నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, October 31, 2010

కెలుకుడు ఆపండ్రా బాబోయ్, బ్లాగోయ్!

ఈ మధ్య తెలుగు ಬ್ಲಾగుల్లో కెలుకుడు ఎక్కువై పోయింది. ఇదివరలో కెబ్లాస అని ఒక డెడికేటెడ్ కెలుకుడు గుంపు ఉన్నా ఈ లెవెల్లో ఉండేది కాదు. ఇప్పుదు ప్రతి పోస్టులోనూ ఈ కెలుకుడు మొదలయ్యింది. కేవలం కెలకడం కోసమే బ్లాగుల్లో కామెంట్లు పెట్టే బ్యాచ్ ఒకటి నడుస్తూ ఉంది.
 
తెలుగు బ్లాగరుల్లో చాలామంది మంచి ఆరోగ్యకరమైన, ఆలోచింపజేసి వినోదాన్ని, విజ్నానాని పంచే పోస్టులు రాస్తున్నారు. అక్కడక్కడా కొన్ని హేట్ బ్లాగులున్నా వాటి సంఖ్య పరిమితం. 
 
ఇప్పుడు ఈ కెలుకుడు గాళ్ళ వల్ల తెలుగు బ్లాగ్ ప్రపంచం కలుషితమైపోయే ప్రమాదం ఉంది. కుల ప్రసక్తి తెచ్చి తిట్టడం, పచ్చి బూతు కామెంట్లు రాయడం అనే ఒక దుష్ట, విష సంస్కృతి మెల్లిగా బ్లాగు లోకంలో పాకుతోంది. మనకి నచ్చని విషయాలని విమర్శించవచ్చు, అభిప్రాయ బేధాలున్నప్పుడు వాటిని వెలిబుచ్చవచ్చు కానీ శృతి మించకూడదు.


సీనియర్ బ్లాగరులు ఈ విషయం గురించి ఆలోచించి తెలుగు బ్లాగ్లోకంలో ఆరోగ్యకరమైన బ్లాగింగ్ కొనసాగడానికి చర్యలు చేబడితే మంచిది. లేదంటే తెలుగు బ్లాగింగ్ మెల్లిగా అంతరించిపోయే ప్రమాదం ఉంది.

Saturday, October 30, 2010

శైవులకీ వైష్ణవులకీ పవిత్రమైన పుణ్యక్షేత్రం పుష్పగిరి

కడప పట్టణానికి 16 కిలో మీటర్ల దూరంలో పెన్నా నదీ తీరాన ఉన్నది పుష్పగిరి, అతి పురాతనమైన ఈ క్షేత్రం శైవులకీ వైష్ణవులకీ సమానంగా ఆరాధ్యనీయమైన పుణ్యక్షేత్రం.  శైవులు దీనిని మధ్య కైలాసం అని, వైష్ణవులు నధ్య అహోబిళం అని పిలుచుకొంటారు. ఇక్కడ ఉన్న శిల్ప సంపదని తెలియచేసే విధంగా రెండవ హంపి అని కూడా ఈ క్షేత్రాన్ని వ్యవహరిస్తారు. శంకరాచార్యుల గారిచే ఏర్పాటుచేయబడ్డ అద్వైత క్షేత్రాల్లో ఇది ఒకటి. మన రాష్ట్రంలోని ఏకైక శంకరాచార్య పీఠం ఇది. 


శిధిలమైపోగా మిగిలి ఉన్న ఆలయాలలో చెన్నకేశవ స్వామి ఆలయం అతి పెద్దది. ఇందులో 13 వ శతాబ్ధం నాటి శాసనాలు ఉన్నాయి. గుడి చుట్టూ, గుడి లోపలా అనేక అద్భుత శిల్ప సంపద ఉంది. రామాయణ, మహభారతాల లోంచి అనేక ఘట్టాలను ఇక్కడ శిల్పరూపంలో చూడవచ్చు. 


స్థల పురాణం:   పూర్వమ్ గరుత్మంతుడు తన తల్లి కోసం అమృతాన్ని తీసులెళ్తూండగా అందులోంచి ఒక చుక్క జారి ఇక్కడ ఉన్న కొలనులో పడిందట. ఒకరోజు ఒక వృద్ధ రైతు తన జీవితమ్మీద విసుగు చెంది ఆత్మహత్య చేసుకోవాలని ఈ కొలనులో దూకగా అతడు పరిపూర్ణ యవ్వనస్థుడై పోయాడు. ఆశ్చర్యపోయిన అతడు తన భార్యనూ, ఎద్దులనూ తీసుకొచ్చి అందులో ముంచి వాళ్ళనూ యవ్వనస్థులను చేశాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి చుట్టుపక్కల ప్రజలందరూ ఇక్కడికి వచ్చి కోనేటిలో మునిగి నిత్య యవ్వనస్థులైపోయారు. కొన్నాళ్ళకి ఈ ప్రాంతం నుంచి చాలా కాలంగా ఎవరూ తన లోకానికి రాకపోవడం గమనించిన యముడు విషయం తెలుసుకొని బ్రహ్మతో మొరపెట్టుకోగా ఆయన హరి, హరులని ఆశ్రయించాడు. వారి ఆజ్నతో హనుమంతుడు ఒక పర్వతాన్ని తెచ్చి ఆ కొఅల్ను పైన వేశాడు. కానీ అది అందులో మునగక పుష్పంలాగా పైకి తేలింది. అలా పుష్పగిరి అన్న పేరు వచ్చింది. ఆ పర్వతాన్ని ముంచడానికి ఒక వైపి శివుడు, మరో వైపు విష్ణువు తమ పాదాలతో చెరో వైపు తొక్కి పట్టారు. శివుడి పాదముద్ర శివపాదం అని విష్ణు పాదముద్ర విష్ణుపాదం అనీ ఇక్కడ కనిపిస్తాయంటారు.
 


ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలలో ఇక్కడ పది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. కడప నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి ఆటోలు, బస్సులూ ఉన్నాయి. కారులో పోవడానికి మంచి రోడ్డుంది.


అయితే ఇక్కడి గుడి గోపురాలు వాటి పైన శిల్పాలు నల్లగా మకిలి పట్టి వాటి సౌందర్యాన్ని కప్పివేస్తూంది. దేవాదాయ, పురావస్తు శాఖలు కడప జిల్లాలోని మరొక దేవాలయం ఒంటిమిట్టలో చేసినట్టు కెమికల్ ట్రీట్ మెంటు చేసి ఈ శిల్ప సౌందర్యాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది.

Thursday, October 28, 2010

రాజీవ్ కోటి- ఒక బృహత్తర,మహత్తర కార్యక్రమం

మన టి.సుబ్బు పది కోట్లు ఇస్తానని చెబితే పెద్దాయన రోశయ్య అప్పటికప్పుడు తెలుగు లలిత కళాతోరణం పేరు మార్చిపారేశాడు. ఈ మాత్రం దానికే తెలుగు దేశమోళ్ళు, మీడియా వాళ్ళు, బ్లాగులోళ్ళు గోల గోల చేసి పారేశారు. ఇప్పుడు మరెవరికైనా రాజీవ్ పేరుతో ఇంకేదైనా పని చేసి మేడమ్ ని తృప్తి పరచాలన్న ఆలోచన ఎలా వస్తుంది. ఒక వేళ వచ్చినా దేనికైనా పేరు మార్చలంటే మళ్ళీ ఇంతగోలా అవుతుందన్న భయం ఉండదా. అప్పుడు మేడమ్ కి తృప్తి బదులు చిరాకు వేయదా?
  
కాబట్టి కాంగ్రెసోళ్ళూ, మీ మేడమ్ గార్ని బాగా తృప్తి పరచాలంటే ఇక్కడ ఒక సూపర్ ప్లానుంది. దాని పేరు రాజీవ్ కోటి. వివరాల కోసం చదవండి. 
 
ఈ పధకం కోసం ఒక కొత్త విభాగం మొదలు పెట్టి ఇందులో పేరు నమోదు చేసుకున్న వారికి అడ్వాన్సుగా కొంత డబ్బూ, రాజీవ్ కోటి పుస్తకాలు, పెన్నులు సరఫరా చేస్తాం. ఆ పుస్తకాలలో శ్రీరామ కోటి పుస్తకాలలాగా కోటి ఖాళీలు ఉంటాయి. ఆ ఖాళీలలో రాజీవ్,రాజీవ్ అని రాయాలి. కోటిసార్లు రాయడం పూర్తి చేశాక ఆ పుస్తకాలను రాజీవ్ కోటి విభాగంలో జమ చేస్తే వారికి ప్రతి కోటికీ మూడో, నాలుగో, అయిదో వేలు బహుమతిగా ఇస్తుంది ప్రభుత్వం. ఒక్కొకరూ ఎన్ని సార్లయినా రాజీవ్ కోటి రాయవచ్చు. నెల నెలా ఆ పుస్తకాలలోడుతో ఢిల్లీ వెళ్ళి మేడమ్ ముందు దింపి చూపిస్తే అప్పుడు ఆమె కళ్ళలో కనిపించే తృప్తీ,ఆనందం మంత్రి పదవికి సోపానాలవుతాయి.
  
ఇందులో కేవలం స్వార్ధమే కాదు. అంతకన్నా ఎక్కువ ప్రయోజనాలున్నాయి. ఫ్రీగా డబ్బులొస్తాయంటే ఇంట్లొ ఖాళీగా ఉన్న వాళ్ళందరూ ఇదే పనిలో ఉంటారు. చదువు రాని వాళ్ళు సైతం రాయడం నేర్చుకొని మరీ ఈ పని చేస్తారు. అందరూ ఇదే పనిలో ఉంటారు కాబట్టి పల్లెలలో కక్షలూ, కొట్లాటలు తగ్గుతాయి. ఇంట్లో అత్తలూ, కోడళ్ళూ చేతుల్లో పెన్నూ, పుస్తకం పట్టుకొని రాసే పనిలో ఉంటారు కాబట్టి అత్త కోడళ్ళ పోట్లాటలుండవు. కొంచెం రాయడం వస్తే డబ్బులొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా తమ పిల్లలని బడి మాన్పించరు. ఇలా సంపూర్ణ అక్షరాస్యతా, నిరుద్యోగ నిర్మూలనా జరిగిపోతాయి.           

