నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, October 10, 2010

ఈ రెండు చానళ్ళని బహిష్కరించండి.

ఇప్పటిదాకా ఈనాడు,సాక్షి పేపర్ల మధ్య నడుస్తున్న వీధి పోరాటం ఇప్పుడు టీవీ చానళ్ళకు పాకింది. అయితే ఈ యుద్ధంలో సాక్షితో పోరాడుతున్నది స్టూడియో ఎన్. దీన్ని పోరాటం అనే కన్నా పిచ్చికుక్కల కాట్లాట అంటే సమంజసంగా ఉంటుంది.
నిన్నటిదాకా వైఎస్, జగన్ ల ఆస్తులపైన, వాళ్ళ రాజ ప్రాసాదాల పైన స్టూడియోఎన్ వరుస కథనాలు ప్రసారం చేసింది. అందులో భాగంగా హైదరాబాద్ లో నిర్మాణంలో ఉన్న ఒక జగన్ బంగళా లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నిస్తే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం దాన్ని మీడియాపైన దాడిగా స్టూడియోఎన్ ప్రసారం చేయడం జరిగింది.
ఇప్పుడు సీన్ వంతాడకు మారింది. అక్రమ మైనింగ్ పైన పోరాటం చేస్తానని చంద్రబాబు నాయుడు వంతాడకు పోవడం అక్కడ గిరిజన మహిళలతో ఇంటరాక్షన్ సమయంలో ఆయన చేతిని విదిలించడం, దాన్ని అమాయక గిరిజన మహిళలమీద దాడిగా సాక్షి చానలు,పేపరు నానా యాగీ చేయడం, దానిని ప్రతిగా స్టూడియోఎన్ వాళ్ళు చంద్ర బాబు ఎవరిని కొట్టాడని సాక్షి వాళ్ళు యాగీ చేశారో ఆమెని పట్టుకొచ్చి ఆమె చేత రెండు ముక్కలు మళ్ళీ మళ్ళీ చెప్పించి చూసే వాళ్ళకి నరకం చూపించారు.మరుసటి రోజు ఇంకో చానల్ వాళ్ళు ఒక దళిత నాయకుడినీ, టీడీపీ నాయకుడ్నీ పట్టుకొచ్చి ఒక దిక్కుమాలిన చర్చ.
చానల్ పెట్టి ఇరవై నాలుగ్గంటలూ సొంత అజెండాతో నడిపిస్తే ఎలా? కనీసం ప్రేక్షకుడంటూ ఒకడుంటాడన్న స్పృహ లేకపోతే ఎలా? అందుకని ఈ రెండు చానళ్ళ ధోరణిపైన విసుగెత్తిన వాళ్ళు వీటిని బహిష్కరిస్తే ఓపనయిపోతుందని నా ఉద్ధేశ్యం. అప్పుడు మిగిలిన వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకొని ప్రేక్షకుడికి విలువనిస్తారని ఆశ.

10 comments:

jaggampeta said...

mee blog archivelo letters kanpichut ledu.templet designku velli saricheyandandi

Anonymous said...

స్టూడియో ఎన్ చంద్రబాబు నాయుడు బంధువులదని విన్నాను. సాక్షి చానెల్ జగన్ దే కానీ అందులో అతని బంధువులకి వాటాలు ఉన్నాయి. టివి చానెళ్లు సామాజిక ప్రయోజనాల కోసం కాకుండా బంధువుల ప్రయోజనాల కోసం పని చేస్తున్నాయి.

Anonymous said...

mee blog chala bagundandi...!!

Prati roju eenadu paper(naku ee paper ante partiality yemi ledu...just ala cheppananthe) choosinatlu mee blog kuda choostu untanu!!

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Thanks very much Jaggampeta and Anonymous.

మార్గం రాజేంద్ర ప్రసాద్ said...

చాల భాగుంది. మీ ప్రయత్నానికి అభినందనాలు

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Thank you.

Apparao said...

ఈ టీవి 2 చూడొచ్చు, ఒకే విషయం మీద రచ్చ చేయకుండా ఒక్క సారి మాత్రమె చూపాయించి వదిలేస్తాడు, మిగిలిన చానెళ్ళు దాని మీద చర్చావేదిక పెడతారు

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Yes.You are right.

Anonymous said...

yes,he is correct

మార్గం రాజేంద్ర ప్రసాద్ said...

it is best