నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, August 30, 2011

డూప్లికేట్ అన్నా హజారే


ఏదైనా ఒక వస్తువు బాగా పాపులర్ అయితే అలాంటి డూప్లికేట్‌లు పుంఖాను పుంఖాలు పుట్టుకొస్తాయి. ఆపిల్ కంపెనీ వారి ఐ ప్యాడ్ సృష్టించిన సంచలనం చూసి ఐడియా ప్యాడ్, టచ్ ప్యాడ్, థింక్ ప్యాడ్‌ల పేరిట లెక్కకు మించిన టాబ్లెట్ పీసీలు మార్కెట్‌ని ముంచెత్తాయి.
  


 అలాగే ఇప్పుడు దేశంలో అన్నా హజారే హవా నడుస్తుండండం చూసిన చిన్నా చితకా నాయకులందరూ అవినీతి వ్యతిరేక బాట పట్టారు. ఈ గుంపులో హైటెక్ రత్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. అయితే అందరిలా పత్రికా ప్రకటనలకో, ఉపన్యాసాలకో పరిమితం కాకుండా ఎందుకో ఈ సారి విద్యార్థులతో మమేకం అన్న ప్రోగ్రాం పెట్టుకున్నారు. 
 
నేటి విద్యార్థులే రేపటి ఓటర్లు అన్న స్పృహతోనో, ఈ మథ్య అందరూ ఓటేయాలి అన్న స్పృహ వచ్చి చదువుకున్న వాళ్ళు కూడా కేవలం ఊకదంపుడు మాటలకు పరిమితం కాకుండా పోలింగ్ బూత్ వరకూ వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకొంటూ ఉండడం చూసి ఆయన ఈ ప్రోగ్రాం పెట్టుకున్నారేమో. అయితే ఈ కార్యక్రమాన్ని ఆయన పక్కాగా ప్లాన్ చేశారు. తన వాళ్ళ యాజమాన్యంలో నడిచే కాలేజీలనే ఎంచుకొన్నారు. ఆ యాజమాన్యాలు కూడా ఏయే ప్రశ్నలడగాలో, ఎవరు అడగాలో ముందుగానే పక్కాగా ప్లాన్ చేసి పెట్టుకున్నారు. 

అయినా కథ అడ్డం తిరిగింది. విద్యార్థులతో వచ్చిన తల నొప్పె ఇది. ఆ వయసులో ఆవేశం, ఆలోచనా అలాంటివి మరి. వాళ్ళలో కొంతమంది స్క్రిప్ట్‌ని పక్కన పడేసి బాబు గారి తల తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే ప్రశ్నలు సంధించారు. మీరు అవినీతికి పాల్పడలేదా? మీకు వేల కోట్ల ఆస్తులెక్కడి నుంచి వచ్చాయి? సింగపూర్‌లో మీకు హోటల్ లేదా? స్విస్ బ్యాంక్‌లో అకౌంట్ లేదా? అని ప్రశ్న మీద ప్రశ్న సంధించేసరికి బాబు గారు ఇబ్బంది పడ్డారు. 


అఫెన్స్ ఈజ్ బెస్ట్ డిఫెన్స్ అని ఆయన ఆ ప్రశ్నలడిగిన వాళ్ళ మీద ఎదురు దాడి చేశారు. నా ఆస్తులెక్కడున్నాయో ఆథారాలు తీసుకురా, నీకే రాసిస్తాను అని కోపగించుకొన్నారు. తెలుగు తమ్ముళ్ళకు మాత్రం తమ నాయకుడి తీరు నచ్చడం లేదు. ఎక్కడో ఒక చోట వేదిక మీద నిలబడి ఉపన్యాసమిస్తే పోయేదానికి ఇదంతా ఎందుకని వాళ్ళ ఆలోచన. స్టేజెక్కి లెక్చర్లు దంచితే వినే వాడు వింటాడు, వినని వాడు మూసుకొని ఉంటాడు. అంతేకానీ ఎవరూ ఇలా ఇబ్బంది పెట్టే ప్రశ్నలడిగి విసిగించరు కదా అన్నది వాళ్ళ లాజిక్. 


నిజమే మరి నాయకులు ప్రజలముందుకొస్తే ఇలానే ఉంటుంది మరి.

ఒక్క రోజు జిమ్‌కి వెళ్ళకుండా సిక్స్ ప్యాక్ కావాలంటే....


