నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, June 29, 2011

ఎన్ని తరాలు అనుభవిస్తారు రిజర్వేషన్లు?


మనకి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళవుతున్నా ఇంకా రిజర్వేషన్లు ఉండాలా అన్నది పెద్ద ప్రశ్న. రిజర్వేషన్లు ఉండాలని రాజ్యాంగంలో ప్రతిపాదించిన అంబేడ్కర్ కూడా పది సంవత్సరాలు ఉంచి తరువాత ఎత్తేయమని చెప్పాడు. అయితే ఇది తేనె తుట్టె కాబట్టి ఏ ప్రభుత్వమూ రిజర్వేషన్లు ఎత్తి వేసే పని పెట్టుకోలేదు. అలాగే నేను కూడా ఆ జోలికి పోదలుచుకోలేదు. 


  
ఇక్కడ టాపిక్ ఏమిటంటే ఒక కుటుంబలో ఎన్ని తరాలైనా రిజర్వేషన్లు అనుభవించవచ్చా అన్నది. ఒక తరంలో రిజర్వేషన్ ద్వారా డాక్టరో, ఇంజనీరో, ఐయ్యేయెస్సో, ఐపీయెస్సో అయ్యాక వాళ్ల పిల్లలు కూడా రిజర్వేషన్ కోసం పోటీ పడితే వాళ్ళతో సామాన్య బీసీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబంలోంచి వచ్చిన పిల్లలు పోటీ పడగలరా? 


 
ఇలా ఆ కుటుంబాల్లోని తర తరాలుగా రిజర్వేషన్ ఫలితాలు దక్కుతూ ఉంటే ఒక సాధారణ మాదిగ, మాల, కుమ్మరి, చాకలి, వడ్రంగి వారికి అభివృద్ధి ఫలాలు దక్కేదెన్నడు? ఈ దళిత, బీసీ నాయకులు ఎప్పుడూ మాకు రాజ్యాధికారం కావాలి అనో, ఎస్సీలను వర్గీకరించాలి అనో, లేక వర్గీకరించకూడదు అనో గొడవ చేస్తూ ఉంటారు కానీ తమ వర్గాల ప్రజలందరికీ ఉపయోగపడేలా క్రీమీ లేయర్‌ని రిజర్వేషన్ పరిధిలోంచి తప్పించాలని ప్రతిపాదనలు చేయరెందుకో? అలా చేస్తే తమకి కూడా బొక్క పడుతుందన్న భయమా?

15 comments:

సత్యాన్వేషి said...

మీపాయింటు బాగుంది. నాఉద్దేషంలో కూడా ఒక కుటుంబంలో ఒకరికి రిజర్వేషన్‌ద్వారా ఒక మంచి ఉద్యోగమో, ప్రొఫెషనల్ కోర్సులో చదువో చేసే అవకాశం వస్తే తరువాతి తరానికి రిజర్వేషన్ ఉండగూడదనేది. కానీ ఆచరణలో ఇది మనదేశంలో సెంట్రలైజ్డ్ డేటాబేస్ లేనంతవరకూ సాధ్యం కాదు. సర్టిఫికేట్ ఇష్యూ చేసేవాడికి ఆసమాచారం ఉండాలి.

Praveen Mandangi said...

నాకు ST కోటాలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నా వెళ్ళలేదు. వ్యాపారం పెట్టుకుని సంపాదిస్తున్నాను.

Anonymous said...

chala baga chepparu

Praveen Mandangi said...

మాదిగల కంటే వెనుకబడిన కులాలు ఉన్నాయి. అవి రెల్లి, బుడగ జంగం, దండోరా కులాలు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, పాలకొల్లు మునిసిపాలిటీలలోని స్కావెంజర్స్(పాకీవాళ్ళు) ఎక్కువ మంది రెల్లి కులస్తులే. బుడగ వాయించుకుంటూ అడుక్కునే బుడగ జంగాలూ, శవాల దగ్గర డప్పులు వాయించే దండోరాలూ మాదిగల కంటే వెనుకబడినవాళ్ళే. వీళ్ళకి రిజర్వేషన్ సౌకర్యాలు అందవు. దళితుల్లో ఆర్థికంగా ముందున్న మాల, ఆది ఆంధ్ర కులాలవాళ్ళకీ, రాజకీయంగా ముందున్న మాదిగ కులంవాళ్ళకీ రిజర్వేషన్‌లు ఎక్కువగా అందుతాయి.

