ఈమధ్య విడుదలై విజయవంతంగా నడుస్తున్న రోబో సినిమాని చిన్న వివాదం చుట్టుముట్టింది. అదే వర్మ అయితే అసలు దాన్ని వివాదం అనడానిక్కూడా ఇష్టపడేవాడు కాదేమో. వర్మకి అది చాలా చిన్నది. కాని శంకర్ సినిమాలకి వివాదాలు కొత్త. అదీ కాక వర్మ సినిమాని వివాదం తగులుకొని దాన్ని అందరూ తెలుసుకొనేలోగా సినిమా హాల్స్ లోంచి అదృశ్యమై పోతుంది. అందుకని వర్మ సినిమా రిలీజ్ కన్నా, ఇంకా వీలయితే షూటింగ్ మొదలుపెట్టకముందే వివాదాలు తలెత్తేలా జాగ్రత్త పడతాడు.తెలివిగా.
కానీ రోబో సినిమా ఇప్పుడిప్పుడే పోయేలాగా లేదు కాబట్టి ఈ వివాదాన్ని చల్లార్చాలంటే శంకర్ కి ఒక ఐడియా ఇక్కడ.
అసలు వివాదమేమిటంటే ఒక సీన్ లో ఐశ్వర్యా రాయ్ ఒక కల్లు గీత కార్మికుడిని నువ్వే నా బాయ్ ఫ్రెండ్ అంటుంది రజినీ కాంత్ ని ఉడుకించాలని. అప్పుడు సదరు గీతగాడు తనని తను అసహ్యంగా వర్ణించుకొంటాడు. అదే సీన్లో వాడు ఇచ్చిన కల్లునీ చేపలకూరని ఐష్ చీ..చీ..థూ..థూ..అంటుంది. దీనితో గౌడ వృత్తికి అవమానం జరిగిందని కొందరి గొడవ.
ఈ సీన్ ని మళ్ళీ ఈ విధంగా షూట్ చేసి అతికించవచ్చు.
తాటిచెట్టు దగ్గరికి సర్రున ఒక మెర్సిడెస్ బెంజ్ కారు వచ్చి ఆగుతుంది. అందులోంచి ఆర్మని సూట్, కాళ్ళకి లీకూపర్ షూస్, కళ్ళకి రేబాన్ గ్లాసులూ, చేతికి రోలెక్స్ వాచీ ధరించి ఒక చేత్తో కల్లు కుండ పట్టుకొని మన గీత కార్మికుడు దిగుతాడు. ఐషు అతడి దగ్గరికి వెళ్ళి ఈరోజు నువ్వే నా బాయ్ ఫ్రెండ్ అనగానే, స్టైలుగా ఇంగ్లీషులో,"హేయ్ బేబే,కమాన్, లెటజ్ రాక్" అంటాడు. కారులోని హాట్ బాక్స్ తెరిచి హాట్ హాట్ పిజ్జా, కోక్ ఆఫర్ చేస్తాడు.
ఇలా చేస్తే ఇప్పుడు గొడవ చేసే వాళ్ళంతా సైలెంటయిపోతారు.
6 comments:
మీ ఐడియా బాగుంది. కానీ ఒక్క విషయం మీరు
>>>>>అదే సీన్లో వాడు ఇచ్చిన కల్లునీ
అన్నారు. ఇక్క మీరు "వాడు" అని అవమానించారు. ఇదో వివాదమవుతుంది. చూడండి.
Yes.My mistake.
chaala baaga chepparandi
Thank you.
>>ఒక మెర్సిడెస్ బెంజ్ కారు
అన్నారు, తుప్పు పట్టిన కారుని చూపించారు
ఇది కూడా వివాదమే
శంకర్ ఏ బీఎండబ్ల్యూనో, మెర్సిడెస్సో చూపిస్తాడు లెండి.
Post a Comment