నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, October 12, 2010

మరీ ఇంత సంకుచిత దృష్టితో చూస్తే ఎలా తెలంగాణా బ్రదరూ?

ఇందాక టివీ పైవో, ఏబీఎన్నో ఏదో చానల్లో ప్రపంచ విప్లవ స్ఫూర్తికే అవమానం అని ఒక స్టోరీ వస్తుంటే ఏమిటా అంత విపత్తు అని భోజనం కూడా మానేసి నోరెళ్ళబెట్టి చూడసాగాను. శ్రీకాంత్ ని చే గువేరా పోజులో చూపిస్తూ పిచ్చి,సారీ,పోసాని కృష్ణ మురళి తీయబోతున్న దుశ్శాసన సినిమా ప్రపంచ విప్లవాలన్నింటినీ ఎలా కాలరాయబోతోందో చూపిస్తున్నారు ఆ చానల్లో.
సరే, మనవంతుగా ప్రపంచ విప్లవ స్ఫూర్తిని బతికించాలని చానల్ మార్చకుండా నా విప్లవ స్ఫూర్తిని చాటుకున్నాను.

ఇంతలో అన్ని విప్లవాలకూ జీవ నాడి అయిన ఉస్మానియా జే ఏ సీ నాయకుడినొకడిని లైవ్ లోకి లాక్కొచ్చారు. సదరు విప్లవ జ్యోతి పెరు కైలాష్. సరే యాంకరు విషయం చెప్పి ఆయన అమూల్యమైన అభిప్రాయాన్ని కోరాడు.
అంతే మనోడు రెచ్చి పోయాడు. ఈ సీమాంధ్ర సినిమా వాళ్ళింతే. ప్రపంచ విప్లవ స్ఫూర్తిని కాల రాసి పారేస్తారు అన్న లెవెల్లో దంచి పారేశాడు.
"ఒరేయ్ సన్నాసీ! ప్రపంచ అంటేనే ఒక విశాల భావం. అందులో మళ్ళీ ఈ తెలంగాణా, ఆంధ్రా,రాయలసీమ ఫీలింగ్ ఎందుకురా" అని అడగాలనిపించింది. కానీ ఆ షోలో ఆడియన్స్ ఫోన్ చేసి మాట్లాడే ఫెసిలిటీ లేదు కాబట్టి ఈ పూటకి నేను సైతం ప్రపంచ విప్లవాగ్నికి ఇచ్చిన సమిధలు చాలని చానల్ మార్చేశాను.
రేపెవడైనా తలకు మాసిన సన్నాసి కెసీఆర్ ని "తెలంగాణా చే" అని సినిమా తీస్తే అది ప్రపంచ విప్లవాగ్నిని బతికించినట్లైతదేమో ఈళ్ళకి.

13 comments:

ramana said...

లాభం లేదు బ్రదర్ వీళ్ళకి ముదిరింది అంతే, అమావాస్య పౌర్ణమి అంటారు కదా మనం ఎంత ప్రయత్నించిన ఓ పట్టాన అర్ధం కాదు. కాబట్టి పొతే పోనీ పోరా అనుకుని మన ప్రయత్నం మనం చేద్దాం ఈ మేధావి వర్గానికి కాక పోయినా కనీసం కొంత మన్ది సామాన్యుల కైనా అర్ధం కాకుండా పోతుందా ? .

Anonymous said...

సెజ్ లు, అసైండ్ భూములు, అక్రమ కమబద్ధీకరణలు, మైనింగ్ మాఫియాలు, నీళ్ళు దోచింది చాలు, ఇక దయచేయండి, చాలా చెప్పారుగాని. చంద్రుని మీద భూములు దోచుకునే ప్రయత్నాలు చేసుకోండి.

ఓబుల్ రెడ్డి said...

