మన వాడు అనుకుంటే వాడు కుమ్మినా సమ్మగా ఉంటుందని సామెత. దాన్ని మొన్న తిక్క శంకర్రావు నిరూపిస్తే నిన్న మరొక బడుద్ధాయి బృందం రిపీట్ చేసింది.
ప్రొఫెసర్ జయశంకర్ అంత్యక్రియల సందర్భంగా తమ మీద జరిగింది అసలు దాడే కాదని అది కేవలం ఒక భావోద్వేగ పూరిత సంఘటన మాత్రమే అని తెలంగాణా నాయకులు వివేక్, సుఖేందర్ రెడ్డి, మందా జగన్నాధం, ఇంకొకాయన చేతులు పైకెత్తి అభివాదం చేస్తూ ఫోజిచ్చి మరీ చెప్పుకొచ్చారు.
భావోద్వేగం అన్న పదం ఇటీవల బాగా పాపులరయింది. ఆ మధ్య వైఎస్సార్ చనిపోయిన కొత్తల్లో అంబటి రాంభాబు ఎప్పుడు టీవీ తెరపై కనిపించినా ఓ ఇరవై ముప్పై సార్లు భావోద్వేగం అన్న ఊతపదం లేకుండా మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు ఈ పదాన్ని తెలంగాణా కోసం పోరాటం అంటూ, మంత్రిపదవులు వదులుకోలేక, బయట ఎక్కడైనా సిన్సియర్ ఉద్యమ కారులు ఉన్నచోటకి పోతే వారి చేతుల్లో దెబ్బలు తప్పించుకోలేక భవోద్వేగాన్ని బాగా అడ్డు పెట్టుకొంటున్నారీ కుహనా తెలంగాణా పోరాటయోధులు.
5 comments:
ఇలాంటి తెలంగాణా భావోద్వేగాలు మరిన్ని మరీ మరీ జరగాలని కోరుకోవడం తప్ప మనం చేసేదేముంది? :))
ఇలాంటి తెలంగాణా భావోద్వేగాలు మరిన్ని మరీ మరీ జరగాలని కోరుకోవడం తప్ప మనం చేసేదేముంది?
పెద్ద గా తగల లేదు కానీ...ఎందుకో G..వా చింది.. కొంచెము నొప్పి ఎక్కువగా నే ఉంది..ఎన్ని సార్లు కుమ్ముతారో ఇలాగ..
బాధ పడవద్దు. రాజకీయాలలో ప్రత్యేకించి వేర్పాటువాద రాజకీయాలలో ఇటువంటి కుమ్ముడు సహజం. అందుచేత వేన్నీళ్ళ కాపడం పెట్టించు కొంటె మళ్లీ రేపు కొత్తగా కుమ్మిన్చుకోవడానికి శరీరం సిద్ధం అయిపోతుంది.
చూసారా మనందరిలో కూడా ఎంత భావోద్వేగం ఉందో? కాస్త ఎక్కువైపోతోందేమో అనిపిస్తుంది అపుడపుడూ!!
Post a Comment