ఇంక ఈ పధకంలో వాడే పెన్నులూ, పుస్తకాలూ సరఫరా చేసే కాంట్రాక్టు మన కొడుక్కో, బావమరిదికో ఇప్పిస్తే అది ఇంకో విధంగా కూడా ఉపయోగం. కాబట్టి నాయకులారా ఆలోచించండి.

గమనిక: ఈ పధకమ్మీద నాకెలాంటి పేటెంటూ లేదు. ఎవరయినా వాడేసుకోవచ్చు

Friday, October 22, 2010

జ్యోతిష్యంతో అద్భుతాలు, కాదు, మహాద్భుతాలు సృష్టించడం ఎలా?ఇలా!

ఉపోద్ఘాతం: కొన్ని నెలల క్రితం తెలుగు యోగి శర్మ గారు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్దిన్ లు పుట్టిన తేదీని,సమయాన్ని బట్టి వారి జాతక చక్రాలు తయారు చేసి వారు చంద్రునిపైన కాలు మోపారా లేదా అని నిర్ణయించడానికి ప్రయత్నించారు. నాకు అదంతా బుల్ షిట్ లా అనిపించి అదే విషయాన్ని కామెంటుగా పెట్టాను. ఆయనకి కోపమొచ్చి నీకు బుల్ షిట్ అంటే అంత ఇష్టమా అని ఎద్దేవా చేశారు. సహజంగానే చిన్నప్పుడు పల్లెటూరిలో పెరిగిన్ నాకు బుల్షిట్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలియడంతో జ్యోతిష్యం కన్నా బుల్ షిట్ తో ఎక్కువ లాభాలున్నాయనిపించి అదే ఒక పోస్టు పెట్టాను.
http://hittingontheface.blogspot.com/2010/02/blog-post_27.html
ఆ తరువాత తెలుగు యోగి గారు కొన్ని మంత్రాకు,యంత్రాలు, వాటి సాధన గురించి రాయడం, వాటికి వ్యతిరేకంగా తార, వికటకవి కొన్ని పోస్టులు పెట్టడంతో  నేను ఎప్పుడొ రాసి పోస్టు చేయకుండా ఉన్న ఒక వ్యాసాన్ని ఇప్పుడు పోస్టు చేస్తున్నాను.
 
రాజకీయరంగం: ప్రతి చిన్న ఎన్నికలోనూ ఎంతో మంది పోటీ చేసి విలువైన ధనాన్నీ,కాలాన్ని వృధా చేసుకొంటున్నారు. అలా కాకుండా అభ్యర్ధులందరూ తాము పుట్టిన తేదీని, సమయాన్ని మన శర్మ గారికో లేక అలాంటి శిష్య పరమాణువులకో చూపిస్తే వాళ్ళు అవి చూసి ఎవరు గెలుస్తారో చెప్పేస్తే మిగిలిన వాళ్ళు పోటీలోనుంచి విరమించుకొని ఎంతో డబ్బు, కాలం ఆదా చేసుకోవచ్చు కదా?
 
అలాగే ఎవరు ముఖ్యమంత్రి, లేదా ప్రధాన మంత్రి అయితే రాష్ట్రము, దేశము బాగు పడుతాయో వాళ్ళ జతకాన్ని బట్టి తేల్చేస్తే ఆ కారణ జన్ముడిని గద్దె నెక్కించి అన్ని రాష్ట్రాలనూ, దేశాన్నీ రాకెట్ వేగంతో అభివృద్ధి మార్గంలో పరుగెత్తించి అందరమూ బాగు పడవచ్చు కదా. ఎలాంటి స్కాములూ, చావులూ లేని రామరాజ్యాన్ని మళ్ళీ ఒకసారి ప్రపంచానికి చూపించే భాగ్యాన్ని, బరువునీ భుజాలకెత్తుకోమని శర్మ అండ్ కోకి నా మనవి.


క్రీడారంగం: ఎన్ని సార్లు ఎంత ప్రయత్నించినా ప్రపంచ కప్ క్రికెట్ లో 1983 తరువాత మన దేశం విజయం సాధించలేకపోతోంది. ఈ సారి జట్టులో ప్రాబబుల్స్ అందరి జాతకాలు వీళ్ళచేతికిస్తే కప్పును కొట్టుకొచ్చే మహర్జతకులని డిసైడ్ చేసి అందులో మరీ సూపర్ జాతకచక్రం ఉన్న వాడిని కాప్టెన్ని చేసి పడేస్తే కప్పు మనకి రాకుండా పోతుందా?

ఇదే పద్ధతిలో ఒలింపిక్స్, ఆసియన్, కామన్ వెల్త్ ఇలా అన్ని గేమ్స్ లోనూ మనం కాలరెగరేయవచ్చు.


ముహూర్తాలు: నిన్నకు నిన్న కామన్ వెల్త్ గేమ్స్ లో ఎన్ని స్కాములూ, ఎంత అప్రదిష్ట? దీనికి ముఖ్యకారణం వాటిని మొదలుపెట్టిన ముహూర్తం బాగా లేకపోవడమే. ఇకనుంచి ప్రతి పనికీ, అది ఆటలైనా, ప్రాజెక్టులైనా మన జ్యోతిష్యరత్నాల దగ్గర ముహూర్తం ఫిక్స్ చేయించి బిగిన్ చేస్తే ఏ ఆటంకమూ లేకుండా పనయి పోతుంది.