తెలుగిల్లు బ్లాగులో ఇదే విషయమై నేను వ్రాసిన వ్యాఖ్య :

"అసలు సినిమా చూడకుండానే ఆ ఇతివృత్తం ఏంటో తెలియకుండానే పోసానిని ఆడిపోసుకోవడం సమంజసం కాదు. పోసాని తీస్తున్నది ఇదివరకటి మాదిరే హాస్యచిత్రం కావచ్చు. కాదేదీ హాస్యానికనర్హం. మనవాళ్ళు హాస్యసినిమాలలో సాక్షాత్తు పూజనీయమైన పురాణపాత్రల్నే పెట్టి తీయలేదూ ? అలాంటిదే కావచ్చు ఇది కూడా ! ఇలాంటివి అప్రీషియేట్ చేయడానికి కూసింత హాస్యస్ఫూర్తి ఉండాలి. సైద్ధాంతిక భావజాలాల పిచ్చి ఉపకరించదు."

chanukya said...

మౌడ్యం ముదిరినవాళ్ళతో డిస్కషన్ అనవసరము

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

బాబూ ఎనోనిమస్సూ, అదేదో ఆవు మీద వ్యాసం రాసినట్టు ప్రతి దానికీ దోచుకోవడం, దోపిడీకి గురికావడమేనా.ఇక్కడి విషయం చూసి ఏదైన చెప్పేదుంటే చెప్పు. నేను తెలంగాణాకి వ్యతిరేకమని నీకు చెప్పానా? నాకు సెజ్ లూ,భూములూ ఉన్నాయని నీకు తెలుసు. వాడేవడో ఒకడో,ఇద్దరో లేక వందలో వేల మందో సీమాంధ్ర వాళ్ళు తెలంగాణా భూముల్ని దోచుకొంటే అక్కడినుండి వచ్చి ఇక్కడున్న వాళ్ళందరూ దోపిడీ గాళ్ళేనా? మీ తెలంగాణా పోరాట యోధులు మిమ్మల్ని దోచుకోవడం లేదా?

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Typo: నాకు సెజ్ లూ,భూములూ ఉన్నాయని నీకు తెలుసా?

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

బాబూ ఎనోనిమస్సూ, అదేదో ఆవు మీద వ్యాసం రాసినట్టు ప్రతి దానికీ దోచుకోవడం, దోపిడీకి గురికావడమేనా.ఇక్కడి విషయం చూసి ఏదైన చెప్పేదుంటే చెప్పు. నేను తెలంగాణాకి వ్యతిరేకమని నీకు చెప్పానా? నాకు సెజ్ లూ,భూములూ ఉన్నాయని నీకు తెలుసా?. వాడేవడో ఒకడో,ఇద్దరో లేక వందలో వేల మందో సీమాంధ్ర వాళ్ళు తెలంగాణా భూముల్ని దోచుకొంటే అక్కడినుండి వచ్చి ఇక్కడున్న వాళ్ళందరూ దోపిడీ గాళ్ళేనా? మీ తెలంగాణా పోరాట యోధులు మిమ్మల్ని దోచుకోవడం లేదా

Anonymous said...

4ఏళ్ళలో 4,000,000,000 పైన మీ ప్రాంతమాయన దోచిండని మీ చంద్రబాబే చెప్పిండుగదసార్, ఇంకా దోస్తరా? మావాల్లకి ఏమీ మిగలబెట్టరా అని నాయం అడుగుతుండా గంతనే. నీ బాంచన్ కాల్మొక్తా, గుస్సా అవ్వద్దు పటేలా.

Anonymous said...

గురువుగారూ,
ఇదివరకెప్పుడైనా నా మూలంగా ఒకవేళ మీకు కోపం గనక వచ్చి వుంటే, మీరు రాసిన ఒక మంచి వ్యాసాన్ని మనస్పూర్తిగా అభినందించి అదికాస్తా చెరిపేసుకుందామని చాలా రోజులనుంచీ ఎదురుచూస్తున్నాను. ఇన్నాళ్ళకి ఒక మంచి అవకాశం ఇచ్చారు. మంచి విషయాన్ని క్లుప్తంగా, మొఖం మీద కొట్టినట్టు చెప్పారు. Very good, keep it up ..
Srik

REDDY said...
This comment has been removed by the author.
REDDY said...

Telangana anonymous, I can understand your heart burn.We are right in expressing our anger against these exploiters. But this is a post about the narrow mindedness of some of our leaders who bring the "we against them" issue for anything and everything.

REDDY said...

Even if telengana comes the exploitation won't stop. Only the exploiters will change.

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Reddy garu, you are right.Telengana is not a panacea for all the problems. As you rightly said only the exploiters will change. But the exploiting won't.