నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, June 7, 2011

భార్యలు వేశ్యలలాగా మొగుళ్ళని తృప్తి పరచాలి




ఈ కూత ఇక్కడ ఎవడైనా కూసి ఉంటే బృందా కారత్, సంధ్య, దేవి, గంగా భవాని లాంటి తరచు టీవీల్లో కనిపించే ఆడంగులందరూ చెప్పులూ, చీపుర్లు పట్టుకొని వాడికి బడితె పూజ చేయడం ఖాయం. అయితే ఈ మాట చెప్పింది ఒక స్త్రీ, పైగా డాక్టరు అందులోనూ మలేషియాలో కాబట్టి బతికి పోయింది. 


    
రోహాయా మహమ్మద్ అనే ఓ మలేషియా డాక్టర్ విధేయురాళ్ళైన భార్యల క్లబ్ (obedient wives club) అనే దాన్ని స్థాపించి పెళ్ళయిన ఆడవారికి ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం కనుగొనే పనిలో ఉన్నారు. ఆమె సిద్ధాంతమేమిటంటే గృహ హింసకీ, వ్యభిచారానికీ, విడాకులకీ పెళ్ళాలు మొగుళ్ళకి పడక సుఖం సరిగా అందించలేకపోవడమే. ఆ పని భార్య సరిగా నిర్వర్తించగలిగితే మొగుడు భార్యని తన్నడం కానీ, ఆమెని వదిలి పరాయి ఆడవాళ్ళ వెనక పడడం కానీ చేయడు. 


" సెక్స్ గురించి మాట్లాడం ఇస్లాంలో నిషిద్ధం. అందుకే వివాహ వ్యవస్థలో దానికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వము. కానీ అన్ని సమస్యలకీ అదే మూల కారణం. మంచి పెళ్ళాం అంటే మొగుడిని మంచి వేశ్యలాగా సుఖపెట్టాలి. మొగుడి దగ్గర భార్య వేశ్యలాగా ప్రవర్తిస్తే తప్పేమిటి?" అన్నారు రొహాయా శనివారం ఈ క్లబ్ ప్రారంభిస్తూ. భార్య పని ఇంటిని శుభ్రంగా ఉంచడం, పిల్లల్ని బాగా పెంచడంతోనే ఆగిపోదు. మొగుడ్ని అన్ని విధాలుగా సుఖపట్టినప్పుడే ఆ కుటుంబం కలతలు లేకుండా ఉంటుంది. మొగుడు ఇంటికొచ్చేసరికి పెళ్ళాం అందంగా అలంకరించుకొని శృంగారం ఒలికిస్తూ అతనికి ఎదురవ్వాలి అని కూడా సెలవిచ్చిందీ డాక్టరు. దంపతుల మధ్య సెక్స్ సరిగా లేకపోవడమే మలేషియాలో విడాకులు పెరిగిపోవడానికి కారణం అని ఈమె ఉద్ధేశ్యం. 
       
ఈ క్లబ్‌ని కౌలాలంపూర్‌లో ప్రారంభించిన మొదటిరోజునే 800 మంది సభ్యులుగా నమోదు చేయించుకున్నారు. ఇందులో సభ్యురాళ్ళుగా చేరిన వారికి వంటా వార్పు, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం లాంటి అంశాలతో బాటు సెక్స్ పాఠాలు కూడా చెప్తారట. 

"పడక మీద వేశ్యలాగా, లేదా ఆమెకన్నా బాగా సుఖం అందించే భార్య ఉన్నపుడు పక్కదారులు పట్టాలన్న ఆలోచన ఏ మగవాడికీ రాదు. కాబట్టి మొగుడికి తప్పు చేయాల్సిన అవసరం రాకుండా భార్య అతడి అవసరాలు అన్నీ తీర్చగలగాలి" రొహాయా మహమ్మద్ మాటల్లో OWC ఫిలాసఫీ ఇది.

అయితే మహిళా సంఘాలు ఇదంతా చెత్తకింద కొట్టి పడేస్తున్నాయి. తప్పు చేయాలనుకొన్న మగవాడు ఇంట్లో రంభ ఉన్నా పక్కదారులు పడుతూనే ఉంటాడు అని విరుచుకు పడ్డాయి. Facebook లో anti-OWC ఫోరమ్ ఒకటి మొదలుపెట్టారు వీళ్ళు. మలేషియాలో ఉన్నత విద్యా సంస్థల్లో మగవారికన్నా అడవారి సంఖ్య ఎక్కువ. అయినా సమాజంలో ఆడవారి పట్ల వివక్ష ఎక్కువగా ఉంది. ఇలాంటి క్లబ్‌ల వల్ల అది ఇంకా ఎక్కువ అవుతుంది అని ఈ సంఘాలు   రొహాయాని తిట్టి పోస్తున్నాయి. 


చాలామంది మగవారు కూడా ఈ ఫిలాసఫీని అంగీకరించడం లేదు. దాంపత్యంలో మగవారు పెళ్ళాలని కేవలం పడకసుఖం అందించే యంత్రాలుగానే చూస్తారనుకోవడం తప్పు అని రొహాయా సిద్ధాంతాన్ని ఖండిస్తున్నారు.

