నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, September 21, 2010

జగన్ బాబూ నాన్నగారిమీద ఇలా సినిమా తీయండి

(మదనపల్లిలో వైఎస్ గుడికి శంఖుస్థాపన చేశారన్న వార్త చదివాక రాసిన పోస్టు ఇది)

జగన్ బాబూ ఇవాళ మీడియాకున్న శక్తి గురించి నీకు చెప్పాల్సిన పని లేదు.అది తెలియబట్టే కదా ఒక పేపరు,ఒక చానలు పెట్టావు. అయితే సినిమా కూడా మరొక ప్రధానమైన సాధనం. లాభాల కోసం సినిమాలు తీసేవారికి అందులో కష్టాలుండవచ్చు గానీ నష్టమొచ్చినా జానేదేవ్ అనుకునే మనలాంటివారికి అది మంచి సాధనం. ఒక వైపు ఓదార్పు యాత్ర చేస్తూనే నాన్న గారి మీద మంచి సినిమా తీసి జనాల్లోకి వదులు. సూపర్ గా ఉంటుంది. ఒక నెలా,రెండునెలల్లో సినిమా పూర్తవుతుంది. అప్పటికెలాగూ ఓదార్పు పూర్తి కాదు కదా?

ఈమధ్యనే భగీరధుడు అన్న పేరుతో ఎవడో సన్నాసి ఒక సినిమా తీశాడు గానీ అది ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో ఎవరికీ తెలియలేదు. అయినా సినిమా అలా తీయకూడదు. ప్రాజెక్టులు కట్టాడు, అది చేశాడు,ఇది చేశాడు అంటే కాదు. అన్నమయ్య సినిమా చూడు. అయన మంచి పాటలు,కీర్తనలు రాశాడు అని మాత్రమే కాకుండా అయన విష్ణు మూర్తి యొక్క ఖడ్గం అంశతో పుట్టాడని చూపితేనే జనం మెచ్చి చప్పట్లు కొట్టారు.

మన సినిమాకి కూడా అదే స్టైల్లో నేను ఒక కథ చెప్తాను. దీని ఆధారంగా స్క్రిప్టు రాయించి సినిమా తీయించు. సూపర్ గా ఉంటుంది.
భూలోకంలో, మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు, రైతులు దుష్టపాలనలొ చాలా బాధలు పడుతూ ఉంటారు. వాళ్ళని ఆ కష్టాలనుంచి గట్టెక్కించడానికి విష్ణు మూర్తి తనలోని ఒక అంశని దానం చేస్తాడు. ఆ అంశ ఒక కాంతి పుంజం రూపంలో అలా గాల్లో ఎగురుకుంటూ, దారిలో జెరూసలెంలో దేవును బిడ్డ అయిన ప్రభువు యేసు యొక్క మరొక అంశని తనలో మిళితం చేసుకుని, కడప జిల్లా పులివెందులకొచ్చి నాన్న గారి రూపంలో జన్మిస్తుంది. ఆ బిడ్డ పుట్టి కేర్ కేర్ మనగానే, అప్పటి వరకూ నిర్మలంగా ఉన్న ఆకాశం మేఘావృతమైనట్టూ, కుండ పోతగా వర్షం కురిసినట్టు, బీడు పడి ఎండి పోయిన నేల మొలకెత్తినట్టూ, వట్టి పోయిన పశువుల పొదుగుల్లోంచి పాలు కారినట్టూ గ్రాఫిక్స్ చూపించాలి ఇక్కడ.
సరే, ఆయన పెద్దయ్యి సమాజంలో కుళ్ళుని,అవినీతిని ప్రక్షాలణం చేసినట్టు కొన్ని సన్నివేశాలు చూపిస్తూ ఇంటర్వెల్ దాకా లాక్కొస్తాం. ఎంతకీ అధికారం దక్కక పైపెచ్చు కష్టాలనెదుర్కోవలసి రావడంతో ఆయనకి కోపమొచ్చి "దేవుడా ఏమిటి నాకీ పరీక్ష?" అని కోపంతో ప్రశ్నిస్తే, శ్రీ మహా విష్ణువు శిలువ మెడలో వేసుకొని ప్రత్యక్షమై "నాయనా, కొంత కాలం ఓపిక పట్టు.ఇవన్నీ నీకు పరిక్షలు" అని మాయమౌతాడు.

