ఇప్పుడు టీవీల్లో ప్రకటనల్లోనూ, సినిమాలలోనూ కనిపించే అమ్మాయిలు సన్నగా పల్చటి పొట్టతో, ఎత్తైన వక్షాలతో, దొండ పండు పెదాలతో, తెల్లగా సున్నం కొట్టినట్లు ఉండే అందమైన పలువరసతో, కోటేరేసినట్లుండే ముక్కుతో తీర్చి దిద్దినట్లు కనిపిస్తూ అమ్మాయిలు అందరిమీద అలా కనిపించాలన్న ఒత్తిడి తెస్తున్నారు. అలా ఉంటేనే తాము అందంగా ఉన్నట్లు అన్న భ్రమలో అమ్మాయిలనే కాదు, నడి వయసు మహిళలని కూడా పడేస్తున్నారు. అందులో కనిపించె అందాలు మేకప్ ద్వారానో, ఆ మేని చాయ పోస్ట్ ప్రొడక్షన్‌లో అద్దిన డిజిటల్ మాయ అని, ఎత్తైన వక్షాలు ప్యాడింగ్ ద్వారా వచ్చినవి అని తెలుసుకోలేక పోతున్నారు.
ఈ మధ్య ఓ బ్రిటీష్ సంస్థ నిర్వహించిన సర్వేలో యాభై శాతం పైగా అమ్మాయిలు తమకి తెలివి తక్కువగా ఉన్నా సరే తమ వక్షాలు మాత్రం పెద్దవిగా ఉంటే చాలు అని కోరుకున్నారట. ఎందుకలా అంటే తమ తెలివికన్నా కూడా తమ రొమ్ముల సైజు బట్టే మగ వారు తమ పట్ల ఆకర్షితులవుతారని వారి వాదన. చాలా మంది అమ్మాయిలు పెద్ద రొమ్ముల కోసం తమ IQ ని వదులుకోవడం కోసం సిద్ధమే అని చెప్పారు. తమ తెలివికన్నా కూడా తమ వక్ష సౌందర్యమే ముఖ్యమని వారి భావన.
అమ్మాయిలు ఈ రకమైన అభిప్రాయాలతో ఉంటే రొమ్ముల సైజు పెంచడానికి, వాటి బిగువు పెంచడానికి ఆపరేషన్లు చేసే కాస్మెటిక్ సర్జరీ పరిశ్రమ మూడు రొమ్ములు, ఆరు ఆపరేషన్లుగా వర్ధిల్లుతూ ఉంటుంది.
2 comments:
moodu operationlu aaru rommulu ante inkaa apt ga untundi finishing sentance ;)
Yes, you are right.
Post a Comment