నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, September 30, 2010

గుడ్ లక్ రోబో!

రేపు రజనీకాంత్ నటించిన శంకర్ సినిమా రోబో విడుదల కానుంది. భారత చలన చిత్ర చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ సినిమాగా రూపొందిన ఈ సినిమా విజయవంతమ్ అవుతుందని ఆశించడానికి చాలా కారణాలున్నాయి. అందులో ప్రధానమైనది శంకర్. డబ్బులు ఏట్లో పోసినట్టు ఖర్చు చేయడం కాకుండా పెట్టిన డబ్బుకి సరిపడా ఎఫెక్ట్ తెర మీద చూపించగల సమర్ధుడతడు.
అక్కడక్కడా విన్నదాన్ని, చదివిన దాన్ని బట్టి చూస్తే ఫ్రాంకెన్ స్టెయిన్ కథకి గ్రాఫిక్స్ షోకులద్ది రోబోగా తెరకెక్కించినట్టు అనిపిస్తోంది. అయినా భారత అందులోనూ దక్షిణ భారత చలన చిత్ర స్థాయిని పెంచడానికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న రోబో విజయం సాధించాలని నా ఆకాంక్ష.

Sunday, September 26, 2010

కామన్ వెల్తు గేమ్సులో అవకతవకలు ఉట్టిదే....మనవాళ్ళ కోసమే...అర్ధం చేసుకోరూ....

మరో వారంలో మొదలవ్వబోయే కామన్ వెల్తు గేమ్సుకి ప్రిపరేషన్స్ సరిగా లేవని మీడియా, విమర్శకులు, క్రీడాకారులు, బ్లాగర్లూ దుమ్మెత్తి పొస్తున్నారు. డెబ్బై, ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టి ఇలాగేనా చేసేది అని అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. డబ్బంతా కాంట్రాక్టర్లు మెక్కేస్తున్నారు, నాణ్యత అస్సల్లేదు, అన్ని స్టేడియంలు కంపు కంపుగా ఉన్నాయని ఫోటోలు తీసి మరీ పరువు తీస్తున్నారు. దేశ ప్రతిష్ఠ యమునా నదిలో కలిసిపోతుందని ఏడ్చి పెడబొబ్బలు పెడుతున్నారు.
కానీ ఎంతమందికి తెలుసు ఇదంతా కావాలని చేస్తున్న వ్యవహారమని. మనకి కామన్వెల్తు గేమ్సు సరిగ్గా, నభూతో నభవిష్యతి అన్న చందంగా నిర్వహించడం చాలా చిన్న విషయమని ఎంత మందికి తెలుసు. ఎప్పుడో ఎనభయ్యవ దశకంలోనే ఆసియా క్రీడలు అదిరిపోయేలా చేశాం మనం. ఇప్పుడు సెన్సెక్స్ ఇరవై వేలని తాకిన ఈ రోజుల్లో ఈ గేమ్స్ చేయడం ఒక లెఖ్ఖా?

పొట్టి నాయాళ్ళు చైనా వాళ్ళు ఒలింపిక్స్ ఆర్గనైజ్ చేయగా లేనిది, చీకటి ఖండం అని చెప్పే ఆఫ్రికా వాళ్ళు ప్రపంచ కప్ ఫుట్ బాల్ చేయగా లేనిది మనం వెధవది కామన్ వెల్త్ గేమ్స్ ఆర్గనైజ్ చేయలేమా?

అయితే, స్టేడియంలో పైకప్పు ఊడిపోవడం, స్టేడియం బయట బ్రిడ్జి కూలిపోవడం ఇవన్నీ ఒక పథకంలో భాగమే!

ఏ క్రీడల్లోనయినా అతిధి దేశం పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉంటే మర్యాదగా ఉంటుంది. అయితే ఈ క్రీడల్లో మనకి అగ్రస్థానం దక్కే అవకాశం ఉందా? లేదని అందరికీ తెలిసిన విషయమే.ఆ దిశగా ఇదొక మార్గం.

