నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, October 30, 2011

ఆపరేషన్ లేకుండా వక్షోజాల సైజు పెరగాలంటే


ఆడవారికి తమ శరీరం గురించి, అందులోనూ ముఖ్యంగా తమ వక్షోజాల సైజు గురించి పట్టింపు ఎక్కువ. అందరికీ ఆస్తి పాస్తులు ఎక్కువగా ఉండనట్టే ఈ సైజులో కూడా చాలా వ్యత్యాసాలు ఉంటాయి. తగినంత సైజు లేకపోతే ఒకప్పుడు మన సాంప్రదాయక చీరకట్టులో కొద్దోగొప్పో దాచిపెట్టే వీలు ఉండేది. కానీ ఇప్పుడు టీ షర్టులూ జీన్సు వచ్చాక ఆ వెసులుబాటు లేకుండా పోయింది. ప్యాడెడ్ బ్రాలతో కొంతవరకూ మానేజ్ చేయవచ్చు కానీ, అప్పుడు లోనెక్ షర్టులు వేయడానికి వీలు కాదు. ఉన్నదాంతో సరిపెట్టుకోవచ్చు కదా అంటే ఆడవారి శరీరం ఈ సైజుల్లో ఉండాలని 34-26-36, 36-28-38 ఇలా కొలతలు తీర్మానించేశారు సినిమాలూ, టీవీలు, మ్యాగజైన్స్ వాళ్ళు.


 
ఈ సైజులలోకి రావడానికి ఓపిక డబ్బూ ఉన్నవాళ్లు మరి ముఖ్యంగా సౌందర్యాన్ని పెట్టుబడిగా వాడే వాళ్ళు ప్లాస్టిక్ సర్జన్లని ఆశ్రయించి చిన్నవిగా ఉంటే breast augmentation అని, మరీ పెద్దవిగా ఉంటే breast reduction అని, బిగి సడలి జారిపోయినట్లు ఉంటే mastopexy అని రకరకాల ఆపరేషన్లతో తమ శరీరాన్ని తమకు నచ్చినట్లు మలచుకొంటున్నారు. అయితే ఆపరేషన్ అంటే భయం ఉన్నవాళ్ళకి ఆపరేషన్ లేకుండా సైజు పెంచుతామని నకిలీ వైద్యులు సొమ్ము చేసుకుంటారు.
  


సౌత్ డిల్లీలో ఒక బ్యూటీ పార్లర్ నిరావహుకురాలు ఇలాగే నాలుగు ఇంజెక్షన్లు ఇచ్చి వక్షాల సైజు గ్యారంటిగా పెంచుతానని డబ్బులు దండుకొని అక్కా చెల్లెళ్ళు ఇద్దరి మీద ప్రాయోగం చేసి కటకటాల పాలయింది.

 "నాలుగంటే నాలుగు ఇంజెక్షన్లు వేయించుకుంటే చాలని, కావాలంటే రాత పూర్వకంగా గ్యారంటి ఇస్తానని డబ్బు తీసుకుని రొమ్ములలోకి పదిహేను ఇంజెక్షన్లు చేసింది. సైజు పెరగడం మాట దేవుడెరుగు, ఇప్పుడు రూమ్ములపైన నీలంరంగు మచ్చలు, ఒకటే నొప్పి దురదా వచ్చాయి" అని ఆ అక్కా చెల్లెలు పోలీసు కేసు పెట్టారు. పోలీసులు మామూలుగానేIPC 420,337 సెక్షన్ల కింద 
  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు.

Saturday, October 29, 2011

విమానంలోనుండి నేను తీసిన అండమాన్ ఫోటోలు


చెన్నై నుండి పోర్ట్ బ్లెయిర్ వెళ్ళే కింగ్ ఫిషర్ విమానంలో విండో సీట్‌లో కూర్చుని పోర్ట్ బ్లెయిర్ సమీపిస్తుండగా నా సోనీ కెమెరాతో తీసిన ఫోటోలు ఇవి. నేను ఫోటోలు తీస్తుండగా ఎయిర్ హోస్టెస్ చూసింది కానీ నన్ను టెర్రరిస్టుగా భావించలేదేమో అభ్యంతరం చెప్పలేదు. సెల్ ఫోన్ స్విచ్ ఆపమని మాత్రం చెప్పింది.
Friday, October 28, 2011