Anonymous said...

babu praveen, sarma ani peru pettukuni ST ela ayyavu?

Praveen Mandangi said...

నా అసలు పేరు ప్రవీణ్ కుమార్. భాగ్యరెడ్డివర్మ అని తన పేరుని మార్చుకున్న మాదరి బాగయ్య అనే దళితుని చరిత్ర చదివిన తరువాత నా పేరు ప్రవీణ్ శర్మ అని మార్చుకున్నాను.

Anonymous said...

ప్రవీణ్,
అధికారికంగా మార్చుకున్నారా? ఇలా బ్లాగుల్లో రాయడానికేనా?

Krishna Reddy said...

Very good post, Krishna.

Pradeep said...

Good post Sir. I want to hear something [+ve or -ve .. something] from Katthi Mahesh Kumar

Anonymous said...

నాయనా ప్రవీణ్ కుమార భాగ్యరెడ్డివర్మా, 'బాషా' లో రజనీకాంతు, 'నరసింహనాయుడు' లో బాలయ్యబాబుల కున్నంత బేగ్రౌండుందన్నమాట తవరికి. ముందూ వెనకా చూసుకోకుండా తుసుక్కున ఈ ఫ్లేషుబేకు మామీద వదిలేసేవేవిటి? సరిలేరునీకెవ్వరూ...

Anonymous said...

నేను ఇంతకముందు జంగారెడ్డిగూడెంలో 'జావా' నేర్చుకుంటున్నప్పూడు, ఒక బి సి యువకుడు సఖినేటిపల్లి నుంచి వచ్చి, సాఫ్టువేరు నేర్పించమన్నాడు. నేను నేర్పించేలోగా 'సి+' మీద మోజుతో చింతపల్లి వెళ్లిపోయాడు. నేను ఓ.సీ. లో వున్నాకూడా, వెనకబడ్డవాళ్లకు సహాయం చెయ్యడంలో మార్క్సు, ఎంజెల్సులకంటే ముందు.
No prizes for guessing who am I.

Anonymous said...

రిజర్వేషన్ల గురించి పోస్టు కదా, ఇంకా బ్లాగ్లోక వితండవాది గారి కామెంటు పడలేదేమిటబ్బా?

కరవాలము తుప్పట్టి మూలక్కూర్చున్నట్టున్నదే!

Praveen Mandangi said...

ఆ వితండవాది కొన్ని సార్లు భోపాల్‌లో ఉంటాడు కదా, టైమ్ లేక కామెంట్ వ్రాయలేదేమో. కత్తి మేతావికి సమాధానం అడగడం అవసరమా? క్రీమీలేయర్ గురించి నేను మాట్లాడినప్పుడు "నీకు లక్ష రూపాయలు ఫ్రీగా ఇస్తే కాదంటావా?" అని నన్ను అడిగాడు. పది రూపాయలు ఫ్రీగా తీసుకుంటే అడుక్కునేవాడిలా తీసుకున్నట్టు, లక్ష రూపాయలు ఫ్రీగా తీసుకుంటే అభ్యుదయం ఈ మేతావుల దృష్టిలో.

sree said...

అంబేద్కర్ ఒక ఆశయంతో సామాజిక న్యాయం కోసం రిజర్వేషన్ పెట్టి పదేళ్ళలో సమన్యాయం సాధించమన్నాడు. కాని దానిని మన రాజకీయ పార్టీలు తమ కుతంత్రాలకు వాడుకుని ఈనాటి పరిస్థితి తెచ్చాయి. చాలామంది అంబేద్కర్ ని విమర్శిస్తున్నారు కాని నిజానికి తప్పు మనది, మన పార్టీలది.

Praveen Mandangi said...

రిజర్వేషన్‌లతో ప్రయోజనం ఎంత అల్పమైనదంటే BCలలో కేవలం 1% మందే రిజర్వేషన్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. మెజారిటీ BCలు పల్లెటూర్లలో వ్యవసాయం చేసుకుంటూ ఉండిపోతున్నారు.