ఉదయం టీవీలొ ఒక చానల్లో జఫ్ఫా డాక్టర్ అని న్యూస్ స్టోరీ వస్తుంటే ఏమిటా అని చూశాను. విశాఖపట్నంలొ సిజేరియన్ ఆపరేషన్ చేస్తూ శిశువు చెవి కట్ చేసి మరణానికి కారణమైన డాక్టర్ గురించిన స్టోరీ అది. మరీ ఒన్ సైడెడ్ కాకుండా కొంచెం బాలన్సుడుగా ఉంది కథనం. సరే, ఎంత పెద్ద పోటుగాడైనా అప్పుడప్పుడూ నూటికో కోటికో ఒక పొరపాటు జరగక మానదు. మనం మనుషులమే కానీ రోబో సినిమాలో చిట్టిలం కాదు కదా.
నూటికో కోటికో ఒక పొరపాటైతే ఓకే, ప్రతి రెండు మూడు కేసులకీ ఒక పొరపాటైతే ఎలా. ఇప్పుడు దేశమంతా కుప్పలు తెప్పలుగా వెలిసిన ప్రైవేటు మెడికల్ కాలేజీలు తయారు చేస్తున్న డాక్టర్ల స్టాండర్డ్స్ కొంచెం దగ్గరనుంచి చూస్తే భయం వేస్తుంది.
అస్సలు పేషంట్లని తాకుండా, చూడకుండా డాక్టరీ పట్టా పుచ్చుకొనే డాక్టర్ల సంఖ్య పెరిగి పోతూంది. అన్యాయమేమిటంటే ఇలాంటి కాలేజీలకి పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు కూడా మంజూరు కావడం. ఒక ఆపరేషన్ కూడా చేయకుండా పట్టా పుచ్చుకొని వీళ్ళు బయటకి వచ్చేస్తారు. నాన్నో మామో అప్పటికే నడుపుతున్న హాస్పిటల్లో కూర్చుని వచ్చిన పేషంట్లపైన తమ విద్యకి పదును పెట్టుకొంటారు.
మంచి షోకులున్న హాస్పిటల్ డాక్టరుగారి పేరు చివర్న ఉన్న ABC..XYZ..London..France..Glasgow డిగ్రీల తోకలు చూసి అమాయకంగా పేషంట్లు వస్తారు. మన డాక్టరుగారికి విద్య నేర్పిస్తారు.
దీన్లో ఏమీ అతిశయోక్తి లేదు. మా ఊరిలో కొత్తగా వచ్చి ప్రాక్టీసు పెట్టిన ఒక ఎముకల డాక్టరు గురించి అదే ఊళ్ళో ఉన్న నా కజిన్ చెప్పిందే ఇది. మైసూరులో నలభై అయిదేళ్ళ చరిత్ర కలిగిన ఒక కాలేజీలో పదేళ్ళ క్రితం ముప్పై లక్షలు కట్టి పీజీ చేసిన ఆ డాక్టరు తన మూడేళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగులో స్వంతంగా ఒక్క ఆపరేషన్ కూడా చేయలేదని స్వయంగా చెప్పాడని మావాడు నాతొ చెప్పాడు.
అంత చరిత్ర కల కాలేజీలే అలా ఉంటె నిన్న మొన్న మొదలు పెట్టిన కాలేజీలు, వాటిలో శిక్షణ పొంది రేపో మాపో బయటికి వచ్చి ప్రజల పాణాలతో ఆడుకోబోయే డాక్టర్ల మాటేమిటి? వారితో చికిత్స చేయించుకోబోయే పేషంట్ల గతేమిటి?
వీధికో జఫ్ఫా డాక్టర్, టీవీ చాన్నళ్ళకి గంటకో న్యూస్ స్టోరీ!
3 comments:
లక్షలకు సీట్లు రోగులకు పాట్లు " అంటే ఇదేనేమో బ్రదర్
మా పట్టణంలో కొత్తగా కట్టిన ప్రైవేట్ మెడికల్ కాలేజిలో కూడా సీట్ ముప్పై లక్షలే. ముప్పై లక్షలు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజి సీట్ కొన్నవాడు డాక్టర్ అయిన తరువాత ఖర్చు రాబట్టుకోవడానికి పేషెంట్లని భయపెట్టి చిన్న కేసులకి పెద్ద ఆపరేషన్లు చేసి ఎంత సంపాదిస్తాడో.
just a week back in chennai.ramachandra medical university had added 45 grace marks to 25 students,who got only 5marks in bio-chemistry.wat a act it was?
Post a Comment