మన దేశానికి ప్రధానిగా పనిచేసిన వారిలో సమర్ధులైన అతి కొద్దిమందిలో పీవీ నరసింహారావు ఒకరు. ఇటీవల విచిత్రంగా ఆయన పేరుని వెలుగులోకి తీసుకొచ్చి మరీ బురద చల్లే కార్యక్రమం ఒకటి నడుస్తూ ఉంది. బాబ్రీ మసీదు కూల్చివేతకి ఆయన చేతకాని తనమే కారణమని, అక్కడ మసీదుని కూలుస్తూ ఉన్న సమయంలో ఈయన పూజ చేస్తూ ఉన్నారనీ ఇలా నానా రకాలుగా అవాకులూ చెవాకులూ పేలుతూ ఉన్నాయి మీడియాలో. అయితే పీవీ ఒక విజన్ ఉన్న ప్రధాని అన్న విషయం పెద్దగా వెలుగులోకి రాలేదు. ఆర్ధిక సంస్కరణలకు ఆయన మూల కారణం అయినా దానివల్ల ఆయనకు ప్రశంసలతో బాటు విమర్శలు కూడా వచ్చాయి. దేశాన్ని ప్రపంచ బ్యాంకు గుప్పెటలో పెట్టారనీ, బహుళజాతి సంస్థలకు గుత్తేదారుగా మారారని చాలా మంది ఆయన మీద గళమెత్తారు.
ఆయనలోని ఎవరూ విమర్శించలేని దార్శనికుడిని పరిచయం చేసే ప్రయత్నం ఈ పోస్టు.
ఆయన ప్రధానిగా ఉన్న కాలంలో రక్షణ శాఖకి కూడా ఆయనే మంత్రిగా ఉన్నారు. అప్పుడు ఒక సారి రక్షణ శాఖలో పని చేసే వివిధ విభాగాలకు చెందిన అధిపతులతో సమావేశమయ్యారు. అందులో భాగంగా సైంటిస్టులతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. "మీ మీద ప్రభుత్వం కొన్ని వందల కోట్లు ఖర్చు చేస్తూ ఉంది. మీరు కేవలం మిస్సైళ్ళు తయారు చేస్తే సరిపోదు. మీరు ఆవిష్కరించే పరిగ్నానం సాధారణ ప్రజలకు కూడా ఉపయోగపడాలి. అంతే తప్ప విధ్వంసానికి మాత్రమే ఉపయోగపడే ఆయుధాలు తయారు చేయడం ఒక్కటే మీ పని అని సరిపెట్టుకోవద్దు" అని చెప్పారు వారితో.
ఆ సమావేశంలో అప్పట్లో DRDO(Defence Research and Development Organisation) , హైదరాబాద్ కి నేతృత్వం వహిస్తూ ఉన్న అబ్దుల్ కలామ్ కూడా ఉన్నారు. ఆయన తిరిగి వచ్చి పివీ సలహాని ఆచరణలో పెట్టారు. అలా రూపు దిద్దుకొన్నదే కలాం-రాజు స్టెంట్. ప్రముఖ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ సోమరాజు గారితో కలిసి DRDO రూపొందించినదే ఈ స్టెంట్. గుండెకి రక్తం సరఫరా చేసే కరొనరీ ధమనులు సన్న బడి గుండె పోటుకి గురయిన రోగులకి ఆ సన్నబడ్డ చోట అమర్చే స్టెంట్‌లు అప్పటివరకూ విదేశాలనుంచి తెప్పించేవారు. వీటి ఖరీదు చాలా ఎక్కువగా ఉండేది. ఈ కలాం-రాజు స్టెంట్ వచ్చాక ఈ ఖర్చు చాలా తగ్గిపోయింది.
ఇక రెండవ ఆవిష్కరణ NIMS ఎముకల చికిత్స విభాగంతో కలిసి DRDO రూపొందించిన FRO అనే కాలిపర్. పోలియో సోకి కాళ్ళు చచ్చుబడ్ద పిల్లలు ఇనుప కాలిపర్లు ధరించి, అసలే బలహీనమైన కాళ్లతో వాటి బరువును మోయలేక అవస్థ పడుతూండడం గమనించిన కలాం గారు మిస్సైళ్లకి ఫైర్ ప్రూఫ్‌గా వాడే పదార్ధంతో ఈ పిల్లలకి ఉపయోగం ఏమైనా ఉంటుందా అని నిమ్స్‌లో ఆర్థోపెడిక్ చీఫ్‌గా ఉంటున్న డాక్టర్ బీఎన్ ప్రసాద్ గారిని సంప్రదించారు. ఈ ఫైబర్ గ్లాస్ మెటీరియల్ చాలా ధృఢంగా, తాకువ బరువుతో ఉన్నందువలన దానితో తయారు చేసిన కాలిపర్ అతి తక్కువ బరువుతో ఉంటుందని ఈ FRO అనే కాలిపర్‌ని తయారు చేసి అందించారు. అది పొలియో పిల్లలకి వరప్రసాదిని అయింది.
మిస్సైళ్ళు తయారు చేసే సైంటిస్టులని ఆ పరిగ్నానం సమాజ హితానికి వాడాలని పురి కొలిపిన పీవీ నరసింహారావు గారి దార్శనికతకి తగిన ప్రచారం దొరకక పోవడం ఈ దేశం చేసిన తప్పు. రాజీవ్ విమానాశ్రయం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ అది, రాజీవ్ ఇది అని ఒక కుటుంబం భజన చేసే ఈ పిగ్మీలకి ఎంతో ఎత్తున ఉన్న ఆయన కనిపించకపోవడంలో వింతేమీ లేదు.
9 comments:
Maa inlto bathroom ki peru pettamu sir
Rajeev marugu doddi,
Indira barrala chavidi
Excellent.
పీవీ నరసింహారావు గారి దార్శనికతకి తగిన ప్రచారం దొరకక పోవడం ఈ దేశం చేసిన తప్పు. రాజీవ్ విమానాశ్రయం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ అది, రాజీవ్ ఇది అని ఒక కుటుంబం భజన చేసే ఈ పిగ్మీలకి ఎంతో ఎత్తున ఉన్న ఆయన కనిపించకపోవడంలో వింతేమీ లేదు.
Agree. A very good post.
Only one fly over in Hyd connecting to air port was named as PV Narasimha Rao express fly over during Ysr govt.
ivala kakapote repu aina, sonia chanipoyaka ameki ekkada cancer undo telustundi janalaki. appudu janalu notito navvaru. Let us try to learn from the bright side of the leaders. The pigs always look at dark sides.
కావాలనే కాంగ్రేస్ వాదులు చేసిన పరమ దిక్కు మాలిన పని. పీవీ గారు లేకుంటే వారి పరిస్థితి ఏమిటో తెలుసుకోలేనంత దౌర్భాగ్యం.నెహ్రు కుటుంబ చాయలను౦చి భారత్ బయటకు వస్తేనే ముందుకు అధిగమి౦చకలదు.
మీతో ఒక్క విషయంలో విభేదిస్తున్నాను, మీరు పిగ్మీల పరువు తీస్తున్నారు.
Sorry if I had insulted pygmies.
Well said...!!!
Post a Comment