నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, June 30, 2010

నేను ఆ రోజు బ్లాగులో రాసిన దానిని ఈరోజు ప్రపంచమంతా కోరుతోంది!

ఈ నెల 21న నేను ఒక పోస్టు పెట్టాను-ఫుట్ బాల్ లో కూడా టీవీ రీప్లే చూసి రిఫరీ నిర్ణయాన్ని మార్చే వీలుండాలని.దీని అవసరం ప్రపంచానికి మొన్న తెలిసొచ్చింది.
జర్మనీ పైన ఇంగ్లాండు ఆటగాడు లాంపార్డ్ కొట్టిన బంతి గోల్ పోస్టు లోపల పడి బయట కొచ్చినా రిఫరీ దానిని గోలుగా ఒప్పుకోలేదు.అదే రోజు ఇంకొక మ్యాచ్ లో అర్జెంటీనా ఆటగాడు ట్రెవెజ్ ఆఫ్ సైడ్ లో చేసిన గోలు రిఫరీ క్యాన్సిల్ చేయలేదు.
ఇప్పుడు అందరూ టీవీ రీప్లే చూసి రిఫరీ నిర్ణయం చెప్పేలాగా రూల్సు మార్చాలని అంటున్నారు.సరిగా ఆలోచిస్తే ఇందులో న్యాయం ఉందనిపిస్తోంది.అంతర్జాతీయ మ్యాచ్ లు జరిగే అన్ని చోట్ల జయంట్ స్క్రీనులుంటాయి.దానిలో చూసి నిర్ణయం తీసుకోవడానికి రిఫరీకి ఎక్కువ సమయం పట్టదు.అందువల్ల సమయం వృధా అవదం ఉండదు.

టెక్నాలజీ ఉన్నప్పుడు దాన్ని వాడుకోవడంలో తప్పు లేదు కదా?

రావణ్/విలన్ సినిమాకి ఈ క్లైమాక్స్ ఎలా ఉంటుంది?

చూడొద్దు మొర్రో అని బ్లాగు సోదరులు మొత్తుకున్నా వినకుండా మొన్న విలన్(హిందీలో రావణ్) చూశాను.పరమ చెత్తగా ఉంటుందని అనుకొని పోవడం వలన అంత నిరాశ చెందలేదు.మణిరత్నం సినిమా అనుకొని పోవడం వలన నిరాశే కానీ అంతకన్నా పరమ నీచమైన సినిమాలు ఎన్ని చూడలేదు!

సరే సినిమా గురించి,అందులో ప్లస్సు,మైనసుల గురించి అందరూ రాశారు కాబట్టి నేను రాయడం లేదు.నాకు నచ్చనిది అందులో క్లైమాక్సు.ముగింపు ఇలా ఉంటే ఎలా ఉంటుందో ఛూడండి.

బ్రిడ్జి పైన ఎస్పీ, వీరా పోరాటం చేస్తూ ఉంటారు.కొండ అంచులో నించుని రాగిణి వారిని ఆందోళనగా చూస్తూ ఉంటుంది.ఇంతలో ఎస్పీ జారి పడబోతాడు.అతడిని వీరా పట్టుకొంటాడు.ఎస్పీ కళ్ళలో భయం, వీరా కళ్ళలొ గర్వం.

"వీరా వారిని కాపాడండి" అని రాగిణి అరుస్తుంది. అరుపులు లొయలో వీరాకి వినిపిస్తాయా, వినిపిస్తె ఎలా వినిపిస్తాయి అన్నది అప్రస్తుతం.

ఎస్పీని పైకి లాగి ప్రయత్నంలో వీరా లోయలోకి జారి పడిపోతాడు.కొండ అంచుకి పరుగెత్తి కన్నీటి పర్యంతమైన రాగిణిని ఎస్పీ వచ్చి కౌగిలించుకొంటాడు.

క్లైమక్సు ఇలా మార్చడంలో రాగిణి శీలపరీక్ష అనే ఫార్సు లేకుండా పోతుంది అని నా అభిప్రాయం.