నెట్‌లో సెక్స్ చూడడం ఎక్కువైతే బెడ్‌లో చేయడం తక్కువ అవుతుంది. .బూతు బొమ్మల్నీ, బూతు సాహిత్యాన్ని ఇంగ్లీషులో ముద్దుగా పోర్నోగ్రఫీ అని పిలుస్తారు. ఈ పోర్నొగ్రఫీ అనేది ఎప్పటినుండో ఉంది. ఖజురహోలోనూ, దేవాలయాల మీదా ఉండేది పోర్న్ అవునా కాదా అన్న వాదనలోకి వెళ్ళకుండా ఉంటే ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ పుస్తకాలలో అక్కడక్కడా అమ్మాయిల బొమ్మలతో బ్రహ్మచారుల గదుల్లో పరుపుల కింద ఉన్న ఈ పోర్న్ ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమా అని ఎక్కడ పడితే అక్కడ విశృంఖలంగా దొరుకుతూంది.
   
తెల్ల పిల్లలు, నల్ల పిల్లలు, వొంపు సొంపుల వయ్యారి భామలు, చూపించి చూపించనట్టు కొన్ని భాగాలు మాత్రమే చూపించే వాళ్ళు, వొళ్ళంతా విప్పి అంతా చూపించే వాళ్ళు, శృంగారం వొలికించే సాఫ్ట్ పోర్న్, వెగటు పుట్టించే హార్డ్ కోర్ ఇలా ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వారికి బూతు ఇప్పుడు నెట్‌లో దొరుకుతూంది. అయితే ఇలా పోర్నోగ్రఫీ చూడడానికి అలవాటు పడితే అసలుకే మోసమొస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాకి చెందిన సైకాలజీ టుడే అన్న జర్నల్‌లో మార్నియా రాబిన్‌సన్ అనే ఒక సైకాలజిస్ట్ రాసిన ఒక పరిశోధనాత్మక వ్యాసంలో ఈ విషయాన్ని వెల్లడి చేశారు. బూతు బొమ్మలు అతిగా చూడడం వల్ల ఇరవై పాతిక యేళ్ళకే నపుంసకత్వం వచ్చే అవకాశం ఉందని ఆ వ్యాసం హెచ్చరిస్తూంది.
 


మనసులో శృంగార భావాలు కలిగినప్పుడు మెదడులో డోపమైన్ అనే రసాయనం ఉత్పత్తి జరిగి అది ఇతర భాగాలకి సంకేతాలు పంపి శరీరాన్ని సిద్ధం చేస్తుంది. దీనివలన అంగ స్తంభన జరగడం, గుండె వేగం పెరగడం లాంటి మార్పులు సంభవిస్తాయి. తెర మీద బూతు బొమ్మలు చూసినప్పుడు కూడా ఈ మార్పులు సంభవిస్తాయి. కానీ ఇలా మాటిమాటికి బూతు బొమ్మలు చూసినప్పుడల్లా ఈ డోపమైన్ స్రవించి కొన్నాళ్ళకి మెదడులోని కణాలు ఆ రసాయనానికి స్పందించడం తగ్గిపోతుంది. దాంతో ఆ వ్యక్తి సాధారణ భావాలకి స్పందించడం మానివేస్తాడు. నెట్‌లో చూసే extreme sex బొమ్మలు మాత్రమే అతనిలో శృంగార ప్రేరణ కలిగిస్తుంది. పక్కకి అమ్మాయి వచ్చి పడుకున్నా అతని శరీరం స్పందించదు. తను చూసే బొమ్మల్లో, వీడియోలో ఉన్నట్టు కనిపిస్తే మాత్రమే అతనికి స్పందన కలుగుతుంది. అందరు ఆడవాళ్ళు అలా చేయరు కాబట్టి పడకటింట్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. Porn induced sexual dysfunction గా అభివర్ణించే ఈ సమస్యనుండి బయట పడాలంటే కొన్నాళ్ళు దీనికి దూరంగా ఉండడమే మార్గం అని ఆ వ్యాస రచయిత చెప్పారు.
Saturday, October 22, 2011

