ఇటలీ ఉత్తర భాగంలో ఉన్న బగ్నోలో మెల్లా అనే చిన్న నగరంలో ఎనిమిదేళ్ళుగా నడుస్తూ ఉన్న లా కఫే అనే కాఫీ, బీర్ బార్ ముందు ఉన్నట్టుండి మగ వాళ్ళు క్యూలు కడుతూ ఉంటే వారి భార్యలు మాత్రం తమ భర్తల్ని అటు వేపు వెళ్ళకుండా ఉంచాలని నానా తంటాలు పడుతున్నారు. ఈ భార్యల లిస్టులో ఆ నగర మేయర్ క్రిస్టినా అల్మీచీ కూడా ఉంది. ఆ బార్‌కి వెళ్ళకూడదు అని ఆమె తన భర్తకి ఒక షరతు కూడా విధించారట.
మగ వాళ్ళు ఆ బార్ వైపు క్యూలు కట్టడానికి, వాళ్ళని చూసి వారి భార్యలు భయ పడడానికి కారణం ఆ బార్ ఓనర్ లారా మాజి కొత్త వేషం. ఎనిమిదేళ్ళుగా బొటాబొటీగా నడుస్తున్న తన కఫేని పాపులర్ చేయడానికి ఆమె తన దుస్తుల్ని మార్చి వేసింది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే తీసి పారేసింది. పొడవాటి స్కర్టులూ, గౌనులూ తీసేసి పొట్టి డ్రస్సులు వేసుకొని శరీరం కొంచెం దాచి ఎక్కువ భాగం చూపిస్తూ ఉన్న ఆమె వేషధారణే ఈ గొడవకి మూల కారణం.
ఆమె కఫే ఉండే వీధిలో ట్రాఫిక్ ఎక్కువై పోయి రెండు వీధులు పార్క్ చేసిన కార్లతో నిండి పోతున్నాయి. కొంత మంది అయితే 70 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ కఫేకి వస్తున్నారు. ఫేస్ బుక్‌లో ఆ కఫే పేరిట ఉన్న పేజీకి 7888 మంది అభిమానులు ఉన్నారు. ఇటాలియన్ టీవీలొ ఆమెతో ఒక లైవ్ షో కూడా పెట్టారు. ఈ షోలో బగ్నోలో చుట్టు పక్కల నుంచి చాలా మంది ఆడవారు ఫోన్ చేసి తమ బాధలు చెప్పుకున్నారు. ఆమె నిండుగా గుడ్డలు వేసుకోవాలి లేదంటే ఆ కఫే ఎత్తి వేయాలి అనేది వాళ్ళందరి అభిప్రాయం.
"ఇందులో నా తప్పు ఏముందో అర్ధం కావడం లేదు. నేను ఎలాంటి బట్తలు వేసుకోవాలి అన్నది నా ఇష్టం. నా కఫేకి ఎక్కువ మంది మగ వాళ్లు వస్తుంటే నా తప్పు ఏం ఉంది. అందుకు నేనేం చేయ గలను" అని చెప్పి తప్పుకుంది లారా మాజి.
6 comments:
బీర్ అండ్ బ్యూటీ బార్ అన్న మాట. మగాళ్ళు క్యూలు కడుతున్నారంటే కట్టరూ మరి!
ఇలాంటి బార్ లు westren countries లో చాలానే వుంటాయ్. మరి ఈ బార్ కే ఇంత గొడవ ఎందుకో?
ప్రవీణ్, ఈ కామెంట్ ఇక్కడ ఉండాల్సింది కాదేమో?
కామెంట్ కాటెగరీ మార్చాను.
ఫ్రీ ఫినైల్ టాపిక్‌లోనే కామెంట్ ఉంది. చూసుకో.
Post a Comment