టైటిల్ చూసి కోపం తెచ్చుకోవద్దు. "సెలవంటూ వెళ్ళి పోయావా నేస్తం...... దొంగ లంజ కొడుకులసలే మసలే లోకం నుంచి" అని రాశాడు తిలక్ ఒక కవితలో(సారీ. ఇది శ్రీ శ్రీ గారి కవిత. నేను తిలక్ అని రాసింది తప్పు. సరి చేసిన వాహిని గారికి ధన్యవాదాలు). అలాగే నా ఆవేశాన్ని, ఆవేదననీ స్పష్టంగా చెప్పాలంటే ఈ పదం వాడక తప్పదు అనిపించింది. మద్యం మాఫియా చేత ఎమ్మార్పీ ధరలకి మద్యం అమ్మకాలు చేయించలేక వాళ్ళు చేసే ఆ దోపిడీ ఏదో ప్రభుత్వమే చేస్తే ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాకే చేరుతుంది కదా అని మద్యాన్ని రిటైల్‌గా ప్రభుత్వమే అమ్మితే పోతుంది కదా అన్న ఆలోచనతో ఎక్సైజ్ అధికారులని ఆ దిశగా చర్యలు చేపట్టమని ఆదేశించారు ముఖ్యమంత్రి. ఇప్పటికే ఆ విధానం అమలులో ఉన్న తమిళనాడుకి వెళ్ళి స్టడీ చేస్తున్నారు అధికారులు. కాబట్టి అతి త్వరలో ఇప్పటికన్నా తక్కువ ధరకే మందు బాబులకి చవకగా మందు దొరకబోతుంది. ధరలని నియంత్రించండి అని ఎవరైనా నేతలని కోరితే ముందు మద్యం ధరలని తగ్గించాం కదా అని చూపించే వెసులు బాటు దొరుకుతుంది మన నాయకులకి. తక్కువ ధరలో దొరుకుతుంది కాబట్టి మరింత ఎక్కువ కొట్టి మత్తులో మునిగిపోవచ్చు మందుబాబులు.
కూలీ నాలీ చేసుకొనేవాడు రోజంతా కష్టపడి సంపాయించిన డబ్బు ఇంట్లో పెళ్ళానికీ, పిల్లలకి ఇవ్వకుండా మందుకి తగలేసి నానా జబ్బులతో చస్తున్నాడు ఒక పక్క, మూతి మీద మీసం మొలవక ముందే బాటిల్ పడుతున్నారు పిల్లలు మరోపక్క. ఇలా ఎంత మందినో బలి చేస్తున్న మద్యం మహమ్మారిని నియంత్రించాల్సింది పోయి ప్రభుత్వమే స్వయంగా మందు అమ్మడం మొదలు పెట్టడం సిగ్గు చేటు కాదా. ప్రభుత్వం చేసే తప్పులని ఎండగట్టాల్సిన ప్రతిపక్ష నేత రోజంతా కష్టపడ్డ తమ్ముళ్ళకి సాయంత్రమయ్యే సరికి ఒకటో రెండో పెగ్గులు ఎమ్మార్పీ ధరలకి అమ్మాల్సిందే అని ఉద్యమాలు చేస్తున్నాడు సిగ్గు లేకుండా. అవున్లే, మద్య నిషేధానికి అంచెలంచెలుగా తూట్లు పొడిచిన ఘనత సార్‌దే కదామరి. మరో వైపు ముఖ్య మంత్రి పీఠం నా జన్మ హక్కు అని ఎలుగెత్తి అందరినీ ఓదారుస్తున్న యువ నేత, ఇంటింటికి, వీధి వీధికీ మద్యం వ్యాపించడానికి తన తండ్రి, ప్రియతమ నాయకుడూ, దివంగత మహా నేత కారణమని మర్చి పోయి అధికారమిస్తే లైసెన్సు ఫీజు, మద్యం రేటు మరింత పెంచుతానని అంటున్నాడే కానీ ప్రజల డబ్బులు ఖాళీ చేసి జబ్బులు తెచ్చి పెడుతున్న ఈ మహమ్మారిని పారదోలుతానని ఒక్కడన్నా అంటాడా?
అందుకే మరింత డబ్బు కావాలని ఏలిన వారికి ఎప్పుడన్నా అనిపిస్తే ప్రభుత్వ వేశ్యా గృహాలు నడపడానికి కూడా వీళ్ళు వెనుకాడరు. ఆర్గనైజ్డ్ ప్రాస్టిట్యూషన్ ఎంత అందంగా ఉంటుందో ఇర్వింగ్ వాలెస్ ది సిల్వర్ రూమ్ అన్న్ నవలలో చాలా బాగా రాశాడు. తెప్పించుకొని చదవండి సార్. మీ అధికారులతో చదివించి ఆ దిశగా ప్రపోజల్స్ తయారు చేయించండి.