అమ్మాయిలకి ఎత్తైన వక్షాలు సన్నటి నడుము ఉంటే ఎలా ఉంటుందో, అబ్బాయిలకి సిక్స్ ప్యాక్ పొట్ట అలా ఉంటుంది. అందుకే ఓమ్ శాంతి ఓమ్ సినిమా కోసం షారుఖ్ ఖాన్, గజినీ కోసం అమిర్ ఖాన్ నెలల తరబడి జిమ్‌లో కసరత్తులు చేసి సిక్స్ ప్యాక్ సాధించారు. అయితే అలా ప్రతి రోజూ గంటల తరబడి జిమ్‌లో కూర్చోవడం అందరికీ అయ్యే పని కాదు. అయితే ఒక్క రోజు కూడా జిమ్‌కి వెళ్ళకుండా సిక్స్ ప్యాక్ వచ్చే వీలుంటే? ఇది ఎలా సాధ్యమా అని ఆశ్చర్యపోకండి.
  
బాడీ కాంటూర్(Body Contour) అనే ఒక క్లినిక్ దీనిని నిజం చేస్తుంది. ఛానల్ ఫైవ్ అనే ఒక టీవీ ఛానల్ నిర్వహిస్తున్న సెలబ్రిటీ బిగ్ బ్రదర్ అనే పోటీలో పాల్గొంటున్న డారిన్ ల్యోన్స్ అనే మీడియా అధినేత తన సిక్స్ ప్యాక్ ఆబ్స్ చూపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. నలభై ఆరేళ్ళ ల్యోన్స్ తన జీవితంలో ఎప్పుడూ జిమ్ మొహం చూసి ఎరగడు. అయినా అతను చొక్కా విప్పితే లోపల సిక్స్ ప్యాక్ కండలు ఉంటాయి. 
  


సినిమా హీరోలనూ, బాడీ బిల్డర్లనూ సిక్స్ ప్యాక్‌లతో చూసి మోజు పడ్డ ల్యోన్స్ తనకూ అలాంటి కండలు కావాలని బాడీ కాంటూర్ క్లినిక్‌ని సంప్రదించాడు. వాళ్ళు అతని కడుపు మీద కొన్ని చోట్ల ఉన్న కొవ్వును లైపో సక్షన్ ద్వారా తొలగించి సిక్స్ ప్యాక్ అబ్స్ కనిపించేలా చేశారు. అయితే ల్యోన్స్ కడుపు మాత్రం చూడడానికి కొంచెం వికారంగా ఉంటుంది. వళ్ళంతా కొవ్వుతో కడుపు మీద మాత్రం కండలతో కృత్రిమంగా అనిపిస్తుంది. 
  


టీనేజ్ మ్యుటాంట్ నింజా టర్టుల్ వేషం వేసి నట్లుంది అని కొందరు, పీపా మీద గీతలు గీసినట్లుంది అని మరి కొందరు కామెంట్ చేశారు. కానీ ల్యోన్స్‌తో కలిసి బిగ్ బ్రదర్ షోలో పాల్గొంటున్న ముప్పై సంవత్సరాల కెర్రీ కాటోనా మాత్రం ల్యోన్స్‌ని చూసి బాగా ఇంప్రెస్సయి పోయింది. షో ముగిశాక తనూ అతనిలా ఆపరేషన్ చేయించుకొని పొట్టమీద కొవ్వు తొలగించుకొని అందంగా కనిపించాలని అనుకొంటున్నట్టు చెప్పింది. బ్రయాన్ మెక్‌ఫాడెన్ అనే పాప్ సింగర్ మాజీ భార్య అయిన ఈ అమ్మడు నలుగురు పిల్లల తల్లి. ఈమె ఇంతకు ముందు వక్షోజాల సైజు తగ్గడానికి ఒక సారి, వంట్లో కొవ్వు తగ్గించుకోవడానికి ఒక సారి కాస్మెటిక్ సర్జరీ చేయించుకొని ఉంది. 

సిక్స్ ప్యాక్ అంటే ఏమిటి?

