నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, April 27, 2010

ఒరేయ్ బాల సాయీ!అంత కైపెక్కిందా నీకు?

కాస్సేపటిక్రితం ఎన్ టీవీలొ బాలసాయిబాబా మీద ఒక లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం వస్తుంటే చానళ్ళు తిప్పడం మానేసి చూశాను.ఊహించినట్టే గోగినేని బాబు హేతువాదిగా బాలసాయి ట్రస్ట్ చైర్మన్ బాబాని సమర్ధిస్తూ మాట్లాడారు.కూటికోసం కోటి విద్యలు అందులో ఈ బాబా వేషం ఒకటి అని నా నమ్మకం.వినేవాడు ఏదో అయితే చెప్పేవాడు మహా మేధావి అన్నట్లు పిచ్చి భక్తులు వస్తూ ఉంటే పాపం బాబా మాత్రం వాళ్ళని ఎక్స్ ప్లాయిట్ చేయకుండా ఎలా ఉండగలడు అని దేవరవారిపైన నాకు కొంచెం సానుభూతికూడా ఉంది.
కానీ కాస్సేపటిలోనె అది ఆవిరైపోయింది.స్వామిగారికి ఉన్న అనేకానేక ఆస్తులపైన ఆయన కామెంటు ఒకటి చూపించారు.అది యధాతధంగ:"బజ్జీల కొట్టు వాడు నాకోసం ఒక బజ్జీ సమర్పిస్తాడు.ఇంకో వ్యాపారం చేసే వాడు దానికి సంబంధించినదేదో ఇస్తాడు.అలాగే వంద ఎకరాల ఆసామీ ఓ అయిదు ఎకరాలు నాకు సమర్పించుకోవచ్చు.తిరుపతి వెంకటేశ్వర స్వామికి దేశ విదేశాల్లో ఎన్నో ఆస్తులున్నాయి.మీరు వెళ్ళి ఆయన్ని ఇదే ప్రశ్న అడుగుతారా?"
ఒరేయ్ జుట్టు పోలుగా!నీ పొట్టకోసం నువ్వు ఎన్ని వేషాలైనా వేసుకొ. నిన్ను నమ్మి వచ్చి నీకు డబ్బూ దస్కం ఇచ్చేవాళ్ళను ఏమైన చేసుకో.పెద్దాయనతో నిన్ను పోల్చుకోవడమేమిట్రా గాడిదా?సంక నాకి పోతావురొరేయ్!కొంచెం వొళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లడు ఈ సారినుంచి.


వీళ్ళు తల్లులా,కొంచెమైనా సిగ్గుండక్కర్లా?

నిన్న రాత్రి న్యూస్ చూస్తూ ఎన్-టీవీలో ఒక చర్చా కార్యక్రమం చూశాను.అందులో సంధ్యతో బాటు ముగ్గురు నడివయసు ఆడవాళ్ళు ఉన్నారు.ఏమిటా విషయం అని చూస్తే జీ టీవీలోని ఆట గురించి.ఆ ముగ్గురూ పిల్లల తల్లులట, వాళ్ళు ఆ ప్రోగ్రాముని సిగ్గు లేకుండా సమర్ధించడం చూసి ఆవేశంగా ఫోన్ అందుకొని తెరపైన కనిపించే నంబరుకు డయల్ చేశాను.తల్లులమని చెప్పుకొనే ఆ ఆడంగులను కడిగేద్దామని.కానీ లైన్ కలవలేదు.

వాళ్ళలో జుట్టు విరబోసుకొని ఉన్న ఒకామె టీ ఆర్ పీ గురించి మాట్లాదింది.ఛూడండి ఎంత ఆదరణ ఉందో ఈ ప్రోగ్రాముకు అని.ఆమెను నేను ఒక ప్రశ్న అడగాలని ఫోన్ చేశాను కానీ వీలు పడలేదు.ఇక్కడ రాస్తున్నాను నా ప్రశ్నని:నువ్వు ఇప్పటికిప్పుడు గుడ్డలిప్పి డాన్సు చేస్తే దానికి కూడా పిచ్చ టీఆర్ పీ వస్తుంది చేస్తావా?
ఒక బ్రేక్ తరువాత ఆట క్లిప్పింగ్స్ కొన్ని చూపించారు.ఒక దానిలో దేశభక్తి గీతం ఉంది.చూడండి ఎంత బాగుందో అన్నట్లు చూశారు ఆ తల్లులు.వెంటనే నీ ఇల్లు బంగారం గానూ అన్న పాట వచ్చింది.ఒక చిన్నారి అచ్చు వ్యాంప్ లాగ డన్సు చేయడం ఆ పిల్ల పక్కన ఒక బుడబుక్కలోడు డాన్సు చేయడం చూశాక ఈ ప్రోగ్రాం పైన జరుగుతున్న దాడిలో తప్పు .

