సాధారణంగా నేను నా బ్లాగులో సినిమా రివ్యూలు రాయను. సినిమా అన్నది ఎవరికి వారు చూసి ఒక అభిప్రాయం ఏర్పరచుకోవాలనేది నా అభిప్రాయం. అంతే కాక ఏ సినిమా కూడా నేను మొదటి వారంలో చూడను కాబట్టి అది కూడా మరొక కారణం. అయితే నా ఖర్మ కాలి బదరీ నాథ్ సినిమా మొదటి వారంలో చూడాల్సివచ్చింది. ఆ సినిమా మీద చేసిన హైప్‌కి, తెర మీద రిజల్టుకీ ఏమాత్రం సంబంధం లేకపోవడంతో చిర్రెత్తుకొచ్చి ఈ పోస్టు రాస్తున్నాను. ఏ ఒక్కడినైనా ఈ సినిమా చూడకుండా చేయగలిగితే ఈ బ్లాగుకి, పోస్టుకీ అంత కన్నా సార్ధకత ఏముంటుంది?
ముందుగా ఒక్క మాట. అల్లు అర్జున్ డాన్సులు గానీ తమన్నా అందాలు కానీ చాలు సినిమాకి, అంత కన్నా ఏం కావాలి అని ఎవరైనా అనుకుంటే హ్యాపీగా సినిమా చూడొచ్చు. తెర మీద ఇవి రెండూ పుష్కలంగా ఉంటాయి.
కథ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఈ వేదికలో చాలామంది రాసేశారు. మిగిలిన విషయాలకొస్తే, కేవలం హీరో అద్భుతమైన డాన్సులు, హీరోయిన్ అందాల ఆరబోత, కాస్ట్‌లీ సెట్టింగ్‌లు కలిసి ఒక సినిమాని విజయవంతం చేయగలవు అన్న దర్శక నిర్మాతల కండ కావరం సినిమాలో ఆద్యంతం కనిపిస్తుంది.
"ఇలాంటి స్క్రీన్‌ప్లే ఇంతవరకు తెలుగు తెర మీద రాలేదు"--- సినిమా కథ, స్క్రిన్‌ప్లే రచయిత చిన్ని క్రిష్ణ సినిమా విడుదలకి ముందు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇది. మూర్ఖుడా ఇలాంటి కంగాళీ, అవక తవక స్క్రీన్‌ప్లేలు తెలుగులో నెలకి కనీసం అర డజను వస్తుంటాయి అని ఫోన్ చేసి చెప్పాలనిపిస్తుంది సినిమా చూసిన వారికి ఎవరికయినా.
సినిమా ఆద్యంతం రిచ్ నెస్ కనిపిస్తుంది. కేవలం అదొక్కటే కనిపిస్తుంది, అదీ ఇందులో వీక్‌నెస్. భారీ సెట్‌లు, చక్కని లొకేషన్‌లు, మంచి ఫోటోగ్రఫీ. తమన్నా అందాలన్నీ ఆరబోసింది. తమన్నా అందాలని చూపడానికి తమిళ తంబిలు ఒక మార్గాన్ని ఎన్నుకున్నారు. ఒక బ్రాలాంటి దాన్ని పైన, లంగా లాంటి దాన్ని కింద వేసి పాటల్లో ఆమెని చూపించేవాళ్ళు. వినాయక్‌కూడా అదే పద్ధతిలో వెళ్ళాడు. కాబట్టి ఈ పాల సొగసుల చిన్నది తన అందాలతో ప్రేక్షకులకి విందు చేసింది. అల్లు అర్జున్ డాన్సులు అద్భుతంగా చేశాడు. కత్తి యుద్ధం కూడా సూపర్‌గా చేశాడు. ఈ యుద్ధాల కోసం ప్రత్యేకంగా వియత్నాంలో శిక్షణ కూడా తీసుకున్నాడని చెప్తారు. నిర్మాతగా అరవింద్ ఎక్కడా ఖర్చుకి రాజీ పడకుండా తీశాడు.
ఎంత ఖర్చు పెట్టినా, హీరోయిన్‌తో ఎక్స్‌పోజింగ్ చేయిచినా, హీరోతో డాన్సులేయించినా కథలో పట్టు లేకపోతే సినిమా మటాషే అని మన వాళ్ళు ఇంకా తెలుసుకోలేదు అనడానికి ఈ BADరీ నాథ్ మరొక ఉదాహరణగా నిలిచిపోయింది
.
10 comments:
ఇంత ఘోరమైన టాక్ వున్నా, ఎవరి మాట వినకుండా మీరు చూసారు. మీలానే అందరూ చూస్తారు. మీ మాట ఎవరు వింటారు ?
@ఎనానిమస్,
"ఇంత ఘోరమైన టాక్ వున్నా,..."
బాగా చెప్పారు. కృష్ణగారూ, ఇంతమంది చెప్పినా బద్రీనాధ్ ఎందుకు చూడవలె? చూసితిరిపో, ఈ రివ్యూ ఎందుకు రాయవలె? రాసితిరిపో, మీ మాట మేము ఎందుకు వినవలె?
ఇది మరీ బావుంది..ఏవో డబ్బులెక్కువై ..వాళ్ళ పిల్లల్ని పెట్టుకుని వాళ్ళు సినిమాలు తీసుకుంటారు..మనం మన డబ్బు దండగ చేసుకుని ఎందుకు చూడాలమ్మా..???
ముందుగానే సినిమా చెత్త అని ఊహించి సినిమా చూడకుండా ఉండేవాడు ఉత్తముడు. బాగాలేదని తెలిసి చూడకుండా ఉండేవాడు మధ్యముడు. తెలిసి తెలిసి చూసేవాడు అధముడు. నేను అధముడినయినా నా రివ్యూ చూసి ఏ ఒకరిద్దరయినా చూడకుండా ఉంటే ఈ పోస్టు ధన్యమౌతుంది కదా!
ప్రముఖ నిర్మాత తీసిన సినిమా కదా అని చూసుంటారు.
ముందుగానే సినిమా చెత్త అని ఊహించి సినిమా చూడకుండా ఉండేవాడు ఉత్తముడు. it's wrong
telugu సినిమా చూడకుండా ఉండేవాడు ఉత్తముడు..
>>ముందుగానే సినిమా చెత్త అని ఊహించి చూడకుండా ఉండేవాడు ఉత్తముడు
>>తెలుగు సినిమాలు చూడని వాడు ఉత్తమోత్తముడు
నేను ఉత్తమున్నోచ్
ఏదైనా సినిమా చూడాలనుకుంటే ఓ వారమాగి డీవీడీ తెచ్చుకొని చూసేవాడు ఉత్తముడేమో?!
ఏ ఒక్కడినైనా ఈ సినిమా చూడకుండా చేయగలిగితే ఈ బ్లాగుకి, పోస్టుకీ అంత కన్నా సార్ధకత ఏముంటుంది?
-----------------------
Done
I will never see this movie even in dvd also
Thanks, Ravi. The purpose of the post has been fulfilled.
Post a Comment