సినిమా చూసిన దురదృష్టవంతులు క్లైమాక్సు మీద మీ అభిప్రాయం తెలపండి

Friday, June 25, 2010

వార్డ్ బాయ్స్ డాక్టర్లైన వేళ-ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీ లీల

బిల్డింగూ, లక్షలకు లక్షలు పోసి చేరిన విద్యార్ధులూ,ఒకరిద్దరు ముసలి,రిటైరైన ప్రొఫెసర్లు తప్ప టీచర్లు,పేషంట్లూ లేని ఒక ప్రైవేటు మెడికల్ కాలేజి అది.
యధా ప్రకారం ఎం సి ఐ వాళ్ళు ఇన్స్ పెక్షన్ కి వస్తామని ముందుగా చెప్పడంతో కాలేజీ యాజమాన్యం అద్దె డాక్టర్లు,కిరాయి పేషంట్లతో సిద్ధమయ్యింది. రాష్ట్రం,దేశం నలుమూలలనుండీ డాక్టర్లు వచ్చేశారు.వాళ్ళు సంవత్సరం పొడవునా తాము హాజరవుతూ ఉన్నట్టు అప్పటికప్పుడు పాత తేధీలతో తయారయి ఉన్న రిజిస్టర్లలో సంతకాలు చేశారు.

ఒక రోజులో తంతు పూర్తయ్యింది.కాకపోతే చివర్లో ఒక చిక్కొచ్చి పడింది.వచ్చిన ఇన్స్ పెక్టర్లకు వీళ్ళు అందించిన ముడుపులు సరిపోలేదు.దాంతో వాళ్ళకు చిర్రెత్తి సరిగ్గా వారం తరువాత ముందస్తు హెచ్చరిక లేకుండా పరీక్షకు వచ్చేశారు.

దాంతో దొరికి పోయిన యాజమాన్యం ఒక డ్రామా ఆడింది. వార్డు బాయ్స్ నీ స్వీపర్లనీ తెల్ల కోట్లు తొడిగి డాక్టర్లుగా చూపడానికి ప్రయత్నించింది.ఇలాంటి వారిని ఎందర్నో చూసిఉన్న ఆ వచ్చిన జగత్ కిలాడీలు ఒకడిని పిలిచి నీ సంతకం చేయరా అని అడిగారు.వాడు ఇంగ్లీషులో వాడి పేరు కూడా రాయలేకపోయాడు.
దాంతో కాలేజీ గుర్తింపు రద్దయింది.తరువాత యాజమాన్యం చాలా తంటాలు పడి గుర్తింపు తెచ్చుకొన్నది.అందుకు ఇటీవలే పబ్లిగ్గా దొరికి పోయిన మోసగాళ్ళకు మోసగాడు కేతన్ దేశాయ్ సహకారం ఉందని ఒక నానుడి.
ఇదంతా నాకెలా తెలుసంటే ఆ కాలేజీలో అతిధి పాత్రలో అద్దె అసోసియేట్ ప్రొఫెసర్ గా నా కజిన్ ఉన్నాడు.సంవత్సరానికి ఒక సారి అతిధి పాత్ర పోషించినందుకు వాడికి కాలేజీ వాళ్ళే ఒక బ్యాంకు అకౌంటు తెరిచి నెల నెలా పాతిక వేలు వేస్తూ ఉంటారు. వేషం వేయడానికి పోవాలంటే ఏసీ కారు,హోటలూ సరే సరి!

Wednesday, June 23, 2010

అభిమానులా వెట్టిచాకిరీ కూలీలా?

మామూలు కూలీలకీ వెట్టి చాకిరీ చేసే కూలీలకి ఒక తేడా ఉంది.మామూలు కూలీ ఒక పని పూర్తయ్యేంత వరకూ లేదా తనకి ఇచ్చిన డబ్బు మేరకే కూలీగా ఉంటాడు.వెట్టి వాడు అలా కాదు.తన జీవితాంతం తన యజమాని కుటుంబానికి కూలీగా ఉంటాడు.తనని నియమించుకొన్న ఆసామీ చనిపోయినా అతడి కొడుక్కి వాడూ పోతే వాడి కొడుక్కీ కూలీగా బతుకుతూనే ఉంటాడు.
నేడు మన సినిమా హీరోలకి అభిమానులమని చెప్పుకొంటున్న వాళ్ళని చూస్తుంటే వీళ్ళ బతుకులూ ఈ వెట్టివాళ్ళ లాగానే ఉన్నాయనిపిస్తోంది.