13 comments:
krishna iraga deeshavu
em chesina, tage varu tagutune untaru mari. toli tappu tage varide kada. ee samasya ki okate pariskaaram. pellalu tiragabadi mandubabulanu chitakkottali, leda pellaloo 3 peggulu puchukovatam modalettali.
భలే ఏకి పారేశారు మాస్టారు....!!!
కృష్ణ గారు మీ ఆర్టికల్ బాగుంది, కానీ మొదటి లైన్ లోనే తప్పు ఉండటం బాధించింది.
దొంగలంజాకోడుకులసలే మెసలే ఈ
దూర్తలోకంలో నిలబడజాలక
తలవంచుకునే వెళ్లిపోయావా నేస్తం!
చిరునవ్వులనే పరిషేచన చేస్తూ....
ఇది తిలక్ గారు రాసినది కాదు. శ్రీ శ్రీ గారు రాసినది. ఆయన స్నేహితుడు కొంపెల్ల జనార్ధనరావు గారు మరణించిన సమయంలో రాసిన కవిత ఇది.
తెలుగు పాటలు, సుబ్బా రెడ్డి గారూ ధన్యవాదాలు. వాహినీ గారూ మీకు చాలా చాలా ధన్యవాదాలు. నేను కొన్నాళ్ళ క్రితం వరకూ మహా ప్రస్థానం, అమృతం కురిసిన రాత్రి చాలా సార్లు చదివాను. ఆ ఇద్దరి శైలికీ ఈ కవిత చాలా దగ్గరగా ఉండడం వలన పొరబడ్డాను. మరొక సారి థాంక్స్.
తాగొచ్చిన మొగుళ్ళని ఇరగదీయమని ఆ పెళ్ళాలని మేల్కొలిపే వారొస్తే, లేదా ఆ ఇంగితం వారికి కలిగినా బావుంటుంది.
KRISHNA గారూ భలే పడిందండీ చెప్పు దెబ్బ. అయినా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడో పెద్ద బ్రోతల్ హౌస్ అయి కూర్చుంది గమనించారో లేదో. ప్రతి బ్రోతల్‌కీ ఒక మేడమ్ ఉంటుంది, కాంగ్రెస్‌కీ ఉంది. రాజకీయ వ్యభిచారులందరూ కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇక్కడికి ఎవరు ఎప్పుడైనా రావొచ్చు వెళ్ళొచ్చు. సాని కొంపలో తప్ప సంసారి కొంపలో అలా జరుగుతుందా?
ఈ ప్రభుత్వం లంజల కొంపలు తెరుస్తుందో లేదో కానీ శ్రీశ్రీ రాసిన అద్భుతమైన ఎలిజీని గుర్తు చేసినందుకు థాంక్స్. ఈ కవితని తిలక్ కవిత అని పొరబడ్డంలో వింతేమీ లేదు. వాహిని గారి సంగతేమో కానీ మహా కవి అభిమానిగా నేను క్షమించేశాను.
ప్రభుత్వమే వేలం పాటలు నిర్వహించి దాన్ని ఆదాయమార్గంగా ప్రస్తుతం చూస్తోంది. ఇంత డబ్బు పోసి కాంట్రాక్టు పొందే వాళ్ళు ఎక్కువ రేటుకి అమ్మటం, బెల్టు షాపులను ప్రోత్సహించటం జరుగుతోందని, ప్రతిగా ప్రభుత్వమే పరిమితంగా షాపులను నిర్వహించాలని వాదన ఎప్పటినుంచో వుంది. సంపూర్ణ నిషేధం విధించవచ్చు కదా అని మనం అనొచ్చు కాని అది ఆచరణ సాధ్యం కాదని చాల చోట్ల నిరూపితం అయ్యిన్దన్నది వాదన. లోక్సత్త వారి మద్యం విధానం చూడండి తెలుస్తుంది(మ్యానిఫెస్టో లో )
http://www.loksatta.org/cms/index.php?option=com_content&view=article&id=77&Itemid=90
http://news.loksatta.org/2010/07/review-liquor-policy-lok-satta-urges-ap_29.html?utm_source=feedburner&utm_medium=email&utm_campaign=Feed%3A+Loksatta_News+%28Loksatta+News%29
http://news.loksatta.org/2010/07/review-liquor-policy-lok-satta-urges-ap_29.html
Good one! Veeti to paatu prabhuthva jooda gruhaalu, inkaa saptha vyasanaalalo yemi unnaayo vaati annitiki kooda teriste anni panulu okate saari ayipotaayi. inkaa janala convenience kosam ivi anni kalipi okate building lo (ippudu malls, super markets untaayi kada, ala anna maata) teriste inkaa baaguntundi. gulla(temples) paakano balla (schools) pakkano teriste ilanti alavaatlu leka Govt income ki gandi kodutunna pichi janaalaki buddhi kooda vastundi.
భలే ఎనోనిమస్, భలే. వ్యసనాల మల్టీప్లెక్సులు. వాట్ ఆన్ ఐడియా!
good idea...it should be having lot of takers in current government..why dont you try??
Post a Comment