13 comments:

Praveen Mandangi said...

ఆవిడని మహిళా తాలిబాన్ అనొచ్చు. అగ్నిహోత్రావధానుల కాలంలో కూడా స్త్రీలు భర్తలకి పాదదాసీలుగా ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో వ్యభిచారం లేదనుకోవాలా? ఒకప్పుడు పరలాకిమిడి పట్టణంలో భోగం(వ్యభిచారం చేసే కులం)వాళ్ళు ఉండేవాళ్ళని చెపితే విని నవ్వుకునేవాళ్ళం. అప్పట్లో వ్యభిచారంపై నిషేధం లేదు. అప్పట్లో భోగం స్త్రీలతో తిరగడం మగతనం అని అందరూ అనుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా అలాగే అనుకుంటే సమాజం వెనక్కే నడుస్తుంది.

శరత్ కాలమ్ said...

'శయనేషు రంభా' అని అందుకే అన్నారు కదా మన పెద్దలు. ఇప్పుడేమో శయనేషు టివి, ఇంటర్నెట్టూ అయిపోయాయి మరి. నుష్టుగా ఇంట్లోనే భోజనం దొరికినప్పుడు ఆ భుక్తాయాసం వల్ల హోటలుకో, పక్కింటికో వెళ్ళి తినాలన్నత ఆసక్తీ, ఓపికా అంతగా వుండదు. విషయం అంత సింపుల్. దానికీ మినహాయింపులు వుంటయ్యా అంటే వుంటయ్యి మరి.

Praveen Mandangi said...

భర్త భార్యకి పడక సుఖం ఇవ్వలేకపోతే భార్య గిగోలో దగ్గరకి వెళ్ళడానికి భర్త ఒప్పుకుంటాడా? అటువంటప్పుడు భర్త వేశ్య దగ్గరకి వెళ్ళడానికి భార్య ఎందుకు ఒప్పుకోవాలి?

Anonymous said...

అంటే భర్త వేశ్య దగ్గరికి వెళ్ళేటప్పుడు భార్యకి చెప్పి పోతాడా ప్రవీణు?

Anonymous said...

రేపు నీ భార్య పడక గదిలో వేశ్యలా ప్రవర్తించు అని అడుగుతావ ప్రవీణు ? అది స్త్రీ హక్కుల ఉల్లంఘన కదా??

Praveen Mandangi said...

ఒకప్పుడు మగతనం పేరుతో మగవాళ్ళు వ్యభిచారం ఓపెన్‌గానే చేసేవాళ్ళులే. అప్పుడు భార్యలకి తెలిసినా ధైర్యం లేక ముఖం మీద చీర కొంగు వేసుకుని బాధ పడేవాళ్ళు.

Anonymous said...

మొహం మీద కొంగు లేకపోతె బాధ రాదా ప్రవీణు

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

భోగం వాళ్ళు ఒక్క పర్లాకిమిడిలో ఏం ఖర్మ. అన్ని చోట్లా ఉన్నారు. పెద్దాపురం సంగతి మర్చిపోతే ఎలా?

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఇంట్లో ఫూటుగా లాగించాక అలా బయటకెళ్ళి ఒక కిళ్ళీ వేసుకొద్దామన్న ఆలోచన ఆ ధ్యాస ఉన్న వాడికెప్పుడూ ఉంటుంది, శరత్.

Praveen Mandangi said...

పరలాకిమిడి ఇప్పుడు ఒరిస్సాలో ఉంది. ఒకప్పుడు అది జమీందారీ సంస్థానం. జమీందార్లు భోగం కులానికి చెందిన స్త్రీలనే ఉంపుడుగత్తెలుగా ఉంచుకునేవాళ్ళు. ఆ భాగ్యం కోసం భోగంవాళ్ళు పరలాకిమిడిలో స్థిరపడ్డారు. పెద్దాపురం, వేల్పూరు కూడా ఒకప్పుడు జమీందార్ల రాజధానులే. భూస్వామ్య దురాచారమైన వ్యభిచార వృత్తిని పెట్టుబడిదారీ సమాజంలో జస్టైఫై చెయ్యడం సమాజాన్ని వెనక్కి నడిపించడమే అవుతుంది.

Apparao said...

శయనేషు రంభ అని నేను కామెంట్ రాద్దాం అని అనుకున్న , మన శరత్ గారు రాసేసారు

Praveen Sarma - http://telugumedia.asia said...

భార్యని వేశ్యలాగ చూస్తే స్త్రీ-పురుష సమానత్వం రాదు నాయనా. శృంగారానికీ, వ్యభిచారానికీ మధ్య తేడా ఉంది.

Praveen Mandangi said...

ఇండియాలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు నాయనా. http://stalin-mao.net.in/85914991 సెక్స్ గురించి మాట్లాడడం తప్పు కాదు అంటారు, పైగా అమ్మాయిలకీ, అబ్బాయిలకీ వేర్వేరు సెక్స్ తరగతులు పెడతారు.