నలభై వేల రూపాయల I-Phone తయారీకి ఖర్చయ్యేది పది వేలే!బ్రాండ్ నేమ్ చాలా బలమైనది. ఒక సారి ఒక బ్రాండ్ వినియోగ దారుల మనసుల్లో బలంగా నాటుకుంటే అది చెరిగిపోదు. ఈ నాటడం కోసమే అనేక కంపెనీలు కోట్లు దారపోసి క్రికెటర్లనూ, సినీ తారలనూ తమ బ్రాండ్ అంబాసిడర్లుగా వాడుకుంటారు. అలాంటి ఒక బ్రాండ్ ఆపిల్. ఆ సంస్థ తయారుచేసే వస్తువులు కొనడానికి కొత్త ప్రోడక్టు ఏదైనా విడుదల అయ్యేముందు ఆపిల్ షాపుల ముందు రెండు మూడు రోజులనుండే టెంట్లు వేసుకొని క్యూలలో ఉంటారు జనం. 
   

కొత్త ఐ ఫోను ఎవరైనా కొనిస్తే అతనికి తన కన్యాత్వాన్ని అర్పిస్తానని ఆ మధ్య ఒక యువతి ఇంటర్నెట్‌లో ఆఫర్ ఇచ్చింది. ఐ ప్యాడ్ కొనడానికి ఒక చైనా కుర్రవాడు  ఏకంగా తన కిడ్నీనే అమ్మి పారేశాడు. ఇంత క్రేజ్ ఉంది కాబట్టే ఆపిల్ సంస్థ ఎంత ధర పెట్టినా వెచ్చించి ఆ కంపెనీ ఉత్పత్తులను జనం వెర్రిగా కొంటున్నారు. అయితే నిజంగా అవి అంత ఖరీదు చేస్తాయా అని కొందరు నిపుణులు వాటిని పరీక్షించి చూస్తే వెల్లడి అయిన నిజాలు చూడండి.


ఐ సప్ప్లై అనే సంస్థకి చెందిన నిపుణులు లేటెస్ట్ వెర్షన్ ఐ ఫోన్ 4S ని విడదీసి ఆ విడి భాగాల ఖరీదు లెక్క కడితే అది 120 పౌండ్లుగా తేలింది. అదే ఫోను 32 GB వెర్షన్ 499 పౌండ్లకి అమ్ముడు బోతూంది. మన కరెన్సీలో చూస్తే తయారీకి అయ్యేది పది వేలయితే అమ్మేది నలభై వేలు. ఈ అధిక ధర ఆ ఫోన్ కోసం ఆ కంపెనీ వెచ్చించిన రీసెర్చ్, డెవలప్‌మెంట్ తదితరాలకూ, కంపెనీకున్న ఇమేజ్‌కీ వినియోగదారుడు చెల్లిస్తున్నట్టు అనుకోవాలి. ఐ ఫోన్‌తో అన్ని విధాలుగా పోల్చదగ్గ శామ్‌సంగ్ S2 ఫోన్ 32 వేలకే దొరుకుతుంది. ఐ ఫోన్‌లో వాడే మెమరీ చిప్స్ తయారుచేసేది శామ్‌సంగ్ కావడం ఒక విశేషం. శామ్‌సంగ్ కంపెనీ నుండి మెమరీ చిప్స్ కొనుగోలు చేసే కంపెనీలలో అతి పెద్దది ఆపిల్.

Tuesday, October 18, 2011

నా బ్లాగ్ ఇప్పుడు లక్షాధికారి

పోయిన సంవత్సరం జనవరిలో నేను మొదలు పెట్టిన ఈ బ్లాగ్ ఈ రోజే ఒక లక్ష పేజ్ వ్యూస్ పుర్తి చేసుకుంది. ఇందుకు కారణమైన నా బ్లాగ్ వీక్షకులందరికీ ధన్యవాదాలు.
  
  
 ఈ పయనంలో నేను కూడా మీచేతిలో కొన్ని సార్లు వీర తాళ్ళు, కొన్ని సార్లు అక్షింతలూ వేయించుకొన్నాను. ఏది ఏమైనా నా బ్లాగ్ చూసిన వారికీ, కామెంట్లు పెట్టిన వారికీ మరొక సారి హృదయపూర్వక ధన్యవాదాలు.