వ్యక్తిగతం: పెద్ద, చిన్న కంపెనీలూ ఉద్యోగులని చేర్చుకొనే ముందు ఇంటర్వ్యూల లాంటి పిచ్చి మార్గాలు కాకుండా అభ్యర్దుల జాతకాలు చూసి, వారికి కష్టపడే గుణం ఉందా లేదా, వాళ్ళని తీసుకొంటే కంపెనీ పైకొస్తుందా లేదా అన్న విషయాలు పరిశీలించి వాళ్ళకి ఉద్యోగాలివ్వడం మొదలు పెడితే అన్ని కంపెనీలూ ఫోర్బ్స్ లిస్టులో స్థానం కోసం తన్నుకు చావడం ఖాయం కదా? 

బ్లాగరులు: ఏ టైమ్ లో పోస్టు పెడితే ఎక్కువ హిట్లూ, కామెంట్లు వస్తాయో, ఎక్కువ సంచలనం అవుతుందో కూడా ముహూర్తాన్ని బట్టి డిసైడ్ చేసి పారేయవచ్చు. ఈ లెఖ్ఖన ప్రతి అడ్డమైన పోస్టూ దాన్ని పోస్టు చేసిన కాలం యొక్క బలమూ, ప్రభావము వల్ల ఆటం బాంబులాగా పేలి బ్లాగ్ స్పాట్ నీ, కూడలి,హారము, జాలము, మాలిక లాంటి అగ్రెగేటర్లనీ పేల్చిపారేయడం ఖాయం.

Tuesday, October 19, 2010

టైటిల్ కోసం గొడవ పడ్డ ఏ సినిమా బతికి బట్టకట్టలేదు

ఖలేజా సినిమా టైటిల్ గొడవ సద్దుమణగక ముందే మరొక టైటిల్ వివాదం మొదలైంది. మహేష్ బాబు తన సినిమా టైటిల్ ఖలేజా అని ప్రకటించగానే ఒక చిన్న నిర్మాత ఆ టైటిల్ తనదనీ, తాను దాన్ని అంతకు ముందే రిజిస్టర్ చేసుకున్నాననీ తెర మీదికొచ్చాడు. దాంతో మహేష్ సినిమాకి మహేష్ ఖలేజా అని పేరు మార్చేశారు. ఆ చిన్న  నిర్మాత దీని మీద కోర్టుకెళ్లడం కోర్టు ఆ కేసు కొట్టి వేయడం తెలిసిందే. 


ఈ గొడవంతా చూసి సినిమాకి ఖలేజా అన్న పేరు చాలా ముఖ్యమేమో అనుకొని సినిమా చూస్తే అసలు ఖలేజా అన్న పేరుకీ సినిమాకి సంబంధం లేనేలేదు. సరే కావాలనుకున్న పేరు పెట్టుకున్నా సినిమా ఫ్లాప్ అయ్యింది వేరే సంగతి. 


ఇప్పుడు అదే రీతిలో కత్తి అన్న టైటిల్ పైన గొడవ జరుగుతోంది. కత్తి అన్న పేరుతో రవితేజ హీరోగా గుణశేఖర్ ఒక సినిమాని, అదే పేరుతో కళ్యాణరామ్ ఒక సినిమాని అనౌన్స్ చేశారు. ఇద్దరూ ఎవరికి వారు తమ సినిమాకి కత్తి టైటిల్ చాలా కీలకం అని చెప్తున్నారు. కళ్యాణరామ్ ఖలేజ దారిలో వెళ్ళి తన సినిమాకి  కళ్యాణరామ్ కత్తి అని టైటిల్ ఫిక్స్ చేశాడు.
 
టైటిల్ గొడవ విషయానికొస్తే చాలా కాలం క్రితం సామ్రాట్ అన్న టైటిల్ విషయంలో జరిగిన గొడవ గుర్తుకొస్తూంది.


మహేష్ బాబుకి రమేష్ అని ఒక అన్న ఉండేవాడు. కృష్ణ గారి పెద్ద కోడుకన్నమాట. అతన్ని హీరోగా పరిచయం చేయడానికి ఒక సినిమా తీస్తూ దానికి సామ్రాట్ అన్న పేరు ఫిక్స్ చేశారు. అదే పేరుతో బాలకృష్ణ మరొక సినిమా అనౌన్స్ చేశాడు. పెద్ద గొడవ జరిగాక బాలకృష్ణ సినిమాని సాహస సామ్రాట్ గా మార్చారు. కొసమెరుపేమిటంటే రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.
 
కాబట్టి కథలో బలం, సినిమాలో దమ్ము ఉంటే టైటిల్ ఏదయినా సినిమా ఆడుతూంది. ఉదాహరణకి రజనీ కాంత్ తాజా సినిమా తెలుగు, హిందీలలో రోబో, తమిళంలో ఎంతిరన్. కానీ రిజల్టు మాత్రం ఒకటే-సూపర్ హిట్. అంచేత టైటిల్ కోసం గొడవ పడే బదులు ఆ సమయాన్ని, శక్తినీ కథా కథనాల మీద పెట్టండి బ్రదర్స్.

