వాసిరెడ్డి పద్మ, రోజా, లక్ష్మీ పార్వతి, జ్యోతుల నెహ్రూ, హరిరామ జోగయ్య, ఆనం వెంకట రమణా రెడ్డి...ఇలా ఎక్కడెక్కడ ఏ పార్టీలో ఎవరికి అసంతృప్తి కలిగినా అసమ్మతి రేకెత్తినా వాళ్ళందరూ చెప్పే మాట, పట్టే బాట ఒకటే జగన్ పార్టీ. జగన్ కూడా లేదనకుండా వచ్చిన వాళ్ళని వచ్చినట్లు కండువా కప్పి సాదరంగా ఆహ్వానిస్తున్నాడు.
ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తలో ఇలాంటి పరిస్థితే చిరంజీవికి ఎదురయింది. వచ్చిన వాళ్ళందరినీ చిరంజీవి ఎగేసుకొని ఎదురెళ్ళి కండువాలు కప్పి ప్రెస్ మీట్లు పెట్టి అహ్వానించాడు. తీరా ఎన్నికలయిపోయి పార్టీ బొక్క బోర్లా పడ్డాక వచ్చిన వాళ్ళందరూ బయటకెళ్ళిపోయారు. ఆ పోవడం కూడా మామూలుగా పోలేదు. చేతి కందిన రాళ్ళు విసిరి నానా మాటలని మరీ పోయారు. రేపు తనకి ఇదే పరిస్థితి ఎదురవకుండా జగన్ కాస్తా జాగ్రత్త పడాలి.
తనలోకి వచ్చినదాన్నంతా కలుపుకుని సాగిపోయే గంగానదిలాగా ఉంటుందా, లేక మురికిని, చెత్తనీ కలుపుకుని కంపు కొట్టే మూసీ నదిలా ఉంటుందా జగన్ పార్టీ అనేది కొన్నాళ్ళలో తెలుస్తుంది.