Friday, October 14, 2011

ఆఫ్రికన్ చిన్నారుల రక్తంతో ఇంగ్లాండ్‌లో భూత వైద్యం


భూత వైద్యం కోసం చిన్న పిల్లల రక్తం వాడడం... ఇదేదో వెనక పడ్డ ఒరిస్సా, తెలంగాణా, బీహార్, యూపీ, ఆఫ్రికాలో కాదు. ప్రపంచానికి నాగరికత నేర్పించామని చంకలు గుద్దుకొనే ఇంగ్లాండ్‌లో సాగుతున్న భీభత్సం. ఇంటి సమస్యలా, వ్యాపారంలో సమస్యలా, ప్రేమ సమస్యా? అయితే మిమ్మల్ని గట్టెక్కించడానికి జుజూని ఆశ్రయించండి. లండన్‌లో హైక్లాస్ సొసైటీలో, కొన్ని వార్తాపత్రికలలో ఒక మూలన ఇలాంటి ప్రకటనలు కనిపిస్తాయి. ఎక్కువగా ఆఫ్రికన్లు ఈ భూత వైద్యం చేస్తుంటారు. చాలా మటుకు ఇది ఎవరికి హాని కలిగించకపోయినా కొంతమంది ఈ భూత వైద్యానికి చిన్న పిల్లల రక్తం వాడుతారు. ఇలా పిల్లల రక్తంతో చేసే భూత వైద్యం, దీనినే జుజూ అంటారు, బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.


ఇలా రక్తాన్ని సేకరించడం కోసం ఆఫ్రికా నుంచి పిల్లలని కిడ్నాప్ చేసి తరలించే ముఠాలు ఉన్నాయి. వీరి బారిన పడేది ఎక్కువగా ఉగాండా దేశం. కనీసం 400 మంది ఇలాంటి పిల్లలని బ్రిటీష్ అధికారులు రక్షించి తమ దేశానికి తిప్పి పంపారు. ఇంకా చాలా మంది ఈ భూత వైద్యుల చెరలో చిక్కుకుని ఉన్నారు. ఇలా వీరి చెరలో చిక్కి నానా హింస అనుభవించి బయట పడ్డ ఒక పిల్లవాడు చెప్పిన దాన్ని బట్టి ఈ భూత వైద్యులు జుట్టు కత్తిరించి, చేతులు, కాళ్ళు, మెడ, జననాంగాలు గాయ పరిచి రక్తాన్ని సేకరిస్తారు. ఆ పిల్లలని ఒక చోట బంధించి తమకు అవసరమైనప్పుడల్లా జలగల్లా రక్తాన్ని పీలుస్తూ ఉంటారు. "వాడు ఏదో ఒకరోజు నా తలని కత్తిరిస్తానని భయపెట్టేవాడు" అని ఆ పిల్ల వాడు అధికారులకి చెప్పాడు. 
 


Children in Uganda wearing "Pray to end child sacrifice" t-shirts  


ఇలా పిల్లలని అపహరించడం ఉగాండాలో ఒక పెద్ద వ్యాపారంలా సాగుతోంది. పిల్లల కోసం వచ్చిన వారిలా ఇద్దరు BBC విలేఖరులు ఇలాంటి వ్యాపారంలో ఉన్న ఒకడిని కలిసినప్పుడు అతను పదీ, పాతికా, యాభై, వందా ఇలా ఎంత మంది కావాలన్నా సరే తను సరఫరా చేయగలనని చెప్పాడు. ఇలాంటి నేరాలని అరికట్టడానికి ఉగాండాలో ఒక పోలీసు విభాగం ఉన్నప్పటికీ వాళ్ళు ఏమాత్రం ఈ చిన్నారుల అక్రమ రవాణాని ఆపలేకపోతున్నారు.
  
పిల్లల్ని అపహరించడమే వృత్తిగా పెట్టుకున్న యూనస్ కాబూల్

ఆఫ్రికా నుండి వచ్చిన వాళ్ళు మూర్ఖులూ, అగ్నానులూ కాబట్టి ఈ భూత వైద్యాలు, క్షుద్ర పుజలు చేస్తున్నారని అనుకున్నా ఈ ఇరవై ఒకటో శతాబ్ధంలో ఇంగ్లాండులో ఈ పూజల్ని ప్రోత్సహించే వెధవ సన్నాసులూ, వాటికోసం అభం శుభం తెలియని చిన్నారుల రక్తాన్ని వాడే నర రూప రాక్షసులు ఉండడం ఆశ్చర్యంగా ఉంది. 

