చైనాని కుదిపేసిన భారీ టెలికాం కుంభకోణం అన్న హెడ్ లైన్ చూసి ఓహో ఇప్పుడు ప్రపంచమంతటా టెలికాం కుంభకోణాల సీజన్ నడుస్తుందేమో అని ఆసక్తిగా వార్త చదివాను. భారీ కుంభకోణం, చైనాని కుదిపేసింది అన్న వర్ణన చదివి ఎన్ని లక్షల కోట్ల కుంభకోణమో అనుకున్నాను ఎంతైనా చైనా ఎకానమీ మన కన్నా పెద్దది కదా!
తీరా చూస్తే ఆ కుంభకోణం మొత్తం అంతా కలిసి అక్షరాలా రెండు వందల కోట్ల రూపాయలు. థూ.. కొంచెమైనా సిగ్గుండాలి. ఇదీ ఒక కుంభకోణమే, అందునా భారీ కుంభకోణం అని చెప్పుకోవడానికి సిగ్గుండక్కర్లా?
అసలు కుంభకోణమంటే మన రాజా, రాడియా అండ్ కంపెనీ చేసింది. అక్షరాలా లక్షా అరవై అయిదు వేల కోట్ల రూపాయల కుంభకోణం. ఓ మోస్తరు లెక్కలొచ్చిన వాడు కూడా ఆ సంఖ్యని పేపర్ మీద రాయమంటే కష్టపడేంత సంఖ్య అది.
రెండొందల కోట్లు, మూడొందల కోట్లు.. ఇవన్నీ కూడా భారీ కుంభకోణాలంటే ఎలా?
5 comments:
vallu inka develop avvali . manadi chala developed country ee vishayamlo
అలాంటి న్యూస్ ప్రచురించి అనవసరంగా న్యూస్ ప్రింట్ వేస్టు చేస్తున్నారు మన మీడియా వాళ్ళు ... ఇప్పుడున్న పరిస్థితులలో కనీసం కుంభకోణం అర్హత కల్పించాలంటే అది 1000 కోట్ల రూపాయిలైనా అయ్యుండాలి. 200కోట్లంటే మన బొత్సా సత్తిబాబో లేక డి. ఎస్ లేక కాక లాంటోళ్ళ రేంజి. ఇలాంటి న్యూస్ కూడా మొదటి పేజీలో వేయడం సిగ్గుచేటు
బాగా చెప్పారు సంతోషం
కృష్ణ గారు . చెప్పుచ్చుకుని కొట్టారు , భలే భలే
శీను గారు , మీ కామెంట్ కేక
మనమే కాదు పక్కోళ్ళు కూడా వెధవలే అని మనవాళ్ళకి చెప్పే ప్రయత్నం కావచ్చు. ఆ ప్రయత్నంలో విచక్షణ మర్చిపోయి వుండొచ్చు. రెండు వందల కోట్లే స్కాం ఐతే, మన పుణ్యభూమి మీద ఎంత శాతం మంది స్కామర్లు వుంటారో ఆలోచించలేక పోతున్నాను.
Post a Comment