అప్పుడాయన ఎన్నికల సంగ్రామంలో చంద్రాసురుడిని ఓడించి రాజ్యాధికారం సాధించి, జనరంజకంగా పాలన సాగించి ఆంధ్ర దేశాన్ని భూతల స్వర్గంగా మార్చిపారేస్తూండగా దేవతలొచ్చి "బాస్!ఇక్కడ నీ పనై పోయింది.స్వర్గానికొచ్చెయ్" అని పిలుస్తారు. "స్వామీ!అప్పుడే ఎక్కడయింది? ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది" అంటాడు నాన్న. "బాబూ!స్వర్గ లోకంలో నీతో పనుంది. నీ దైవాంశని బాబు(అంటే నువ్వే జగన్ బాబూ) కిచ్చి నువ్వు స్వర్గానికొచ్చెయ్" అని ఆయన్ని తమతో తీసుకెళ్తారు ఆ దేవతలు.
ఒక దెబ్బకి రెండు పిట్టల్లాగా ఈ సినిమాతో వై ఎస్సార్ కి అన్నేసి విగ్రహాలు పెట్టడం, ఆయన పేరిట గుళ్ళు కట్టడం ఏమిటే అని ప్రశ్నలేసే వాళ్ళకి సమాధానం చెప్పినట్టు ఉంటుంది, మీలో కూడా ఎంతో కొంత దైవాంశ ఉన్నట్టు ఎస్టాబ్లిష్ చేసినట్టూ ఉంటుంది.

ఈ సినిమాకి రెండో మూడో కోట్లు ఖర్చవుతాయంతే. కానీ ఫలితం మాత్రం చాలా ఉంటుంది. సిరియస్ గా ఆలోచించండి.

17 comments:

ravi said...

too good

Anonymous said...

'bhuloka daivam-mana rajanna'cinema pEru o.k naa?

Anonymous said...

"ఆ అంశ ఒక కాంతి పుంజం రూపంలో అలా గాల్లో ఎగురుకుంటూ" -- BY mistake galilo badulu ganullo ani chadivi navvukunna,,,anyways nice article

రహ్మానుద్దీన్ షేక్ said...

బావుంది కాకపొతే మరి రాజారెడ్డి గారి పాత్ర ఏం చెయ్యాలి. ఆయన్ని కూడా దేవుడ్ని చేస్తే సరి

Indian Minerva said...

@రహ్మానుద్దీన్ షేక్: అప్పుడు ఈయన(కూడా) దేవునికుమారుడౌతాడు. కొంచెం anti sentimentఅయ్యే ప్రమాదంవుంది. జగన్ అంశ కూడ వీకైపోయే ప్రమాదం వుంది. మీకు మరీ అంతగా కావాలనుకుంటే మన రాహుల్ గాంధీ వుండనే వున్నాడు.

మరీ పాండురంగడు, అన్నమయ్యలా first half శృంగార భరితంగా తీస్తే చ్చ్చండాలంగా వుంటుంది కాబట్టి. పువ్వు పుట్టగానే పరిమళించింది చందాన చిన్నప్పుడు చెరువులూ అవ్వీ కట్టించి పెద్దయ్యాక ప్రాజెక్టులు కట్టించినట్టు చూపిస్తే బాగుంటుందేమో.

Anonymous said...

Great post!

ఆత్రేయ said...

పోస్ట్ బాగుంది కానీ అన్నమయ్య మూవీ తో పోల్చకుండా ఉండాల్సింది . అన్నమయ్య నందకం అంశ తో పుట్టాడో లేదో అది హిందూ జన విశ్వాసం. అయినా ఆ దైవ అంశ లేక పోతే అయన జీవిత కాలం లో ౩౨ వేల కీర్తనలు రాయలేక పోవచ్చు. కాబట్టి అయన దైవాంస సంభూతుదే. ఇక పోతే మన కధ లో హీరో కూడా అతి తక్కువ సమయం లో అతి ఎక్కువ జ(ధ)నా కర్షణ సంపాదించాడంటే.... ఈయన గొప్పోడే ..

రామ said...

కేక అంటాను :)

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Thanks very much all of you.

Anonymous said...

maryaadaga Jesus photo pakkanundi krishnudi photo theeseyandi....

Sree said...

సినిమా పేరు: రాజశేఖర చరిత్ర

ప్రొడ్యూసర్స్: రక్షణ క్రియేషన్స్

డైలాగులు: అంబటి రాంబాబు

పాటలు: (1) రాజశేఖరా నీపై మోజు తీరలేదురా.. (2) ఎక్కు తొలి మెట్టు..బాబుని కొట్టు ఢీకొట్టు (నరసింహ స్టైల్ లో). ఈపాట YS పాదయాత్ర సీన్, జగన్ ఓదార్పు యాత్ర సీన్ లో వాడుకోవచ్చు.

సినిమాలో ఒకే వ్యక్తి 300 మంది ఫాక్షనిస్టులని నరకటం సూపర్ సీన్ గా తీయొచ్చు. మగధీర దానిముందు ఎందుకూ పనికిరాదేమో!!

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Fantastic,Sree.You are the story and screenplay writer for the movie. Gali bros. are co-producers for the movie.

Sree said...

జగన్ అన్న ఓ బ్లాంక్ చెక్, సినిమా పోతే నా బాధ్యత లేదని ఓ లిఖిత పూర్వక హామీ ఇస్తే ఈ ఉద్యోగం వదిలేసి అదే పనిమీద ఉంటాను !!

SANJAY MENGANI said...

This was one of best comments, I have read on YS family. The story was great and rocking....

SANJAY MENGANI said...

This was one of best comments, I have read on YS family. The story was great and rocking....

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Thank you Sanjay.I have never expected someone would read my post after 20 days.

Suresh said...

Nice post!