నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, July 20, 2012

అమితాబ్ బచ్చన్‌కి వరంగా మారిన రాజేష్ ఖన్నా తిరస్కారం


1970 దశకంలో రాజేష్ ఖన్నా రొమాంటిక్ హీరోగా వరుసగా హిట్ మీద హిట్ కొడుతున్న రోజుల్లో రచయితల ద్వయం సలీమ్ జావేద్‌లు ఆయన వద్దకు ఒక ప్రపోజల్‌తో వెళ్ళారు. రొమాంటిక్ హీరో నుంచి యాంగ్రీ యంగ్ మాన్ ఇమేజ్‌కి షిఫ్ట్ అవుదామని ఆయనతో వారు చెప్పారు. ఒకే మూసలో వెళితే కొనాళ్ళకి ప్రేక్షకులకి విసుగు పుడుతుందని వారి భావన. అయితే రొమాంటిక్ హీరోగా తనని ఆదరించిన తన అభిమానులు, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఢిష్యుం ఢిష్యుం పాత్రలలో ఆదరించరేమోనని ఖన్నా భయపడ్డారు. అందుకే ఆ ప్రపోజల్‌ని నిర్ద్వందంగా తిరస్కరించారు.
  
అప్పుడే పైకి వస్తున్న అమితాబ్ బచ్చన్‌ని సలీమ్ జావేద్‌లు ఊహించిన యాంగ్రీ యంగ్ మాన్ పాత్ర వరించింది. ఫలితంగా షోలే, జంజీర్, దీవార్ లాంటి సూపర్ హిట్ సినిమాలలో అమితాబ్ నటించారు. అదీగాక అప్పటి సామాజిక, ఆర్ధిక, రాజకీయ కారణాల వల్ల యువత యాంగ్రీ యంగ్ మాన్‌ని తన గుండెలకి హత్తుకొన్నది. దానితో క్రమంగా సూపర్ స్టార్ పీఠం నుండి రాజేష్ ఖన్నా స్థానాన్ని అమితాబ్ ఆక్రమించాడు.

అయితే విజయాలు, వసూళ్లతో నిమిత్తం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన కోట్లాది అభిమానుల గుండెల్లో మాత్రం అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ రాజేష్ ఖన్నా ఒక్కడే సూపర్ స్టార్.

No comments: