కొంత ఆలస్యమైనా అయోధ్య వివాదానికి తగిన పరిష్కారమే లభించింది. ఎవరూ నష్టపోకుండా ఏ మతానికి చెందిన సామాన్యుడికీ ఆవేశం కలగనీయకుండా తీర్పు చెప్పింది హైకోర్టు. ఇంక దీనిపై సుప్రీం కోర్టుకెక్కి ఈ అంశాన్ని మరింత జటిలం చేయకుండా ఇరు పక్షాలు సంయమనం పాటిస్తే అందరికీ మంచిది.
హిందువులు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇది అనాదిగా ఎంత హిందూ రాజ్యమైనప్పటికీ గత తరాలు చేసిన తప్పుల వల్ల ఇది హిందూ రాజ్యం ఎంత మాత్రం కాదనీ, ఇతర మతాల వారితో కలిసి మెలిసి మెలగక తప్పదనీ కొంచెం ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో ఉండాలనీ వారు గమనించాలి. అలాగే ముస్లిములు కూడా తాము ఎంత పెద్ద ఓటు బ్యాంకు అయినప్పటికీ అన్ని సార్లు తాము ఆడమన్నట్లా ఆడరనీ అందుకు తామూ సర్దుబాటు వహించాలని తెలుసుకోవాలి.
ఒక వేళ ఎవరైనా సుప్రీం కోర్టుకెళ్తే ఆ తీర్పు వెలువడే నాటికి దేశం ఇంత ప్రశాంతంగానే వుంటుందన్న గ్యారంటీ లేదు. అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం.కాబట్టి ఇప్పుడు అంత సవ్యంగా ప్రశాంతంగా ఉంది కాబట్టి ఎవరికి కేటాయించిన స్థలం వాళ్ళు తీసుకొని అందులో గుడో, మసీదో, మన్నో, మశానమో, వాళ్ళ శ్రాద్ధమో ఎదో ఒకటి కట్టుకొని తగలడితే మంచిది. పద్ధతిగా ఉంటుంది.
1 comment:
నేను చెప్పింది కూడా అదే. తీర్పు నాకు నచ్చలేదు ...నేను సుప్రీం కోర్టుకి పోతా అని పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ప్రజలను ప్రశాంతంగా ఉండనిస్తే అదే పదివేలు. పనీపాటా లేని సన్నాసులు( ఆపక్కోళ్ళూ - ఈపక్కోళ్ళూ) ప్రజలకు చేసే గొప్ప మేలు ఇదే .
Post a Comment