ఇప్పుడు చూడండి. ఆస్ట్రేలియాకి చెందిన మహిళ డిస్కస్ చాంపియన్ డేని శామ్యూల్స్ భయపడిపోయి ఆరోగ్యం, భద్రతా కారణాలతో తను ఈ గేమ్సులో పాల్గొనడం లేదని చెప్పింది. దాంతో మన దేశానికి చెందిన క్రిష్ణ పూనియాకి ఆ విభాగంలో స్వర్ణం దక్కే చాన్సుందని నిపుణుల అభిప్రాయం.
ఇలాగే బ్రిటన్ వాళ్ళూ, న్యూజీలాండోళ్ళూ.వాళ్ళతో బాటూ ఇంకొన్ని దేశాలవాళ్ళూ ఈ గేమ్సుకి రాకుండా ఎగ్గొడితే మనకి పతకాల పంటే కదా?

అసలు విషయం ఇదీ! అది తెలుసుకోకుండా సురేష్ కల్మాడీ లాంటి దేశభక్తులని ఈ మీడియా దుమ్మెత్తి పోయడం ఏమైనా బావుందా?

Wednesday, September 22, 2010

ఈ ఆంబోతులని అచ్చోసి ఊరి మీదకు వదులుల్తార్రా?

మొన్న హైదరాబాద్ శివారులో జరిగిన ఇంజినీరింగ్ విద్యార్ధిని విద్య హత్య గురించిన పోస్టు ఇది. ఆమెని ఆమె కాలేజిలోనే చదువుతూ, కొన్నాళ్ళుగా ఆమెకి సన్నిహితంగా ఉంటూ ఇప్పుడు ఆమె స్నేహానికి దూరమయిన శేఖర్ అనే ఉన్మాది ఆమెని అతడి గదిలో బేస్ బాల్ బ్యాట్ తో తలమీద కొట్టి హతమార్ఛాడు.
ఒక ఫెమినైన్ కోణంలో ఈ విషయాన్ని నేను వాదించబోవడం లేదు. ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగినా టీవీ చానళ్ళలో తప్పక కనిపించే వ్యక్తి సంధ్య. ఆమెకి బాగా ఇష్టమయిన యాంగిల్ ఆడదాన్ని మగవాడు ఆస్తిగా చూడటం. ఈ పిల్ల నాకు స్వంతమవ్వాలి లేదా ఇంకెవరికీ దక్కకూడదు అని మగవాడు అనుకోవడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి అని ఆమె భావన,వాదన.
నాకు చాలా క్లియర్ గా ఈ ఇన్సిడెంట్ లో కనిపించేది ఆ శేఖర్ అనే ఉన్మాది తల్లితండ్రుల నిర్లక్ష్యం. వాడు గదినిండా వందల బీరి బాటిళ్ళు, విస్కీ,బ్రాందీ బాటిళ్ళు పెట్టుకొని ఉంటే ఆ తల్లితండ్రులు ఒక్కసారి వాడి గదికి వచ్చి అప్పుడైనా కొడుకు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని చూసినట్లయితే వీడు సరయిన దారిలో లేదని వాళ్ళకి తెలిసిపోయేది కదా?
పిల్లలు ఏం చేస్తున్నారో అన్నది చూడకుండా వాళ్ళు ఏం అడిగితే అది అందించి వాళ్ళు అచ్చోసిన ఆంబోతుల్లా తయారయితే అందులో తల్లితండ్రుల పాత్ర కూడా ఉంటుంది. ఇది కాదనలేని సత్యం.
వాడు పిలవగానే ఈ పిల్ల వాడి రూంకెందుకెళ్ళింది, అక్కడ ఆ మద్యం సీసాలు చూడగానే వెంటనే ఎందుకు బయటకి వచ్చేయలేదు అన్న ప్రశ్నలు ఇక్కడ నేను అడగడం లేదు. చచ్చిపోయిన పిల్ల గురించి డిస్కషన్ పెట్టడం బావుండదని.