రక్త చరిత్ర కాదిది చెత్త చరిత్ర, నీచ నికృష్ట చరిత్ర

మరో రెండు మూడ్రోజుల్లో రాంగోపాల వర్మ వివాదాస్పద సినిమా రక్త చరిత్ర విడుదల కానుంది. సగటు సినీ ప్రేక్షకుడు, సినీ ప్రేమికుడు ఆ సినిమా కోసం అంత నోరు తెరుచుకొని ఎదురు చూడకపోయినా మీడియా మాత్రం ఆ సినిమాకి చాలాఎక్కువ హైపూ, వర్మలో కైపూ నింపి మొత్తమ్మీద ఆ సినిమాని most eagerly awaited movie కింద చేసి పారేశారు.
నేను మాత్రం ఆ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా, ఎప్పుడెప్పుడు ఫ్లాపవుతుందా అని వేచి చూస్తున్నాను. నాకు వర్మ మీద కోపం కానీ ద్వేషం కానీ ఏమీ లేవు. నాకున్న కోపమల్లా ఆ సినిమా సబ్జెక్టు మీద ఆ కాన్సెప్టు మీదా. అంతే.

సినిమాలలో వయెలెన్సు కొత్త కాదు. కొన్ని సినిమాలలొ హింసని ప్రేక్షకుడు సమర్ధిస్తాడు. ఆ హింసని జస్టిఫై చేసేలాగా దర్శకుడు కథని అల్లుకొంటూ వస్తే అప్పుడు హింస ఏహ్యభావం పుట్టించదు.
నాయకుడు సినిమాలో వీరయ్య దుర్మార్గుడైన పోలీసుని సమ్మెటతో తలమీద మోది చంపితే వాడికి ఆ శాస్తి జరగాల్సిందే అనుకోంటాడు ప్రేక్షకుడు. తన భార్యని చంపిన వాళ్ళని తన మనుషులతో వేటాడి చంపితే అప్పుడూ అలా జరగాల్సిందే అనిపిస్తుంది.
స్పార్టకస్ సినిమాలో కానీ, ఒమర్ ముక్తర్ లో కానీ, పేట్రియాట్, 300, ఇలా అనేక సినిమాలలో హింసని ప్రేక్షకుడు అసహ్యించుకోడు. ఆ సన్నివేశాలలో ఆ హింసకి జస్టిఫికేషన్ ఉంటుంది.

కానీ రక్త చరిత్రలో పాత్రదారులందరూ చరిత్ర హీనులే. వాళ్ళు హింసకి పాల్పడేది ఏదో ఆశయ సాధనకోసం కాదు. తరతరాలుగా వస్తున్న తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి, తమ ఆస్తులూ, బలగం పెంచుకోవడానికి, ఉన్న పదవులు కాపాడుకోవడానికి లేదా పదవులు సంపయించడానికీ.

కొంపతీసి ఈ సినిమా హిట్టయితే బాలక్రిష్ణ సినిమా సమర సింహా రెడ్డి హిట్టయ్యాక తెలుగు ఇండస్ట్రీలో ఏం జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది. ఆ ఒక్క సినిమా హిట్ తో ఆది కేశవ రెడ్డి, చెన్న కేశవ రెడ్డి, భరత సింహా రెడ్డి, ఇంద్ర సేనా రెడ్డి ఇలా కుప్పలు తెప్పలుగా ఫాక్షన్ హీరోలు పుట్టుకొచ్చారు.
ఇప్పుడు రక్త చరిత్ర కానీ హిట్టయితే రాష్ట్రంలో ఇంకా అనేకానేక కుటుంబ కక్షల మీద సినిమాలు తయారవుతాయి. ఈ రాష్ట్రంలో ఈ కథలకు తక్కువేమీ లేదు. విజయవాడ రౌడీల మీద వర్మ తనే ఒక సినిమా తీస్తున్నాడు. కర్నూలు, కడప, అనంతపురం ఇలా ఒక్కో చోట ఉన్న ఒక్కో నిచ నికృష్ట కథనీ మన వాళ్ళు తెరకెక్కించి చంపుకు తింటారు.
కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ, సినిమా ప్రేక్షకుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రక్త హీన చరిత్ర ఎత్తి పోవాలని నా కోర్కె.


Monday, October 18, 2010

(సంగీత) దర్శకుల్లారా, మీ గాయని గాయకులకి ’శ’కీ,’ష’కీ తేడా చెప్పండి.

