సెల్ ఫోన్ అధికంగా వాడడం వలని కేన్సరొచ్చే ప్రమాదం ఉందని ఈ మధ్య పత్రికల్లో, టీవీ చానల్స్‌లో తెగ ఊదరగొట్టేస్తున్నారు. అయితే ఇది ఇదమిద్ధంగా తేల్చి చెప్పలేమని, ఇందులో చాలా అంశాలున్నాయని, ఏ విషయం ఖచ్చితంగా తేల్చి చెప్పడం వీలు కాదని సెల్ ఫోన్ ఎక్కువగా వాడే వారిలో మెదడుకి సంబంధించిన కేన్సర్ అధికంగా రావొచ్చు అని నిపుణులు చెప్తున్నారు.
అయితే సెల్ ఫోన్ అధికంగా వినియోగించడం వలన కేన్సర్ వస్తుందో రాదో అన్న విషయం అటుంచితే దీనిని చదివి ఏ ఒక్కరైనా గుడిలోనో, మీటింగుల్లోనో. సినిమా హాలులోనో, బైక్ మీద పోయేటప్పుడు భుజానికి చెవికి మధ్య సెల్ ఫోన్ ఇరికించుకొని మాట్లాడుతూ పోయేటప్పుడో ఈ సెల్ వాడకం తగ్గిస్తే ఈ వార్నింగు కొంతమేరకయినా సార్ధకమయినట్లేకదా!
2 comments:
సెల్ ఫోన్‍లు స్విచ్ ఆఫ్ చేసి ఉంచవలెను అని బోర్డ్ పెట్టిన ఆఫీసుల్లో నిలబడి సెల్ ఫోన్‍లో మాట్లాడేవాళ్ళు ఉన్నారు.
అవును ప్రవీణ్. మనకి ఏదైనా చేయవద్దు అన్న బోర్డు చూడగానే ఆ పని చేయాలనిపిస్తుంది.
Post a Comment