ఉదరం భాగంలో రెక్టస్ అబ్డామినిస్ అనే ఒక జత కండరాలు ఉంటాయి. ఇవి మధ్య మధ్యలో లోపల ఉన్న కండరాలకు అతుక్కొని ఉంటాయి. ఆ అతుక్కున్న భాగాల మధ్య భాగాలు కొంచెం ఉబ్బుకొని ఉంటాయి. ఈ ఉబ్బుకొని కనిపించే కండరాలే సిక్స్, ఎయిట్ ప్యాక్‌లు. 
  
ఇవి ప్రతి ఒక్కరికీ ఉంటాయి. అయితే పొట్టమీద పేరుకొన్న కొవ్వు వీటిని కప్పివేస్తుంది. ఆ కొవ్వుని కరిగించడానికి ఎక్సర్‌సైజ్ చేసిన వారికి కొవ్వు కరగడంతో బాటు, ఈ కండలు కూడా బాగా ఉబ్బి సిక్స్, ఎయిట్ ప్యాక్‌లు కనిపిస్తాయి.

అన్ని కొండలూ ఆయనవేరా బ్లడీ ఫూల్!


తిరుమల కొండల హద్దుల మీద అటవీ శాఖకీ, టీటీడీ వాళ్ళకీ మధ్య ఏదో నడుస్తున్నట్లుంది. ఈ విషయమ్మీద మొన్న (27 ఆగస్ట్) టీవీ9 ఒక స్టోరీ ప్రసారం చేసింది. సరే వార్తా ఛానల్‌గా అది వాళ్ళ పని. అయితే ఆ వార్త మొత్తం అదేదో స్వయానా స్వామి వారి ఆస్థిని ఎవరో కాజేస్తున్నట్లు శ్రీవాసుడికి మిగిలేది రెండు కొండలేనా, ఆయన ఆస్థి ఇక రెండు కొండలకే పరిమితమా? అన్న వాక్యాలు పదే పదే వల్లించడం మూర్ఖత్వంగా అనిపించింది.
   


స్వామి సర్వాంతర్యామి. ఒక అడుగుతో ఆకాశాన్ని, మరొక అడుగుతో భూమండలాన్ని ఆక్రమించిన వాడు. ఆయనకి రెండు కొండలు మిగలడమేమిటి? అటవీ శాఖకెంత, టీటీడీకెంత అని చూసుకోవాలి గానీ, స్వామివారికెంత ఉంటుంది, ఎంత పోతుంది అని లెక్కలేమిటి?


దీనికి ముక్తాయింపు ఏమిటంటే తిరుమల కొండలన్నీ టీటీడీకే చెందుతాయని అతవీ శాఖా మంత్రిగారు సెలవిచ్చారు.

Thursday, August 25, 2011

రాజ రాజ చోళుడు Vs జగన్ మోహన్ రెడ్డి


తమిళ నాడునే కాదు, పూర్తిగా దక్షిణ భారత దేశంతో బాటు, సింహళన్ని, మాల్దీవులను కూడా జయించిన రాజ రాజ చోళుడికీ జగన్ మోహన్ రెడ్డికీ వెయ్యి సంవత్సరాల పైనే గ్యాప్ ఉంది. అలాంటిది ఇద్దరికీ పోలికేమిటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇద్దరి జీవితాలలో కొంత సాపత్యం, కొంత వైరుధ్యం ఉంది. ఒక సారి చూడండి.
 
అప్పటి వరకూ అధికారం  కోసం చిన్నా చితకా రాజులతో పోరాడుతూ వచ్చిన చోళులకి రాజ రాజ చోళుడు సార్వభౌమత్వం కల్పించాడు. తమిళ నాడుని పూర్తిగా జయించి, పడమరగా కేరళ ప్రాంతంలో చేర రాజులని, ఉత్తరాన చాళుక్య రాజుల్ని ఓడించి వింధ్యకి ఇవతల ఉన్న భూభాగమంతా జయించి, సముద్రాన్ని దాటి శ్రీలంకని, మాల్దీవులని కూడా జయించి ఒక విశాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు రాజ రాజ చోళుడు. ముగ్గు రాళ్ళ గనులని తవ్వుకుంటూ ఉన్న రాజా రెడ్డికీ, రాజకీయాల్లో డక్కా మొక్కీలు తింటు వస్తున్న రాజ శేఖర్ రెడ్డికీ సాధ్యం కాని పని, ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించడం చేశాడు జగన్.