తెలుగులో శ,స,ష అని మూడురకాల శబ్ధాలు ఉన్నాయి. తెలుగు పాటలు ఇంగ్లీషులో రాసుకుని పాడేవాళ్ళకీ, ఇంగ్లీషు మీడియంలోనే చదువుకున్న వాళ్ళకీ ఈ మూడు శబ్ధాలకి మధ్య ఉన్న తేడా తెలియక పోవడం వల్ల శాంతి షాంతి అయిపోయి బాషకి ప్రాధాన్యతనిచ్చే వాళ్ళకి కొంచెం కర్ణ కఠోరం అనిపిస్తుంది.
ఈ మధ్య వచ్చిన కొమరం పులి సినిమాలో మహమ్మహ మాయే అని ఒక పాట ఉంది. అందులో "షషి ముఖే, షషి ముఖే" అని పాడుతాడు గాయకుడు ఒక చోట. శశి ముఖి కి వచ్చిన తిప్పలు అవి. ఆ పాట పాడిన జావేద్ ఆలీకి కానీ కంపోజ్ చేసిన రెహ్మాన్ కి కానీ తెలుగు రాకపోవడం వలన వచ్చిన తిప్పలవి. కానీ పాట రాసిన చంద్రబోస్ అయినా రికార్డింగ్ సమయంలో ఉండి ఉంటే ఆ శబ్ధాన్ని మార్చి ఉండే వాడు.
వర్ధమాన గాయకులతో టీవీలో వచ్చే ఒక కార్యక్రమంలో ఇప్పుడు చాలామందికి తెలుగులో అని ఒక శబ్ధం ఉన్నదని తెలీదని ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారు వాపోయారు. కాబట్టి దర్శకులు కానీ సంగీత దర్శకులు కానీ, వీళ్ళిద్దరూ తెలుగు తెలియని వారైతే పాటలు రాసిన రచయితలు కానీ కొంచెం శ్రద్ధ తీసుకొని శబ్ధాన్ని గాయకుల చేత పాడించకపోతే చిరకాలంలోనే శబ్ధం మాయమయిపోయే ప్రమాదం ఉంది.

వైఎస్సార్ ని ఫూల్ ని చేయకండి

ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఈ లెక్కన ఇంకో సంవత్సరానికి అంటే ఓదార్పు యాత్ర ఒక ముగింపుకి వస్తే, ఒకవేళ వస్తే, వస్తుందని కాదు, వైఎస్ విగ్రహం లేని వీధి ఈ రాష్ట్రంలో ఉండక పోవచ్చు.
ఈ సందర్భంగా ఈ బొమ్మల కొలువు ఏర్పాటుదారులకు ఇంగ్లీషులోని ఒక సామెత గుర్తు చేద్దామనుకొంటున్నాను. A fool is seen everywhere. ఈ సామెతని దివంగత నేత, సాక్షి ప్రకారమైతే, దివంగత మహానేత విషయంలో నిజం చేయాలని కంకణం కట్టుకున్నట్టు మీరు ప్రవర్తించకండి. ఆయన అత్మకు కొంచెమైనా శాంతి మిగిల్చండి.

Tuesday, October 12, 2010

మరీ ఇంత సంకుచిత దృష్టితో చూస్తే ఎలా తెలంగాణా బ్రదరూ?

ఇందాక టివీ పైవో, ఏబీఎన్నో ఏదో చానల్లో ప్రపంచ విప్లవ స్ఫూర్తికే అవమానం అని ఒక స్టోరీ వస్తుంటే ఏమిటా అంత విపత్తు అని భోజనం కూడా మానేసి నోరెళ్ళబెట్టి చూడసాగాను. శ్రీకాంత్ ని చే గువేరా పోజులో చూపిస్తూ పిచ్చి,సారీ,పోసాని కృష్ణ మురళి తీయబోతున్న దుశ్శాసన సినిమా ప్రపంచ విప్లవాలన్నింటినీ ఎలా కాలరాయబోతోందో చూపిస్తున్నారు ఆ చానల్లో.
సరే, మనవంతుగా ప్రపంచ విప్లవ స్ఫూర్తిని బతికించాలని చానల్ మార్చకుండా నా విప్లవ స్ఫూర్తిని చాటుకున్నాను.

ఇంతలో అన్ని విప్లవాలకూ జీవ నాడి అయిన ఉస్మానియా జే ఏ సీ నాయకుడినొకడిని లైవ్ లోకి లాక్కొచ్చారు. సదరు విప్లవ జ్యోతి పెరు కైలాష్. సరే యాంకరు విషయం చెప్పి ఆయన అమూల్యమైన అభిప్రాయాన్ని కోరాడు.
అంతే మనోడు రెచ్చి పోయాడు. ఈ సీమాంధ్ర సినిమా వాళ్ళింతే. ప్రపంచ విప్లవ స్ఫూర్తిని కాల రాసి పారేస్తారు అన్న లెవెల్లో దంచి పారేశాడు.
"ఒరేయ్ సన్నాసీ! ప్రపంచ అంటేనే ఒక విశాల భావం. అందులో మళ్ళీ ఈ తెలంగాణా, ఆంధ్రా,రాయలసీమ ఫీలింగ్ ఎందుకురా" అని అడగాలనిపించింది. కానీ ఆ షోలో ఆడియన్స్ ఫోన్ చేసి మాట్లాడే ఫెసిలిటీ లేదు కాబట్టి ఈ పూటకి నేను సైతం ప్రపంచ విప్లవాగ్నికి ఇచ్చిన సమిధలు చాలని చానల్ మార్చేశాను.
రేపెవడైనా తలకు మాసిన సన్నాసి కెసీఆర్ ని "తెలంగాణా చే" అని సినిమా తీస్తే అది ప్రపంచ విప్లవాగ్నిని బతికించినట్లైతదేమో ఈళ్ళకి.

