ఈ మధ్య పోలీసు బాసులకు క్షుద్ర విద్యల మీద పెరిగిన మోజు ఎంతగానో ఆహ్వానించదగ్గ పరిణామం. సాంప్రదాయ పోలీసింగ్‌తో పోలిస్తే ఇందులో చాలా అడ్వాంటేజీలున్నాయి. ఉదాహరణకి మొన్నటికి మొన్న చేతులకి కాళ్ళకి బేడీలు ఉన్నా పది మంది పోలీసులకి టోకరా ఇచ్చి పారిపోయిన సైకో సాంబడిని వందల మంది పోలీసులు వెదికినా పట్టుకోలేక పోయారు. అదే ఈ విద్యలతో ఒక శ్మశానంలో కూర్చుని ఒక అర్ధరాత్రినాడు ఏ చేతబడో, చిల్లంగో, కాష్మోరానో ప్రయోగించామనుకోండి. ఎక్కడ ఉన్నా రక్తం కక్కుకొని అక్కడికక్కడే చస్తాడు వెధవ. ఇదే విధంగా నిన్నటికి నిన్న తడ దగ్గర ఆర్టీసీ బస్సులో ముగ్గురిని నరికి చంపిన హంతకుడి ఆట కూడా కట్టించవచ్చు.
మరింత పైలెవెల్లో ఆలోచిస్తే మన దేశంలో నేరాలు చేసి పాకిస్తాన్ వెళ్ళి తల దాచుకొనే దావూద్ ఇబ్రహీమ్, లష్కర్, ఆల్ ఖైదా లాంటి ఉగ్రవాదులని కూడా ఇక్కడి నుంఛే ఫినిష్ చేసి పారేయవచ్చు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశాక దాన్ని చూపించి అమెరికా హిట్ లిస్టులో ఉన్న తాలిబాన్, ఆల్ ఖైదా ఉగ్రవాదులని చంపడానికి అమెరికా వాళ్ళతో మిలియన్, బిలియన్ డాలర్ల కాంట్రాక్టు కుదుర్చుకొని వాళ్లని చంపడం ద్వారా పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం సంపాదించవచ్చు.
కాబట్టి మన బాసులు వెంటనే విషాచి, కాద్రా, దార్కా, మంత్ర ద్రష్ట, తంత్ర లాంటి పేరు మోసిన మాంత్రికులని వెతికి పట్టుకొని వాళ్ళని పోలీస్ విభాగంలో ఉద్యోగులుగా చెర్చుకుని పని మొదలు పెడితే మంచిదేమో. ఎవరయినా నేరగాడు ఏదైనా పెద్ద నేరం చేసినప్పుడు వీళ్ళు వెంటనే శ్మశానానికి వెళ్ళి తమ పని మొదలు పెడుతారు. అందుకు వీలుగా ప్రతి ఊరిలో శ్మశానంలో ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసి దానికి వీరిని ఇన్‌చార్జిగా నియమిస్తే సరిపోతుంది.
1 comment:
భలే వాళ్ళే
తీవ్రవాదుల మీద, నేరస్తుల మీదా కాదు.
పెద్ద బాసు మీద కింద వాళ్ళు, ఉన్నత పదవికి పోటీ వచ్చాడని పక్కనాయన మీద,
వాళ్ళల్లో వాళ్ళే చేతబడులు, చేసుకుంటూ ఉంటారు.
ఏదైనా పని మీద స్టేషన్ కి వచ్చిన వాళ్ళని లంచం అడగటం మానేసి
"కాస్త ఫలానా అయన మీద కాష్మోర, క్షిత్ ప్రయోగించి రండి మీ పని చేసి పెడతాం" అంటారేమో.
రోజులు మారాయి..!!
Post a Comment