ఎవరైనా ఒక హీరోకి అభిమాని అయ్యాడంటే అతడి రూపం చూసో,అభినయం చూసో, డాన్సులూ ఫైటింగులూ చేయడంలో నేర్పరితనం చూసో అభిమానం పెంచుకొంటారు.కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో కొన్ని సినిమా కుటుంబాలకి గుత్తంగా అభిమానులున్నారు.
కృష్ణ మహేష్ బాబులకి జమిలిగా, చిరంజీవి,పవన్ కల్యాణ్,అల్లు అర్జున్, చరణ్ తేజ గుంపుకి కలిపి ఒక బ్యాచ్ బాలకృష్ణ, జూనియర్ ఎన్ టీ ఆర్,కల్యాణ్ రాములకి కలిపి మరొక బ్యాచ్ ఇలా కుటుంబాలకి ఆ కుటుంబాం లోనుండి వచ్చిన వారసులకి కలిపి వీళ్ళు జీవితాంతం అబిమానులుగా ఉంటారు.
ఈ అభిమానానికి కారణం కులగజ్జీ,రాజకీయ పిచ్చీ కానీ మరొకటి కాదని అందరికీ తెలిసిన విషయమే!!

దొబ్బడం గౌరవప్రదమైపోయింది కదా!

నేను ఇంటర్ పూర్తయినదాకా బూతులు అస్సలు మాట్లాడేవాడిని కాదు.డిగ్రీలో చేరాక బూతులు అలవాటైపోయి అవి నా నోటివెంట ఆలవోకగా వచ్చేవి.

ఆడవారివీ,మగవారివీ జననాంగాలూ,మల ద్వారం,సృష్టి కార్యం ఇలా ఇవన్నీ ఆ బూతులలో ఉండేవి.ఒకసారి డిగ్రీ పూర్తయి బయట పడగానే బూతులు నోటివెంట రావడం ఆగిపోయింది.అప్పుడో ఇప్పుడో పట్టలేని కోపం వచ్చినప్పుడు బూతులొచ్చినా అవి నా మన్సులోనే మెదులుతాయి గానీ నోరు దాటి బయట పడకుండా జాగ్రత్త పడుతాను.
అయితే ఈ మధ్య తెలుగు సినిమాల్లో దొబ్బడం,దొబ్బించుకోవడం,దొబ్బేయడం చాలా తరచుగా వినిపించడంతో అది కూడా ఒకప్పుడు నేను వాడిన సృష్టి కార్యానికి సంబంధించిన బూతు మాటేమో నని అనుమానం వచ్చింది.
సరే,దాన్ని నివారించుకోవడానికి బ్రౌన్ నిఘంటువులో చూస్తే దొబ్బడం అంటే కాయిటస్ అని అర్ధం ఉంది.తెలుగు పాటలూ సినిమాలలో బూతులు కొత్త కాదు కాని మరి ఇంత పచ్చిగా ఒక బూతు పదం వాడడం దానిని గౌరవప్రదంగా వాడడం.......

Tuesday, June 22, 2010

ఫుట్ బాల్ లో కూడా టీవీ రీప్లే పెట్టాలి.

