మన జాతిని రెండు శతాబ్దాలు బానిసలుగా మార్చి మనల్ని పీడించిన ఇంగ్లీషు వారిని తలుచుకుంటేనే నాకు కోపం వస్తూంది. వందే మాతరం అని ఎలుగెత్తి అరవాలన్నా, భగత్ సింగ్ పద్ధతిలో పోరాడాలన్నా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు. ఇప్పుడు వ్యాపారం పేరిట వచ్చే విదేశీయులతో పోరాడాలంటే మన ప్రభుత్వాలే ఒప్పుకోవు. పట్టి జైల్లో పడేస్తాయి. అయితే ఇంగ్లీషువారి మీద పగ తీర్చుకోవడానికి ఒక అవకాశం ఈ మధ్యే నాకు కనిపించింది.
ఇంగ్లీషు వారికి వారి బాష అంటే ఎనలేని అభిమానం. అందుకే వారి బాషని కంగాళీగా మార్చి పారేసే అమెరికన్లది ఇంగ్లీషు అంటే వారు అంగీకరించరు. అది అమెరికన్ అంటారు. అలాంటి ఇంగ్లీషు వారికి ప్రీతి పాత్రమైన బాషని చావుదెబ్బ తీసిన ఒక ఇంజనీరు కుర్రాడిని ఈ మధ్యే పరిచయం చేసుకోగలిగాను.
ఇంజనీరింగ్ పూర్తయిన నా కజిన్ ఫేస్ బుక్‌లో అతడి ఫ్రెండ్ పెట్టిన ఒక కామెంట్ యధాతధంగా ఇలా ఉంది: ekkada nuvvu, em doing? నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు అని దాని అర్ధం. దీన్ని ఒక ఇంగ్లీషువాడికి చూపించి వాడి మొహం చూడాలని ఉంది నాకు.
3 comments:
nice one. vikrutha bhaasha prayogaalu chaala chesaaru mana vaallu English meeda. "Wat say?" ;-)
అవకతవకల భాష ఆంగ్లభాష. put పుట్ ఐనప్పుడు but బట్ ఎలాఅవుతుందో కూడా చెప్పలేరు. ఎంచేద్దాం? ఇది చిన్న ఉదాహరణ మాత్రమే..
అందరమూ దానివెంట వెళ్ళేవాళ్ళమే కదా!
good udaharana, why not? english valonko show cheyyandi :)
Post a Comment