నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, September 30, 2010

గుడ్ లక్ రోబో!

రేపు రజనీకాంత్ నటించిన శంకర్ సినిమా రోబో విడుదల కానుంది. భారత చలన చిత్ర చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ సినిమాగా రూపొందిన ఈ సినిమా విజయవంతమ్ అవుతుందని ఆశించడానికి చాలా కారణాలున్నాయి. అందులో ప్రధానమైనది శంకర్. డబ్బులు ఏట్లో పోసినట్టు ఖర్చు చేయడం కాకుండా పెట్టిన డబ్బుకి సరిపడా ఎఫెక్ట్ తెర మీద చూపించగల సమర్ధుడతడు.
అక్కడక్కడా విన్నదాన్ని, చదివిన దాన్ని బట్టి చూస్తే ఫ్రాంకెన్ స్టెయిన్ కథకి గ్రాఫిక్స్ షోకులద్ది రోబోగా తెరకెక్కించినట్టు అనిపిస్తోంది. అయినా భారత అందులోనూ దక్షిణ భారత చలన చిత్ర స్థాయిని పెంచడానికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న రోబో విజయం సాధించాలని నా ఆకాంక్ష.

1 comment:

చిలమకూరు విజయమోహన్ said...

సినీ పరిశ్రమలోనే కాకుండా నిజజీవితంలో కూడా ఉన్నత వ్యక్తిత్వమున్న హీరో రజనీకాంత్ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను