చెప్తూ వచ్చిన మన వాణిజ్య మంత్రిగారు ఇప్పుడేమంటారో.
 
ఈ అక్రమ అకౌంట్లలో పన్ను ఎగ్గొట్టిన బాపతే కాకుండా ఉగ్రవాదులకు చెందిన వారు కూడా ఉన్నారు. స్విట్జర్లాండ్, సింగపూర్, లీష్టెన్‌స్టైన్, కేమాన్ ఐలాండ్, న్యూజీలాండ్, బహామాస్ లాంటి చిన్న చితకా దేశాలు మన వాళ్ళు ఈ డబ్బు దాచుకోవడానికి బోషాణాలు తెరిచి పెట్టుక్కూర్చున్నారట. 
  
ఒక విచిత్రమైన విషయమేమిటంటే, ఈ నల్ల డబ్బుని నిలువ చేసే అవకాశం ఇచ్చే దేశాల్లో చాలా దేశాలు అవినీతి రహిత దేశాలుగా గుర్తింపు పొందడం. అవినీతి తక్కువ  ఉన్న దేశంగా మొదటి స్థానంలోన్యూజీలాండ్, అయిదో స్థానంలో సింగపూర్, ఏడో స్థానంలో స్విట్జర్లాండ్ ఉన్నాయి. అయిన ఇతర దేశాల్లో అవినీతి పరుల డబ్బుని తమ దేశాల్లో దాచుకోనిస్తున్నాయి. 

ఇప్పుడు లెక్కలు తెలిశాయి కాబట్టి మన పాలకులు ఈ డబ్బులో వందో శాతమయినా వెనక్కి తీసుకురాగలిగితే ఈ దేశంలో పేదరికాన్ని తొలగించవచ్చు. 



2 comments:

కమనీయం said...

the socalled clean countries are also culprits in encouraging corruption by being havens for black money.Idonot think it will be an easy task to bring back that money.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Let's hope at least an honest effort will be made in that direction.