మొన్న ప్రొఫెసర్ జయశంకర్ అంత్యక్రియలలో చోటు చేసుకున్న అరాచకత్వం ఆయన కూడా హర్షించి ఉండేవారు కాదు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం మడిమ తిప్పకుండా పోరాడిన వ్యక్తి ఆయన. ఆయన వేర్పాటువాదాన్ని హర్షించని వారు కూడ ఆయన విధానాల పట్ల ఎన్నడూ విమర్శలు చేయలెదు. ఆ అవకాశం ఇవ్వకుండా ఆయన పోరుబాట నడిచింది. ఉద్యమం పేరిట డబ్బు దండుకోవడం, దందాలు చేయడం లాంటి చిల్లర పనులకు ఎన్నడూ పాల్పడలేదు కాబట్టి వ్యక్తిగతంగా ఆయన ఎన్నడూ విమర్శలనెదుర్కోలేదు. అలాంటి వ్యక్తి అంతిమ సంస్కారానికి హాజరయిన కాంగ్రెస్, తెదేపా నాయకులమీద హింసకు పాల్పడడం అన్నది అనుచితమైన చర్య, అది వేరే విషయం. ఇక్కడ టాపిక్ అది కాదు.
తెలంగాణా కార్యకర్తల చేత చీపురు దెబ్బలు, చెప్పుయ్ దెబ్బలు, చావు దెబ్బలు తిన్న మంత్రి శంకర్ రావు ఎలా తెలివిగా ఆ దెబ్బలని తెలంగాణా ద్రోహులు, సీమాంధ్ర వ్యక్తుల ఖాతాలోకి నెట్టేశారన్నది ఇక్కడ టాపిక్.
చావు దెబ్బలు తిని, పోలీసుల అండతో గుద్దలు చినిగి బయట పడ్డ శంకర్రావు తనని తెలంగాణా తమ్ముళ్ళు చావగొట్టారని చెప్పుకోవడానికి సిగ్గు పడ్డాడో, లేక తన స్వంత గడ్డామీద తన వారి చేతుల్లోనే తన్నులు తిన్నానని చెప్పుకోవడానికి అహం అడ్డొచ్చిందో కానీ తనని కుమ్మిపారేసింది అంత్య క్రియలలో పాల్గొనేవారి ముసుగులో ఉన్న ఉద్యమ వ్యతిరేక శక్తులు, సీమాంధ్ర వ్యక్తులు అని చెప్పుకొని సంబరపడ్డాడు.
శంకరన్నా, నీకు బడితె పూజ చేసింది తెలంగాణా వాళ్ళే అని నీకు తెలియదా? ఉద్యమం పేరు చెప్తూనే, మంత్రి పదవిని అంటి పెట్టుకొని ఉద్యమ ద్రోహం చేస్తున్నావని నీమీద వారికి కోపంగా ఉందన్న విషయం నీకు తెలియదా? రేప్పొద్దున ఈ పదవులు నాకొక లెక్కా కాదు, పక్కా కాదు, తొక్కలో మంత్రి పదవి నాకొద్దు, ఉద్యమమే నాకు ముద్దు అని రాజీనామా విసిరి కొడితే, నిన్ను చెప్పులతో కొట్టిన వాళ్ళే నిన్ను భుజాల మీద ఊరేగిస్తారని కూడ నీకు తెలుసు కదా?
అయినా నా పదవి నాకు ముఖ్యం అనుకునే నీలాంటి వాళ్ళు ఉద్యమాల జోలికి, ఉద్యమకారులున్న చోటికీ వెళ్ల కూడదు. ఇల్లూ, అసెంబ్లీ దాటి మరో చోటికి పోకుండా రోజులో రెండు మూడు సార్లు సోనియమ్మ నామ జపం చేసుకుంటూ, ఇలా ఎవరైనా చనిపొయినప్పుడు ప్రెస్‌నీ, మీడియానీ ఇంటికే పిలిపించుకొని ఈ సంతాప సందేశం పడేస్తే సరిపోతుంది కదా! ఇలా ఎండల్లో చెమట్లు కక్కుకుంటా పోవడమెందుకు, చావుదెబ్బలు తిని వొళ్ళు, గుడ్దలూ పాడు చేసుకోవడమెందుకు, అకారణంగా ఆ పాపాన్ని మరెవరిమీదకో తోసి ఇంకొంచెం పాపం మూటగట్టుకోవదమెందుకూ చెప్పరాదే?
No comments:
Post a Comment