మొత్తానికి విజయవంతంగా కామన్ వెల్త్ గేమ్స్ ప్రారంభం కాబోతున్నాయి. సురేష్ కల్మాడీని, కాంట్రాక్టర్ల అవినీతినీ,నాసిరకం నిర్మాణాలనీ, కొందరు క్రీడాకారుల డోపింగ్ వివాదాన్నీ తట్టుకొని మొత్తానికి ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతున్నాయి.
క్రీడల ప్రారంభానికి ముందు ఎన్ని వివాదాలున్నా ఒకసారి క్రీడలు మొదలయితే అందరి దృష్టి క్రీడల మీదే ఉండాలి. ఇతర విషయాలు, వివాదాలు మరుగున పడాలి. ఆటగాళ్ళ మీదే ప్రపంచం దృష్టి పెట్టాలి కానీ కల్మాడీ అవినీతి మీదో, కూలిపోతున్న నిర్మాణాల మీదో పడకుండా నిర్వాహకులు జాగ్రత్త పడాలి.
ఈ బ్లాగ్ తరఫున క్రీడలు జరిగినన్నాళ్ళూ ఎక్కడా స్టేడియాలలో పైకప్పు కూలిపోకూడదనీ, బ్రిడ్జిలు పడిపోకూడదనీ, క్రీడకారులు పడుకొనే మంచాలు విరిగి వారు ఆసుపత్రి పాలు కాకూడదనీ,గేమ్స్ విలేజీలలోకి పామూ పుట్రా ప్రవేశించకుండా ఉండాలనీ, క్రీడాకారులు, ముఖ్యంగా ఆతిధ్య దేశమైన మన క్రీడాకారులు డోపింగ్ కి పాల్పడకూడదనీ, నిర్వాహకులు క్రీడలు కొనసాగినంతకాలం రాజకీయ నాయకులని నిర్లక్ష్యం చేసి ఆటగాళ్ళకే ప్రధాన్యత ఇవ్వాలనీ ఆశిస్తున్నాను.
3 comments:
sick mentality
Can't get you?Do you think wishing the games success is sick?
ఏదైనా జరిగితే ఓదార్చటానికి జగన్ ఉండనే ఉన్నాడు కదా, ఇక భయమెందుకు?!! అంత సెక్యూరిటీ ఉన్న చోట మనవాళ్ళు తెలంగాణ-సమైక్యాంధ్ర అంటూ ధర్నా లు ఎలాగూ చెయ్యరు కాబట్టి ఇబ్బంది లేదు.
Post a Comment