అంచనాలేమీ లేకుండా చూస్తే ఖలేజా ఓకే!

బ్లాగు మిత్రులు ఎంతమంది హెచ్చరించినా వారి మాటలు లెక్క చేయకుండా ఆదివారం ఖలేజా సినిమా చూశాను. అప్పటికే ఆ సినిమాపైన నెగటివ్ ఒపీనియన్ తోనే సినిమా చూశాను కాబట్టి నాకు ఆ సినిమా అంత చెడ్డగా ఏమీ అనిపించలేదు.
ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో నడిపించాడు త్రివిక్రమ్. క్లైమాక్స్ తేలిపోయినా ఇటీవలి తెలుగు సినిమాలలో ఇది మామూలే కాబట్టి వదిలేయవచ్చు. అస్సలు తన సినిమాలలో ఎప్పుడూ ఒక పదమో లేక సగం సగం వాక్యాలు తప్ప అంతకన్నా పొడవాటి డైలాగులు చెప్పని మహేష్ ఇందులో కొంచెం టాకెటివ్ పాత్రలో వెరైటీగా అనిపిస్తాడు. మహేష్ అనుష్క ఇద్దరూ విడివిడిగా గ్లామరస్ గా అనిపించినా ఇద్దరూ కలిసి ఉన్న సీన్లలో వారి మధ్య కెమిస్ట్రీ తెరని తగలబెట్టలేకపోయింది (could not set the silver screen on fire).
ఇక కామెడీకొస్తే అధిక భాగం కామెడీ మహేషే చేశాడు. కాన్సెప్టు కొంచెం కొత్తగా ఉంది. క్లైమాక్సే పేలవంగా ఉంది. లక్ష కోట్ల ప్రాజెక్టు చేజారి పోకుండా ఒక గ్రామం మీద దాడి చేసిన డబ్బూ, అధికారం పుష్కలంగా ఉన్న ఒక విలన్ తీసుకొచ్చిన రౌడీలను హీరో ఒంటి చేత్తో మట్టి కరిపించడం రొటీన్ తెలుగు సినిమాలలో చాలా సార్లు చూశాం కాబట్టి సగటు తెలుగు ప్రేక్షకుడికి అందులో ఆశ్చర్యం కనిపించదు.
రెండు పాటలు మినహా మిగిలినవన్నీ హాలులోపలే మర్చిపోవలసినవే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. అయితే ఫస్ట్ హాఫ్ అధిక భాగం రాజస్థాన్ లో షూట్ చేయడానికి కంపెల్లింగ్ కారణం కనిపించదు. మన పక్కనున్న ఏ మహరాష్ట్రలోనో, కర్ణాటక, తమిళనాడులోనో తీసిఉన్నా పెద్దగా తేడా ఉండేది కాదు. పైపెచ్చు ప్రొడ్యూసర్ జేబుకి పడ్డ బొక్క కూడా కొంచెం తగ్గి ఉండేది.
కాబట్టి, మీరు సినిమా మీద ఎలాంటి ఎక్స్ పెక్టేషన్లు లేకుండా చూడండి. అప్పుడే మీకు నచ్చుతుంది.

కుప్పలు తెప్పలుగా వస్తున్నారు జఫ్ఫా డాక్టర్లు జాగ్రత్త

ఉదయం టీవీలొ ఒక చానల్లో జఫ్ఫా డాక్టర్ అని న్యూస్ స్టోరీ వస్తుంటే ఏమిటా అని చూశాను. విశాఖపట్నంలొ సిజేరియన్ ఆపరేషన్ చేస్తూ శిశువు చెవి కట్ చేసి మరణానికి కారణమైన డాక్టర్ గురించిన స్టోరీ అది. మరీ ఒన్ సైడెడ్ కాకుండా కొంచెం బాలన్సుడుగా ఉంది కథనం. సరే, ఎంత పెద్ద పోటుగాడైనా అప్పుడప్పుడూ నూటికో కోటికో ఒక పొరపాటు జరగక మానదు. మనం మనుషులమే కానీ రోబో సినిమాలో చిట్టిలం కాదు కదా.
నూటికో కోటికో ఒక పొరపాటైతే ఓకే, ప్రతి రెండు మూడు కేసులకీ ఒక పొరపాటైతే ఎలా. ఇప్పుడు దేశమంతా కుప్పలు తెప్పలుగా వెలిసిన ప్రైవేటు మెడికల్ కాలేజీలు తయారు చేస్తున్న డాక్టర్ల స్టాండర్డ్స్ కొంచెం దగ్గరనుంచి చూస్తే భయం వేస్తుంది.

