చూడొద్దు మొర్రో అని బ్లాగు సోదరులు మొత్తుకున్నా వినకుండా మొన్న విలన్(హిందీలో రావణ్) చూశాను.పరమ చెత్తగా ఉంటుందని అనుకొని పోవడం వలన అంత నిరాశ చెందలేదు.మణిరత్నం సినిమా అనుకొని పోవడం వలన నిరాశే కానీ అంతకన్నా పరమ నీచమైన సినిమాలు ఎన్ని చూడలేదు!
సరే సినిమా గురించి,అందులో ప్లస్సు,మైనసుల గురించి అందరూ రాశారు కాబట్టి నేను రాయడం లేదు.నాకు నచ్చనిది అందులో క్లైమాక్సు.ముగింపు ఇలా ఉంటే ఎలా ఉంటుందో ఛూడండి.
బ్రిడ్జి పైన ఎస్పీ, వీరా పోరాటం చేస్తూ ఉంటారు.కొండ అంచులో నించుని రాగిణి వారిని ఆందోళనగా చూస్తూ ఉంటుంది.ఇంతలో ఎస్పీ జారి పడబోతాడు.అతడిని వీరా పట్టుకొంటాడు.ఎస్పీ కళ్ళలో భయం, వీరా కళ్ళలొ గర్వం.
"వీరా వారిని కాపాడండి" అని రాగిణి అరుస్తుంది.ఆ అరుపులు ఆ లొయలో వీరాకి వినిపిస్తాయా, వినిపిస్తె ఎలా వినిపిస్తాయి అన్నది అప్రస్తుతం.
ఎస్పీని పైకి లాగి ఆ ప్రయత్నంలో వీరా లోయలోకి జారి పడిపోతాడు.కొండ అంచుకి పరుగెత్తి కన్నీటి పర్యంతమైన రాగిణిని ఎస్పీ వచ్చి కౌగిలించుకొంటాడు.
క్లైమక్సు ఇలా మార్చడంలో రాగిణి శీలపరీక్ష అనే ఫార్సు లేకుండా పోతుంది అని నా అభిప్రాయం.
ఈ సినిమా చూసిన దురదృష్టవంతులు ఈ క్లైమాక్సు మీద మీ అభిప్రాయం తెలపండి
3 comments:
No. Whatever is there, that only looks good to me.
రాగిణి శీలపరీక్ష అనే ఫార్సు is only to find where Raavan is.
ఏడ్చినట్టుంది మీ క్లైమాక్స్..
Your thought is good.......
Post a Comment