Monday, October 10, 2011

స్వచ్చమైన తెలుగువాడు ఇలాంటి చచ్చు ప్రశ్నలేయడు


ఈ మధ్య  పేపర్లలో దూకుడు, ఊసరవెల్లి గ్రాస్, షేర్ అంటూ కోట్లలో లెక్కలు చూపిస్తూ ఉండడం చూసి ఒక మల్టీ నేషనల్ సంస్థ కూడా  టాలీ వుడ్‌లో్దిగాలని అనుకొంది. అనుకొన్నదే తడవుగా సర్వేలు జరిపి శ్రీను వైట్ల లాంటి దర్శకుడిని, కోన వెంకట్ లాంటి రచయితని పట్టుకొని అడ్వాన్సు ఇచ్చి అగ్రిమెంట్ కుదుర్చుకొంది. దర్శకుడు, రచయిత, సంస్థ ప్రతినుధులు ఇద్దరు కలిసి ఒక ఫైన్ మార్నింగ్ స్టోరీ మీద కూర్చున్నారు ఒక ఫైవ్ స్టార్ హోటల్లో. 
 

"మీకు ఏ తరహా కథ కావాలి?" అడిగాడు కోన వెంకట్. వచ్చిన ప్రతినిధుల్లో నం.1 తన చేతిలో లాప్ టాప్ ఓపెన్ చేసి "ఈ మధ్య ఎక్కువ వసూలు చేసిన ఇండియన్ సినిమా, హాలీ వుడ్ సినిమా రెండూ సైన్స్ ఫిక్షనే. మేమూ అదే తీయాలనుకొంటున్నాము" అన్నాడు. శ్రీను వెంకట్ వైపు చూశాడు, వీడు సైన్స్ ఫిక్షన్ రాయగలడా అన్నట్టుగా. కానీ వెంకట్ ఏమీ తడుముకోకుండా, "నా దగ్గర మంచి సైన్స్ ఫిక్షన్ లైన్ ఉంది. చెప్తాను వినండి" అన్నాడు.


 
అందరూ అతనికి చెవులప్పగించారు. వెంకట్ మొదలు పెట్టాడు.


" ఒక దుష్ట సైంటిస్టు, అతనికి తోడుగా ఒక చెడ్డ కోటీశ్వరుడు. ఇద్దరూ ఒక దీవిలో తమ స్థావరం నిర్మించుకొని ప్రపంచాన్ని తమ పాదా క్రాంతం చేసుకోవాలని చూస్తుంటారు. వీరి ఆట కట్టించడానికి ప్రభుత్వం హీరోని పంపుతుంది" అని ఆపాడు. ఆ వచ్చిన ఇద్దరు ప్రతినిధుల్లో ఒక్కడు కూడా అప్పటికి ఒకసారి కూడా జేమ్స్ బాండ్ సినిమా చూసి ఉండక పోవడం మూలాన ఉత్కంఠతో వింటున్నారు. వెంకట్ కొనసాగించాడు. "నానా కష్టాలు పడి, మధ్యలో హీరోయిన్‌తో డ్యూయెట్లు పాడి విలన్ పంపిన రౌడీలతో స్టంట్లు చేసి హీరో ఒక పెద్ద షిప్పులో ఆ దీవి దగ్గరకి వెళ్తాడు. విలన్ హీరో పైకి ఒక మిస్సైల్ వదుల్తాడు. హీరో తన మిస్సైల్‌తో దానిని చిత్తు చేస్తాడు. విలన్ ఒక న్యూక్లియర్ బాంబు వేస్తాడు.హీరో దానిని పేలకుండా నిర్వీర్యం చేస్తాడు. అలా ఒక పావు గంట గ్రాఫిక్స్‌తో పోరాటాన్ని చూపిస్తాం. అప్పుడు హీరో, విలన్ ముఖాముఖీ తలపడుతారు. ఇద్దరూ లేజర్ కత్తులు పట్టుకొని కత్తి యుద్ధం చేస్తారు" అని ఆపాడు వెంకట్. 
 