అంపైర్లు కూడా మనుషులే అన్ని నిర్ణయాలు అన్ని సార్లు కచ్చితంగా తీసుకోవడం అని టెలివిజన్ రీప్లే చూసి నిర్ణయం చెప్పడానికి థర్డ్ అంపైర్ అనే కాన్సెప్టు పెట్టాక చాలా రన్ అవుట్లలో సరైన నిర్ణయం తీసుకోవడానికి వీలయింది.
చూస్తే ఫుట్ బాల్ లో కూడా ఇలాంటిది పెడితే బావుండనిపిస్తోంది.చాలా వేగంతో జరిగే ఆటలో లైన్ అంపైర్ అన్ని సార్లు ఆటగాళ్ళతో సమానంగా పరిగెత్తి నిర్ణయం తీసుకోలేకపోవచ్చు.ముఖ్యంగా ఆఫ్ సైడ్ తెలుసుకోవడంలో ఈ సమస్య వస్తుంది.

నిన్న చిలీ-స్విట్జర్లాండ్ మ్యాచ్ లో చిలీ ఆటగాళ్ళ దాడులని స్విస్ ఆటగాళ్ళు చాలాసేపు ఎదుర్కొన్నారు. చివరి పది నిముషాలలో చిలీ చేసిన ఒక గోలు ఆఫ్ సైడుగా రిఫరీ ప్రకటించాడు. మరి కాస్సేపటిలోనే చిలీ చేసిన మరొక గోలు కూడ ఆఫ్ సైడే.రిఫరీ దాన్ని చూసుకోలేదు.కానీ టీవీలో ఆ విషయం స్పష్టంగా కనిపించింది.దీనితో స్విస్ ఆటగాళ్ళకి ఓటమి తప్పలేదు.
టీవీలో చూసి నిర్ణయం మార్చడానికి మరొక అంపైర్ ఉంటే ఇలాంటి వాటిని అరికట్టవచ్చు.

Monday, June 21, 2010

ప్రజా రాజ్యం పార్టీకి అల్లు అరవింద్ మరణ శాసనం.

పెను తుఫాను సృష్టించాలని ఆశ పడి ఆ తుఫాను కాస్తా తుంపర వాన అయ్యాక భంగ పడి, ఆ తుఫాను కోసం ఆశ పడి వచ్చిన వాళ్ళు అసలు నిజం తెలిశాక చెయ్యిచ్చి వెళ్ళిపోతుంటే వాళ్ళని ఆపలేక పార్టీని మూసేసి తిరిగి సినిమాల్లోకి వెళ్ళలేక కాంగ్రెస్సు పార్టీ చెయి చాపితే అందుకొని తోక పార్టీ అని పిలిపించుకొని ఎలాగైనా వార్తల్లో ఉండాలని బస్సు యాత్రలు గట్రా చేస్తూ రోజులు లాక్కొస్తున్న చిరంజీవికి ఆయన బావ ఆలు అరవింద్ ఒక శరాఘాతం లాంటి వార్త తెలియ జేశాడు. తాను మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నానని ఆయన నిన్న ఒక స్టేట్ మెంటిచ్చాడు.
పార్టీ టిక్కెట్లు అమ్ముకోవడానికి కౌంటరు తెరిచి అందిన కాడికి పోగేసుకొని చివరికి ఎంతో ఊదరగొట్టి రిలీజు చేసిన సినిమా మటాషు అని తెలిశాక పబ్లిక్కు కి మొహం చాటేసిన అరవింద్ గారు మళ్ళీ ఎందుకు వస్తున్నట్టో?

కాంగ్రెసుతో దోస్తీ కుదిరాక ఆ వంకతో మళ్ళి నలుగో అయిదో రాళ్ళు సంపాయించుకోవాడానికే అని కొంత మంది ఆయన మనసెరిగిన వాళ్ళ అభిప్రాయం.ఈ కళలో చిరంజీవికి పెద్ద అనుభవం లేదనీ తనయితే అందుకు సరిగ్గా సరిపోతాడనీ తెలిసిన అరవింద్ మళ్ళీ తెర ముందుకి వస్తున్నట్లు వాళ్ళు చెబుతారు.

ఏమో నిజమేనోమో?

Sunday, June 20, 2010

రేపిస్టుల పాలిట అంగచ్చేధన ఈ కండోం!

