రోబో సినిమాలో చిట్టి సనని బంధించడం వశీకర్ వచ్చి దానితో మంచిగా ఉన్నట్టు నటించమని సన కి చెప్పడం నాకు బాలనాగమ్మ కథని గుర్తు చేసింది. బాలనాగమ్మలో రాకుమారిని మాంత్రికుడు బంధిస్తే వాడి ప్రాణం ఎక్కడుందో తెలుసు కోవడానికి రాకుమారి వాడితో మంచిగా ఉన్నట్టు నటించి ఆ గుట్టు తెలుసుకొని హీరోకి ఆ రహస్యం చెప్పి వాడిని మట్టు పెట్టిస్తుంది.
ఒకటే తేడా ఏమంటే రోబో సినిమాలో చిట్టి ప్రాణం ఎక్కడుందో హీరో అయిన వశీకి తెలుసు. అయితే ఆ ప్రాణం తియడానికి కొంత సమయం కావాల్సి వచ్చింది. అందుగ్గానూ హీరోయిన్ ని చిట్టితో మంచిగా ఉన్నట్టు నటించమని చెప్తాడు. ఈ సీన్ చూశాక నాకు బాల నాగమ్మ కథ గుర్తొచ్చింది. శంకర్ కి బాల నాగమ్మ కథ తెలుసని నేను అనుకోవడం లేదు. తెలిసి ఉంటే సన చేత చిట్టిలోని చిప్ రహశ్యాన్ని కూడా తెలుసుకొని వశీ చేత చిట్టిని మట్టు పెట్టించి ఉండేవాడేమో?
2 comments:
శంకర్‌కి బాలనాగమ్మ కథ తెలియదని ఎందుకనుకుంటున్నారు? బాలనాగమ్మ అప్పట్లో తమిళనాట కూడా దుమ్మురేపిన సినిమానే.
I see.Thanks for the info.This is my assumption only.
Post a Comment