ఆ ప్రతినిధులిద్దరూ అంతకు ముందు స్టార్ వార్స్ సినిమా చూసి ఉండక పోవడం వలన వాళ్ళకి లేజర్ కత్తులతో యుద్ధం చాలా సూపర్ అనిపించింది. వెంకట్ మళ్ళీ చెప్పసాగాడు. " అలా కాస్సేపు పోరాటం చెశాక ఇద్దరూ ఒకరి కత్తిని మరొకరు ఎగర గొట్టేస్తారు. అప్పుడు హీరో పక్కన పడి ఉన్న ఒక కత్తి పుచ్చుకొని విలన్‌ని నరికేస్తాడు" అని ముగించాడు. ప్రతినిధి నం.2 తన లాప్ టాప్‌లో ఎంత ఖర్చవుతుందో లెక్కలేయ సాగాడు. నం.1 కొంచెం అసంతృప్తిగా కనిపించాడు. "ఎనీ డౌట్స్?" అడిగాడు వెంకట్. "ఇంత పెద్ద హైటెక్, సైన్స్ ఫిక్షన్ మూవీలో, అంత సేపు టెక్నాలజీతో ఫైటింగ్ చేసి, చివర్లో మరీ అలా కత్తితో పొడిచి విలన్‌ని చంపడమేమిటా అని."


 
వెంకట్‌కి కోపమొచ్చింది. కళ్ళు ఎరుపెక్కాయి. "నిజం చెప్పు నువ్వసలు స్వచ్చమైన తెలుగు వాడివేనా?" అని హూంకరించాడు. "లేదండీ. మా నాన్న తెలుగు, అమ్మ బెంగాలీ. ఎలా కనిపెట్టారు?" అడిగాడు నం.1.


"స్వచ్చమైన తెలుగువాడు ఇలాంటి చచ్చు ప్రశ్నలేయడు. చూపించింది చూపించినట్టు చూస్తాడు." 

Friday, October 7, 2011

మతానికి మానసిక దౌర్భల్యం తోడయితే ఇంత దారుణంగా ఉంటుంది


మతం మత్తు మందు అని ఎవరో ఒక పెద్దాయన చెప్పాడు. ఈ మత్తుకి మానసిక బలహీనత తోడైతే జరిగే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో అనేదానికి ఈ రెండు సంఘటనలు నిదర్శనాలు.


ఈస్ట్ లండన్‌లో నివసిస్తున్న శ్యామా ఆలీతో తరచుగా దేవుడు సంభాషిస్తూ ఉంటాడని ఆమె నమ్మకం. దేవుడు ఆమెని దుష్ట శక్తులతో పోరాడమని చెప్తూ ఉంటాడు. ఆ దుష్ట శక్తులని తరిమేయడానికి, వాటిని నిర్వీర్యం చేయడానికి ఆమె పోరాటం చెస్తూ ఉంటుంది. ఆ పనిలో భాగంగా ఇంట్లోని బొమ్మల కళ్ళు పీకేయడం, డీవీడీ కవర్స్ మీద బొమ్మలకి కళ్ళు చెరిపేయడం చేస్తూ ఉంటుంది. ఒక రోజు భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె తన నాలుగేళ్ళ కూతురుతో ఇంట్లో ఉన్న సమయంలో దేవుడి పట్ల తన ప్రేమని నిరూపించుకోవడం కోసం తన కూతుర్ని బలి ఇవ్వమని దేవుడు ఆమెని కోరుతున్నట్లు ఆమెకి అనిపించింది.

అంతే ఆ పిల్లని బరబరా వంటింట్లోకి ఈడ్చుకెళ్ళి గొంతు పిసికి చంపేసింది. అంతటితో ఆగకుండా మ్యూజిక్ సిస్టంలో కొరాన్ ప్రవచనాలు వింటూ ఆ పిల్ల దేహాన్ని వంటింట్లోని ఒక కత్తితో ముక్కలుగా కోసి, కాలేయాన్ని బయటకి తీసి తన దైవ భక్తికి నిదర్శనంగా దేవుడికి అర్పించింది. ఆ సమయంలో ఇంట్లోకి వచ్చిన భర్త ఆ దృశ్యాన్ని చూసి పోలీసులకి ఫోన్ చేయడంతో వాళ్ళు వచ్చి ఆమెని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. వాళ్ళు ఆమెని మానసిక రోగుల ఆసుపత్రికి పంపి చికిత్స మొదలు పెట్టారు.
Tragedy: Shayma Ali told her husband 'if you really love Allah you would sacrifice your daughter'