సిరి అని ఒక టెంత్ క్లాసు అమ్మాయి ఫోన్ చేసి ఆ అమ్మలకు మంచి షాకిచ్చింది.రేపు ఈ పిల్లలు పెద్దయక ఈ క్లిప్పింగ్స్ చూస్తే నెను ఇలాంటి డాన్స్ చేశానా,నా తల్లి తండ్రులు నా చేత ఇలాంటి డాన్సులు చేయించారా అని తప్పక బాధ పడతారు అని బాగా చెప్పింది కానీ ఈ బరి తెగించిన అమ్మలు ఆ అమ్మాయిపైన దాడికి పూనుకోవడంతో బహుశా చానల్ వాళ్ళే అనుకొంటా లైన్ కట్ చేశారు.

ఇప్పటికైనా ఈ అమ్మా నాన్నలు తెలివి తెచ్చుకొని పిల్లలని పిల్లల్లా పెంచితే అందరికీ మర్యాదగా ఉంటుంది.లేకుంటే జస్టిస్ సుభాషణ్ రెడ్డి కొరడా జులిపించాల్సి ఉంటుంది.

Saturday, April 24, 2010

తలా తోకా లేని శాస్త్రాలు బహు మేలు

శాస్త్రాల్లో చాలా రకాలున్నాయి.శాస్త్రీయంగా ఋజువైనవి అలా ఋజువు కానివీనూ.వీటిలో రెండవ రకానికి చెందినవాటిని కుహనా శాస్త్రాలని పిలవాలనీ వాటిని నమ్మకూడదనీ ఎవరైనా అనుకొంటారు.వాటికి ప్రజల మద్ధతు కూడా ఉండదని కొంచెం కామన్ సెన్సు ఉన్న వాళ్ళు అనుకొంటే అది తప్పు కాదు.కానీ కామన్ సెన్సు అనేది అంత కామన్ కాదని వీళ్ళు తెలుసుకోవాలి.

ఈ రకం తలా తోకా లేకుండా విశేష ఆదరణలో ఉన్న శాస్త్రాలలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది న్యూమరాలజీ జెమాలజీ అనె రెండు. జ్యోతిష్యాన్ని కూడా ఇందులో చేర్చేవాడినే కానీ ఈ వేదికలో దనికి గట్టి సపోర్టర్సు ఉన్నందువల్లనూ,వాళ్ళతో పోట్లాడే ఓపిక నాకు లేనందు వల్లనూ,ఆ పని ఇదె వేదికలో నచికేతుడు అద్భుతంగ చేస్తున్నందు వల్లను దానిని వదిలి పెట్టాను.

న్యూమరాలజీ చాల సింపుల్.ప్రతి వాడికీ ఒక బర్త్ నంబరూ ఒక డెస్టినీ నంబరు ఉంటాయి.మన జీవితంలో మనకు నచ్చని దాన్ని మార్చుకోవడానికి వీటిలో ఏదో ఒకదాన్ని కాన్నీ లేక రెండిటినీ గాని మార్చుకొంటే చాలు.

ఉదాహరణకి ఒక వ్యక్తికి ఎన్ని రోజులైనా ఉద్యోగం రాలేదనుకోండి. పద్ధతిగా అయితే కొత్త స్కిల్సు నేర్చుకోవాలనో.సాఫ్టు స్కిల్సు పెంచుకోమనో,ఎక్స్ పెక్టేషన్సు తగ్గించుకొని వచ్చిన ఉద్యోగంలో చేరిపొయ్యి మరింత మంచి ఉద్యోగానికి ప్రయత్నించమనో సలహా చెప్పాలి.ఇది సదరు వ్యక్తికి అంత బాగా నచ్చదు.అదే న్యూమరాలజిస్టు నడిగితే దినికి తేలికైన పరిష్కరం సూచిస్తాడు.పేరులో ఒక అక్షరాన్ని పెంచుకోవడమో లెక తగ్గించుకోవడమో చెస్తే సమస్య పరిష్కరమైపొతుందని చెబితే వాదికి అంతకన్నా ఆనందం ఏముంటుంది.అయితె దానివల్ల వాడికి ఉద్యోగం వస్తుందా లేదా అన్నది అప్రస్తుతమనుకోండి.
రోజూ ఉదయాన్నే ఒక టీవీ చానల్ లోను సాక్షి పత్రికలోనూ ఇలాంటి పరిష్కారాలు చెప్పె ఒక న్యూమరలజీ కాలం నడుస్తోండి.పేరులో అక్షరాలు మార్చుకోగనే సమస్యలన్నీ తేలిపోతె ఈ ప్రపంచం ఇలా ఎందుకుంటుంది.