అస్సలు పేషంట్లని తాకుండా, చూడకుండా డాక్టరీ పట్టా పుచ్చుకొనే డాక్టర్ల సంఖ్య పెరిగి పోతూంది. అన్యాయమేమిటంటే ఇలాంటి కాలేజీలకి పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు కూడా మంజూరు కావడం. ఒక ఆపరేషన్ కూడా చేయకుండా పట్టా పుచ్చుకొని వీళ్ళు బయటకి వచ్చేస్తారు. నాన్నో మామో అప్పటికే నడుపుతున్న హాస్పిటల్లో కూర్చుని వచ్చిన పేషంట్లపైన తమ విద్యకి పదును పెట్టుకొంటారు.
మంచి షోకులున్న హాస్పిటల్ డాక్టరుగారి పేరు చివర్న ఉన్న ABC..XYZ..London..France..Glasgow డిగ్రీల తోకలు చూసి అమాయకంగా పేషంట్లు వస్తారు. మన డాక్టరుగారికి విద్య నేర్పిస్తారు.

దీన్లో ఏమీ అతిశయోక్తి లేదు. మా ఊరిలో కొత్తగా వచ్చి ప్రాక్టీసు పెట్టిన ఒక ఎముకల డాక్టరు గురించి అదే ఊళ్ళో ఉన్న నా కజిన్ చెప్పిందే ఇది. మైసూరులో నలభై అయిదేళ్ళ చరిత్ర కలిగిన ఒక కాలేజీలో పదేళ్ళ క్రితం ముప్పై లక్షలు కట్టి పీజీ చేసిన ఆ డాక్టరు తన మూడేళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగులో స్వంతంగా ఒక్క ఆపరేషన్ కూడా చేయలేదని స్వయంగా చెప్పాడని మావాడు నాతొ చెప్పాడు.
అంత చరిత్ర కల కాలేజీలే అలా ఉంటె నిన్న మొన్న మొదలు పెట్టిన కాలేజీలు, వాటిలో శిక్షణ పొంది రేపో మాపో బయటికి వచ్చి ప్రజల పాణాలతో ఆడుకోబోయే డాక్టర్ల మాటేమిటి? వారితో చికిత్స చేయించుకోబోయే పేషంట్ల గతేమిటి?

వీధికో జఫ్ఫా డాక్టర్, టీవీ చాన్నళ్ళకి గంటకో న్యూస్ స్టోరీ!

Sunday, October 10, 2010

శంకర్! రోబో సినిమాలో ఇలా ఒక సీన్ తగిలించు

ఈమధ్య విడుదలై విజయవంతంగా నడుస్తున్న రోబో సినిమాని చిన్న వివాదం చుట్టుముట్టింది. అదే వర్మ అయితే అసలు దాన్ని వివాదం అనడానిక్కూడా ఇష్టపడేవాడు కాదేమో. వర్మకి అది చాలా చిన్నది. కాని శంకర్ సినిమాలకి వివాదాలు కొత్త. అదీ కాక వర్మ సినిమాని వివాదం తగులుకొని దాన్ని అందరూ తెలుసుకొనేలోగా సినిమా హాల్స్ లోంచి అదృశ్యమై పోతుంది. అందుకని వర్మ సినిమా రిలీజ్ కన్నా, ఇంకా వీలయితే షూటింగ్ మొదలుపెట్టకముందే వివాదాలు తలెత్తేలా జాగ్రత్త పడతాడు.తెలివిగా.
కానీ రోబో సినిమా ఇప్పుడిప్పుడే పోయేలాగా లేదు కాబట్టి ఈ వివాదాన్ని చల్లార్చాలంటే శంకర్ కి ఒక ఐడియా ఇక్కడ.

అసలు వివాదమేమిటంటే ఒక సీన్ లో ఐశ్వర్యా రాయ్ ఒక కల్లు గీత కార్మికుడిని నువ్వే నా బాయ్ ఫ్రెండ్ అంటుంది రజినీ కాంత్ ని ఉడుకించాలని. అప్పుడు సదరు గీతగాడు తనని తను అసహ్యంగా వర్ణించుకొంటాడు. అదే సీన్లో వాడు ఇచ్చిన కల్లునీ చేపలకూరని ఐష్ చీ..చీ..థూ..థూ..అంటుంది. దీనితో గౌడ వృత్తికి అవమానం జరిగిందని కొందరి గొడవ.
ఈ సీన్ ని మళ్ళీ ఈ విధంగా షూట్ చేసి అతికించవచ్చు.

తాటిచెట్టు దగ్గరికి సర్రున ఒక మెర్సిడెస్ బెంజ్ కారు వచ్చి ఆగుతుంది. అందులోంచి ఆర్మని సూట్, కాళ్ళకి లీకూపర్ షూస్, కళ్ళకి రేబాన్ గ్లాసులూ, చేతికి రోలెక్స్ వాచీ ధరించి ఒక చేత్తో కల్లు కుండ పట్టుకొని మన గీత కార్మికుడు దిగుతాడు. ఐషు అతడి దగ్గరికి వెళ్ళి ఈరోజు నువ్వే నా బాయ్ ఫ్రెండ్ అనగానే, స్టైలుగా ఇంగ్లీషులో,"హేయ్ బేబే,కమాన్, లెటజ్ రాక్" అంటాడు. కారులోని హాట్ బాక్స్ తెరిచి హాట్ హాట్ పిజ్జా, కోక్ ఆఫర్ చేస్తాడు.

ఇలా చేస్తే ఇప్పుడు గొడవ చేసే వాళ్ళంతా సైలెంటయిపోతారు.