ఇటీవల అమెరికాలో బ్రెస్టారెంట్లు ఎక్కువగా వెలుస్తున్నాయి. ఇవి ఆర్ధిక మాంద్యాన్ని సైతం తట్టుకొని లాభాలనార్జిస్తున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే breastaurant అంటే breast చూపించే అమ్మాయిలున్న restaurant అని అర్ధం. ఇక్కడ సర్వ్ చేసే వాళ్ళు అమ్మాయిలే అయి ఉంటారు. వాళ్ళు కురచ నిక్కర్లు, బిగుతు జాకెట్లు వేసుకుని, ఒక మాటలో చెప్పాలంటే ఇపుడొస్తున్న తెలుగు, హిందీ సిన్మాల హీరోయిన్లలా ఉంటారన్నమాట.
అందాలు చూపితే మాత్రమె సరిపోదు. మేము ఆహారం కూడా మంచి క్వాలిటీతో అందిస్తాము అని చెప్పుకుంటారు ఈ బ్రెస్టారెంట్ల యజమానులు. Twinpeaks , muga n jugs, hooters, burger girl, honey schack ఇవి కొన్ని ఈ టైపు రెస్టారెంట్ల పేర్లు.
అమెరికాలో విజయవంతమయ్యాక ఆ ఊపుతో యూరప్‌ని కూడా ఆక్రమించుకోవడానికి ఈ రెస్టారెంట్ల యజమానులు ప్రణాళికలు సిద్ధం చేసుకొంటున్నరు.
అలా అని ఇందులో పని చేసే అమ్మయిలు అశ్లీలంగా వేషధారణతో ఉంటారు అంటే వీళ్ళు ఒప్పుకోరు. మా అమ్మాయిలు ఏం చూపించాలో అంతవరకే చూపిస్తారు. ఏం చూపకూడదో అది చూపించరు అని సమర్ధించుకుంటారు. అయితే ఈ రెస్టారెంట్లు అశ్లీలతని పోషిస్తున్నాయని సంప్రదాయవాదులు దుమ్మెత్తి పోయడమే కాకుండ తమ ప్రాంతంలో ఇవి ఉండడానికి వీల్లేదని కోర్టులకు కూడా ఎక్కుతున్నారు.
వీటిలో పని చెసే అమ్మాయిలు ఏం చూపినా, ఏం చూపకపోయినా వీళ్ళ బ్యాలన్సు షీట్లు మాత్రం లాభాలనే చూపిస్తున్నాయి.
3 comments:
ఆరోగ్యశ్రీ గురించి ఈ మధ్య వ్రాయడం లేదేం?
మొన్ననే ఒక డాక్టరు ఫ్రెండు ఆరోగ్యశ్రీలో మరొక కోణాన్ని ఆవిష్కరించాడు. దాని గురించి రాస్తాను.
Nic
Post a Comment