రేపిస్టులారా తస్మాత్ జాగ్రత్త. మీ పాలిట,సారీ, మీ అంగాల పాలిట యమ దూతలాంటి ఒక కండోముని లండన్ కి చెందిన ఒక డాక్టరమ్మ తయారు చేసింది.

రేప్-యాక్స్ లేదా రేప్-గొడ్డలి అనబడే ఈ కండోముని తయారు చేయాలనే ఆలోచన ఎహ్లర్స్ సోనెట్ అనే ఆమెకి తను దక్షిణ ఆఫ్రికాలో పని చేస్తుండగా కలిగిందట. అత్యధికంగా రేప్ లు జరిగే దేశంగా పేరు పొందిన అక్కడ ప్రతి 17 సెకన్లకీ ఒక రేప్ రిపోర్టు చేయబతుంది. అలా ఒక బాధితురాలికి చికిత్స చేస్తూండగా ఆ అమ్మాయి ఆపుకోలేని కోపంతో బాధతో "నాకు అక్కడే గనుక పళ్ళు ఉన్నట్లయితే వాడి దాన్ని కొరికి నమిలేసే దాన్ని" అని అన్నదట.
ఆ మాటలతో ఆలోచనలో పడ్డ సోనెట్ కి అక్కడ పళ్ళు పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కలిగి దానికి ఆమె ఇచ్చిన రూపమే ఈ రేప్-యాక్స్.
alat anti perkosa
ఇది ఒక ఫిమేల్ కండోం.అయితే దీనిలో లోహపు పళ్ళు ఉంటాయి.దీన్ని తమ మర్మాగం లో పెట్టుకొన్న అమ్మాయికి ఎలాంటి బాధ ఉండదు.అయితే ఎవడైనా దుండగుడు ఆమెని మాన భంగం చేయాలని తన అంగాన్ని ఆమె మర్మాయవంలో చొప్పిస్తే ఆ లోహపు పళ్ళు దానిని గట్టిగా పట్టుకొంటాయి.

అప్పుడు కలిగే భరించలేని బాధతో వాడు తన అంగాన్ని బయటకు తీసినా ఆ లోహపు పళ్ళు వీడి పోవు.దాన్ని తొలిగించాలంటే తప్పక డాక్టర్ని సంప్రదించాల్సిందేనట.మత్తు ఇచ్చి ఆపరేషన్ తో గానీ దాన్ని తీయడం సాధ్యం కాదు.దీని వల్ల వాడిని పోలిసులకి పట్టివ్వడం కూడా సాధ్యపడుతుంది.

చాలా కాలం నుంచీ పత్రికల్లొ రేప్ కేసు గురించి చదివినప్పుడల్లా నాకు ఒక ఆలోచన కలిగేది.అమ్మాయికి ఇష్టం లేకుండా ఎవడైనా అంగ ప్రవేశం చేస్తే ఆ అంగం తెగిపోయేలా ఒక సాధనాన్ని ఆ అమ్మాయి మర్మాంగంలో ఉంచుకొనేలా రూపొందిస్తే కొంత వరకూ రేపులని అరికట్టవచ్చు కదా అని.

దీనికి ప్రేరణ ఇండియానా జోన్స్- ది లాస్ట్ క్రూసేడ్ నుంచి వచ్చింది.అందులో క్లైమాక్స్ లో విలన్ హోలీ గ్రయిల్ ఉన్న చోటికి పోబోతే రెండు పదునైన కత్తులు వచ్చి అతడి తలని కత్తిరిస్తాయి.అలాంటి మెకానిజం యోనిలోపల పెట్టడం అయ్యేపని కాదని అంతకు మించి ఆలోచించడం మాని వేశాను.కానీ సోనెట్ డాక్టరు కాబట్టి,ఆడది కాబట్టి కొంచెం తెలివిగా ధరించిన అమ్మాయికి ఇబ్బంది లేకుండా రేప్ చేయడానికి సాహసించిన వాడికి మళ్ళీ అలాంటి ఆలోచన కలగకుండా ఉండేలా శిక్షించే సాధనం కనుక్కొంది.
వెరీ వెల్ డన్ ఎహ్లర్స్ సోనెట్.