జహంగీర్ పురి, డిల్లీ లో ఉంటున్న 35 సంవత్సరాల రొమిల్లాకి తానొక దేవతనని గట్టి నమ్మకం. ఆమె తరచుగా శక్తి పూజలు చెస్తూ ఉండేది. ఈ విషయంలొ ఆమెకి ఒక మంత్రగాడు పరిచయమై ఆమెతో పూజలు చేయిస్తుండేవాడు. ఒక సారి ఆ మంత్రగాడు ఆమెతో ఆమె కుటుంబం మీద ఒక దుష్ట శక్తి కన్నేసిందని, దానిని తరమడానికి కొన్ని ప్రత్యేక పుజలు చేయాలని నమ్మ బలికాడు. అయితే తాను దేవతనై ఉండి పూజలు చేయడమేమిటని ఆమె భావించింది. తనని, తన పిల్లల్ని అగ్నితో శుద్ధి చేస్తానని, తమని నిప్పు ఏమీ చేయలేదని ఇంట్లో వాళ్ళతో చెప్పేది. అయితే వాళ్ళు ఆ మాటల్ని అంతగా పట్టించుకోలేదు. ఒక రోజు భర్త ఇంట్లో లేని సమయంలో తన ఇద్దరు పిల్లలతో కలిసి అగ్ని స్నానం చేయాలని నిశ్చయించుకొంది. తన కూతుళ్ళు, ఎనిమిదేళ్ల గీత, అయిదేళ్ళ జయల పైన, తన పైన కిరోసిన్ పోసి నిప్పు అంటించింది. ఇరుగు పొరుగు అది చూసి మంటలు ఆర్పి వారిని హాస్పిటల్‌కి తీసుకు పోయినా అప్పటికే 95% కాలిన గాయాలతో ముగ్గురూ చనిపోయారు.


Thursday, October 6, 2011

సైతాన్ పిల్లవాడికి సైతాన్ బాధ తొలగించిన డాక్టర్లు


ఆరేళ్ళ దీపక్ పాశ్వాన్ వీధిలోకి వెళ్ళాలంటే భయపడేవాడు. పిల్లలు అతన్ని చూస్తే అతని పైన రాళ్ళేసేవాళ్ళు. ఆడవాళ్ళు చాటు మాటుగా వీడు సైతాన్ పిల్లవాడు అని చెవులు కొరుక్కొనే వారు. కొందరయితే అతని మొహం మీదే అనే వాళ్ళు. అందుకు కారణం విక్రమార్కుడి వీపు మీది భేతాళుడిలాగా అతని చాతీకి అతుక్కొని ఉండే అతని కవల సోదరుడు. సోదరుడు అంటే పూర్తి మనిషి కాదు రెండు చేతులు, రెండు కాళ్ళు అంతే. దానివల్ల అందరిలా కాకుండా దీపక్‌కి నాలుగు చెతులు, నాలుగు కాళ్ళు ఉండేవి.


  
ఒకరికి ఒకరు అతుక్కొని పుట్టే సయామీస్ ట్విన్స్‌లో ఒక రకం పేరసైటిక్ ట్విన్(Parasitic twin). ఇందులో ఒకరు పూర్తిగా అభివృద్ధి చెందిన శిశువు అయితే, ఇంకొకరు పూర్తిగా అభివృద్ధి చెందకుండా ఏవో కొన్ని శారీరక భాగాలు మాత్రమే ఉంటాయి. దీపక్ విషయంలో అతని కవల సోదరుడికి కాళ్ళు, చేతులు మాత్రమే ఉన్నాయి. అవి దీపక్ చాతీకి అతుక్కొని ఉన్నాయి.


దీపక్ ఉండేది బెళహరి అని బీహార్‌లోని మారుమూల గ్రామం. అక్కడ గర్భిణీ స్త్రీలు హాస్పిటల్‌కి వెళ్ళి చూపించుకోవడమే ఉండదు. కాబట్టి ముందుగా అల్ట్రా సౌండ్ స్కాన్ తీసి అతనికున్న వైకల్యాన్ని పసిగట్టె అవకాశమే లేదు. దీపక్ పుట్టినప్పుడు కాన్పు కూడా చాలా కష్టమయింది. కాన్పు చేసిన మంత్రసానితో సహా అందరూ అతని వింత ఆకారాన్ని చూసి భయపడ్డారు. ఆ శిశువు సైతాన్ రూపమని కొందరంటే, గ్రహణం సమయంలో భయట తిరిగినందుకే అలా జరిగిందని కొందరన్నారు. ఏది ఏమైనా దీపక్ ఎదిగే కొద్దీ అతనికి అతుక్కొని ఉన్న ఆ చేతులు, కాళ్ళు కూడా ఎదగసాగాయి. ఆపరేషన్ చేసి వాటిని తొలగించే వీలున్నా ఆ ఆపరేషన్ చేయగల డాక్టర్లు దగ్గరలో లేక పోవడం, పెద్ద పట్టణాలకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొనే స్తోమత అతని తల్లి తండ్రులకి లేకపోవడంతో ఆరేళ్ళు చిన్నరి దీపక్ ఆ అంగాలని భరిస్తూ వచ్చాడు.


