మహిళలకి, దళితులకి రాజ్యాధికారం కావాలి అప్పుడే ఆ వర్గాల ప్రజలకి న్యాయం జరుగుతుంది, రక్షణ లభిస్తుంది అని ఆ వర్గాల నాయకులు అదే పనిగా ఊదరగొడుతూ ఉంటారు ఎక్కడ అవకాశం దొరికినా. కానీ ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌లో ఒక దళిత మహిళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత మహిళల మీద ఇబ్బడిముబ్బడిగా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. దళితులకి, మహిళలకీ రాజ్యాధికారం లభించి ఏమి ఒరిగింది?
ముఖ్యమంత్రిగా తన రాష్ట్రంలో మహిళలకి రక్షణ కల్పించలేక తాను దళిత వర్గానికి చెందిన దాన్ని కావడం వల్ల విపక్షాలు తన మీద దాడి చేస్తున్నాయని ఒక కుంటిసాకు చెబ్తూ చాలా కన్వీనియెంట్‌గా తన తప్పుని కప్పిపుచ్చుకొనే దారి ఎంచుకొంది మాయావతి.
ముఖ్యమంత్రి అయ్యుండీ తన బాధ్యత నెరవేర్చలేక నేను దళితురాలిని కావడం వల్లనే నా మీద అభాంఢాలు వేస్తున్నారని విపక్షాల మీదపడి ఏదవడానికి కనీసం సిగ్గయినా అనిపించలేదు ఈ నాయకురాలికి.
అయినా దళిత, బలహీన వర్గానికి చెందిన మహిళ ఆమెలా వేయి రూపాయల నోట్లతో చేసిన దండలు చేసుకుని ఊరేగుతారా? కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిలువెత్తూ పాలరాతి విగ్రహాలు పెట్టించుకొంటారా? ఒక స్థాయి నాయకులు కూడా ప్రతి చిన్నదానికి కులం కార్డు బయటికి తీసి నేను ఫలానా కులం వాడిని కాబట్టే నామీద అభియోగాలు మోపుతున్నారు అని ఏడ్చి చావడం ఎంతవరకూ సబబో వారికే తెలియాలి.
6 comments:
well said.
Thanks VV.
కాస్త ఇటొచ్చి చూస్తారా ?
http://analysis-seenu.blogspot.com/2011/06/blog-post_28.html
prathi okkaru ala gaddi pettali
Very well said.
కోట్లు సంపాదించినవాళ్ళు దళితులైతే ఏమిటి, OCలైతే ఏమిటి? కులం, మతం అనేవి ఊహాజనితం. డబ్బు అనేది నిజం.
Post a Comment