తన స్థాయికి తగ్గట్టుగా ఒక చిరకాలం నిలిచే చిహ్నాన్ని నిర్మించాలని తంజావూరు బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు చోళ రాజు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో ఒక ప్యాలస్‌ని, బెంగుళూరు, పులివెందులలో రెండు ప్యాలస్‌లనీ, సాక్షి మీడియా సామ్రాజ్యాన్ని చిరకాలం నిలిచేలా నిర్మించాడు పులివెందుల యువ రాజు.
  
మరొక కీలక అంశంలో సాపత్యం, వైరుధ్యం రెండూ కనిపిస్తాయి. పరాంతక సుందర చోళుడి కుమారుడు రాజ రాజ చోళుడు. తండ్రితో కలిసి కొన్ని, తండ్రి లేకుండా స్వయంగా తను కొన్ని దండయాత్రలలో పాల్గొని ఎన్నో అద్భుత విజయాలు సాధించి తన సామర్ధ్యాన్ని నిరూపించుకొన్నాడు. అయితే తన అన్న ఆదిత్య చోళుడు తండ్రి తరువాత సింహాసనం ఎక్కాల్సి ఉండగా ఒక కుట్రలో హత్యకి గురవుతాడు. దానితో అంతఃపురంలో, అస్థానంలో, ప్రజలలో ఎంతో పేరున్న రాజ రాజ చోళుడికి సింహాసనం దక్కాలని అందరూ అభిలషించారు. కానీ ఆయన పదవిని తిరస్కరించి, తన చిన్నాన్న మధురాంగధన్ చోళుడిని రాజుగా చేసి 19 సంవత్సరాల తరువాత, అతని తదనంతరం సింహాసనమెక్కాడు. 
 
ఈ విషయంలో యువ నేత రాజ రాజ చోళుడికి భిన్నంగా వెళ్ళాడు. బహుశా వెయ్యి సంవత్సరాల అంతరం ఇందుకు కారణం కావచ్చునేమో!? రాజ రాజ చోళుడు ఇప్పుడు పుట్టి ఉంటే ఇలాగే ప్రవర్తించి ఉండే వాడేమో?


Wednesday, August 24, 2011

ఈ ముసలోడు ఎన్ని దీక్షలు చేసినా ఏమీ పీకలేడు


ఇప్పుడు ఏ మాత్రం సమకాలీన రాజకీయాలను ఫాలో అవుతున్న వారెవరైనా ఒకటే మాట; అన్నా హజారే, లోక్ పాల్. డెబ్బయ్యేళ్ల వయసులో జాతి మొత్తాన్ని, లేదా కనీసం మధ్య తరగతి ప్రజలందరినీ తనతో నడిపిస్తున్న హజారేని చుస్తే ఆశ్చర్యమనిపించక మానదు. కానీ ఈ రామ్‌లీలా మైదానంలో జరుగుతున్న జాతర పూర్తయితే పరిస్థితి మళ్ళీ back to square one అవుతుందని నా అభిప్రాయం.
 
అధికారం అడ్డు పెట్టుకొని దోచుకోవడాన్ని కార్పొరేటైజ్ చేసి తన వారికి ప్రజల సంపదని పందేరం చెసి తను కోట్లు మూట గట్టుకొని, ఆ కోట్లను విదేశాల్లో గుడ్లు పెట్టడానికి వాడుతున్న నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో అన్న హజారే ఏజెంట్‌లాగా అవినీతి వ్యతిరేక ఉపన్యాసాలు దంచుతున్నాడు.
 
 లోకాయుక్త చెప్పుతో కొట్టినా గాలి సోదరులు తమ పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి చాలా కష్టపడ్డారు(అంటే డబ్బు పోసి ఎమ్మెల్యేలను కొన్నారు అని) కాబట్టి వారికి మంత్రి పదవులు ఇవ్వాల్సిందే అని కర్ణాటక బీజేపీలో నాయకులు వాదిస్తున్నారు. గాలి బ్రదర్స్ కర్ణాటక, ఆంధ్ర ప్రదేస్ అని తేడా లేకుండా జాతి సంపదని లూటీ చేస్తుంటే అండగా నిలిచిన సుష్మా స్వరాజ్ ఇప్పుడు లోక్ పాల్ బిల్లు పటిష్టంగా ఉండాలి అని కేకలేస్తున్నారు.