దీపక్ గురించి తెలుసుకున్న బెంగుళూరు లొని ఫోర్టిస్ హాస్పిటల్ ఉచితంగా ఆపరేషన్ చేయడానికి ముందుకు రావడంతో దీపక్‌కి తను మోస్తున్న సైతాన్‌ని వదిలించుకొనే అవకాశం దక్కింది. నాలుగు గంటల ఆపరేషన్ తరువాత దీపక్ శరీరంలోనుండి రెండు చేతులు, రెండు కాళ్ళూ తొలిగిపోయి అతను మళ్ళీ మామూలు బాలుడిగా మారి పోయాడు. ఆపరేషన్ చేసిన రామ్‌చరణ్ త్యాగరాజన్ ఇక దీపక్ అందరి పిల్లల లాగా తన భవిష్యత్ జీవితాన్ని గడప వచ్చునని, ముందు ముందు ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం లేదని భరోసా ఇచ్చాడు.
AFP/Getty Images
ఇప్పుడు దీపక్‌ని వాళ్ళ పల్లెటూరిలో ఎవరూ సైతాన్ పిల్లవాడు అని పిలవడం లేదు. ఎందుకంటే అతని చాతీకి అతుక్కొని ఉన్న సైతాన్‌ని బెంగుళూరు డాక్టర్లు తీసేశారు.Sunday, October 2, 2011

అమ్మ నీ, ఏం ప్లానేశావే మాయావతీ?


గత కొన్ని రోజులుగా మాయావతి కేంద్రానికి లేఖల మీద లేఖలు రాస్తూ ఉంది. జాట్ కులస్తులకి OBC కేటగిరీలో, అగ్ర వర్ణాల్లోని పేదలకి ఆర్ధిక ప్రాతిపదికన, వెనక పడ్డ ముస్లిములని OBC లలో చేర్చాలని, బాగా వెనక పడ్డ OBC కులాలని, ముస్లిములని, క్రిస్టియన్లని SC,ST లలో చేర్చాలనీ, జాతీయ రహదారులని యుద్ధ ప్రాతిపదికన బాగు చేయాలని, రైతులకి సరిపడా ఎరువులని అందించాలని ఇలా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న అంశాలమీద ఎడా పెడా ఉత్తరాలు గుప్పిస్తూంది.
 


ఇప్పుడు తాజాగా న్యాయమూర్తుల నియామాకంలో కూడా రిజర్వేషన్లు పాటించాలని ఒక లేఖ రాసి పడేసింది. 2012 లో రానున్న అసెంబ్లీ ఎన్నికలని దృష్టిలో ఉంచుకొనే ఆమె ఇవన్నీ చేస్తుందన్నది ఎవరైనా చెప్తారు. అగ్ర వర్ణాలకీ, వెనక పడ్డ కులాలకీ, ముస్లిములకి, దళితులకీ అందరికీ ఏదో ఒక తాయిలం ఇమ్మని ఈమె లేఖలు రాసి పారేస్తే కేంద్ర ఆ తాయిలాలు ఇచ్చినా ఇవ్వకున్నా ఈమెకి దక్కే క్రెడిట్ ఈమెకి దక్కుతుంది. ఇస్తే అది నావల్లే వచ్చింది అని ప్రచారం చేసుకోవచ్చు. ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం మీద నింద మోపవచ్చు.
 


ఈమె ఎజెండాలో తదుపరి అస్త్రాలు ఏమిటో? సైన్యంలో రిజర్వేషన్లు, రాష్ట్రపతి, ప్రధాని పదవుల్లో, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో CEO పదవుల్లో రిజర్వేషన్లు ఇలా ఉంటాయేమో! పోయేది మనది ఏమీ లేనప్పుడు ఏమైనా అడగొచ్చు.