  
తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని వేలకు వేల కోట్ల డబ్బు మేశాడని సీబీఐ సాక్ష్యాలతో సహా చూపిస్తుంటే, దేవుడుకి మకిలి అంట కడ్తారా, దేవుడి కొడుకు మీదే విచారణా అని ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధులు రాజీనామా చెసి మరీ సమర్ధిస్తుంటే, వారికి ప్రజలు పూలు పరిచి మరీ స్వాగతం పలుకుతున్నారట(source:Saakshi). వీళ్ళు సిగ్గు లేకుండా బస్సెక్కి మరీ ప్రజల వద్దకెళ్ళి అన్యాయాన్ని విప్పి చెప్తారట.

తాతగారూ, ఇది జరిగే పని కాదు కానీ, శిబిరం ఎత్తేసి ఎక్కడో ఒక పర్ణశాల నిర్మించుకొని మొక్కలు పెంచుకుంటూ ఉంటే కనీసం గ్లోబల్ వార్మింగ్ అయినా తగ్గుతుంది చూడండి. మీ దీక్ష ఫలించి మీరు అనుకున్న బిల్లు వచ్చినా ఈ దొంగ నా _______ లు తమ లూటీని కొనసాగించడం ఆపరు. వీళ్ళకున్న తెలివి తేటలను ముందుగా పసి గట్టి అడ్డుకట్ట వేసే బిల్లు తీసుకు రావడం ముక్కోటి దేవతలు కలిసి కట్టుగా ఆలోచించినా జరగదు. 

Tuesday, August 23, 2011

లోక్ జనపాల్ బిల్లు రాకపొతే గుడ్డలిప్పి డాన్స్ చేస్తానంతే!!


అన్న హజారే దీక్షకి అన్ని రంగాలలో వాళ్ళూ తమ మద్దతు ప్రకటిస్తున్నారు. లోకమెలా పోతే మాకేమిటి అనుకొనే బాలీవుడ్ వాళ్ళు కూడా సపోర్టు ఇస్తున్నారు. వరదలలో కూడా తమ పనికి అంతరాయం కలిగించని ముంబయి డబ్బావాలాలు కూడా ఒకరోజు తమ పనిని బంద్ చేశారు.
 


అన్నాకి నేను సైతం అనుకుందో లేక భారత్ ప్రపంచ కప్పు గెలిస్తే గుడ్డలిప్పి చూపిస్తానని స్టేట్‌మెంట్ ఒక్క దెబ్బతో పాపులరయి పోయి చాన్సులు కొట్టేసిని పూనమ్ పాండేని ఆదర్శంగా తీసుకొందో కానీ, అన్నా చెప్పినట్లు బిల్లు తీసుకురాకపోతే తను గుడ్డలిప్పి డాన్సు చేసేస్తానని బెదిరిస్తోంది డిల్లీకి చెందిన సలీనా వలీ ఖాన్ అనే మోడల్.
 
తనేమీ వివాదం కోసం, ఛీప్ పబ్లిసిటీ కోసం ఈ స్టేట్‌మెంట్ ఇవ్వడం లేదని, తన వయసుని కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం పోరాడుతున్న హజారేని చూసి ఇన్‌స్పైరై ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. "ఇప్పుడు ఎక్కడ చూసినా అవినీతి తాండవం చేస్తుంది. లంచం లేనిదే ఏ పని కూడా జరగడం లేదు. ణెను కూడా ఈ అవినీతి బాధితురాలినే. అందుకే అన్నాకి మద్ధతుగా నిలబడాలని అనుకొన్నాను. నా నిర్ణయాన్ని ఇతరులతో పోల్చి చూడొద్దు" అని పూనమ్ పాండే లాంటి దాన్ని తాను కాదని చెప్పింది ఈ ముద్దు గుమ్మ.

నిజమే! ఎవరికి తోచిన పద్దతులలో వారు పోరాడితే గానీ ఈ అవినీతి భూతం అంతం కాదు మరి. క్యారీ ఆన్ సలీనా! 


అయితే గియితే రేపు ఈ లోక్ జనపాల్ బిల్లు వస్తే ఈ సుందరి అన్న మాటకి కట్టుపడుతుందో, లేక పూనమ్ పాండే లాగా నన్ను ఇంకేదైనా దేశానికి తీసుకెళితే అక్కడ విప్పి డాన్స్ చేస్తాను అని మడత పేచీ పెడుతుందో చూడాలి మరి.