ఇలాంటిదే జెమాలజీ.అమ్మాయి లావుగా నల్లగా ఎత్తు పళ్ళతో ఉంది.పెళ్ళి కావడం లేదు అని సమస్య చెబితే డైటింగ్ చేసి సన్న బడాలి,పళ్ళకి క్లిప్స్ వెయించాలి,బ్యూటీ టీప్స్ ఉపయోగించి కొంచెం రంగు పెంచాలి, కట్నం ఓ పది లక్షలు ఎక్కువ ఆఫర్ చేయాలి అని చెబితే అంత రుచించదు.గోమేధికాన్నో,ఇంకెదో రాయినో చెతికో ఇంకెక్కడో కట్టుకొంటే చాలు.పెళ్ళయిపోతుంది అని చెబితే సమ్మగా ఉంటుంది.
కాబట్టి ఇలాంటి తలా తోకా లేని శాస్త్రాలే ప్రజలకు నచ్చుతాయి.క్లిష్టమైన సమస్యలకు కూడా వీటిలో అతి తేలికైన పరిష్కార మార్గాలుంటాయి కాబట్టి.అయితే ఇవి పని చేస్తాయా లేదా అని ఎవరూ చూడరు.ఏదో చెప్పామా మన ఫీజు తిసుకున్నామా అంతే.అదే టీవీలో అయితే మన ప్రోగ్రాం అయ్యిందా లేదా అంతే.

పెన్ను తీసుకొంటే లంచం-కోట్లు దండుకొంటే సమర్ధనీయం

ఎప్పుడు ఊరెళ్ళినా మా కజిన్ ని కలుస్తాను.వాడు కొద్దో గొప్పో పేరు గడించిన బొక్కల డాక్టరు కాబట్టి వాడింట్లో ఉన్న చాలా వస్తువులపైన ఏదో ఒక మందుల కంపెనీ పేరు ఉంటుంది,చివరికి వాడి కాళ్ళకున్న రీబోక్ షూస్ తో సహా.నాకోసమని వాడు రకరకాల పెన్నులు తీసిపెడతాడు.పెన్నుల మీద నాకున్న మోజు వాడికి తెలుసు.

ఈ మధ్యన మందుల కంపెనీలనుండి డబ్బులు గిఫ్టులూ స్వీకరించకూడదని ఎం సీ ఐ ఒక చట్టం చేసింది.ఇది ఆ సంస్థ అధ్యక్షుడు కేతన్ దేశాయ్ గారి ఆలోచన.నాకూ సబబే అనిపించింది.కొందరు డాక్టరు ఈ కంపెనీలనుండి చాలా విలువైన గిఫ్టులు తీసుకొంటారు ప్లాస్మా టీవీలు,విదేశీ యానాలు,ఫ్రిజ్జులూ గట్రా.

నేను మావాడిని అడిగిన ప్రశ్న ఏమిటంటే ఒక కంపెనీ నుండి అంతంత విలువైన కానుకలు అందుకొంటే మీరు ఆ కంపెనీ మందులే మీ దగ్గరకొచ్చే రోగులకు రాస్తారు కదా అని.ఒక విధంగా ఇది నిజమని ఒపుకొన్నాడు మావాడు.కానీ ఎదో ఒక కంపెనీ మందు వాడాలి కదా ఆ వాడేదేదో మా కంపెనీవే వాడమని ఈ గిఫ్టులిస్తారు అట.

మొత్తానికి కేతన్ దేశాయ్ గారి ఆర్డరు నాకు నచ్చింది.ఒక కంపెని నుండి డబ్బో కానుకో తీసుకొంటే అవసరమున్నా లేకపోయినా ఆ కంపెనీ మందులు పేషంట్ల నెత్తిన రుద్దుతారని నా అభిప్రాయం.
కాని ఈ రోజు పేపర్లో అదే కేతన్ దేశాయ్ మహానుభావుడు మౌళిక వసతులు ఏమాత్రం లెని ఒక ప్రైవేటు వైద్య కళాశాలకి విధార్ధులను చేర్చుకోమని అనుమతి ఇవ్వడానికి రెండు కోట్లు స్వీకరించారని చదివి షాకయ్యాను.
ఔరా గురివిందా నీతులు పక్క వాళ్ళకేనా?మనకు వర్తించవా?ఏ సదుపాయాలూ లేని కాలేజీలో మెడిసిన్ చదివి రేపు వాళ్ళు బయటికొచ్చి వైద్యం చేస్తే ఏమి జరుగుతుందో ఒక డాక్టరుగా నీకు తెలియదా? ఎవరెలా పోతే నాకేమిటి నా డబ్బు నాకొస్తె చాలు అనుకొన్నావా?

Friday, April 23, 2010

మావోయిష్టు అన్నలూ మీకోసం కొన్ని టార్గెట్లు

అన్నలారా ముందుగా మీకు లాల్ సలాం.నా జీవితంలో ఇంత వరకూ నేను నక్సలైటు అన్న వాడిని చూడలేదు.టీవీలో నారాయణ మూర్తి సినిమాలలో విన్నదే ఈ లాల్ సలాం అన్న పదం.నాకు మీమీద ద్వేషమూ ఆరాధనా ఏమీ లేవు.మిమ్మల్ని ఎన్ కౌంటరులో చంపినా మీరు పోలీసులని ఆంబుష్ లో చంపినా అయ్యో అనుకోవడం తప్ప అంతకు మించి మీ ఉద్యమంలో కానీ మిమ్మల్ని అణచివేసే కార్యక్రమంలో కానీ నాకు ఎటువంటి ఆసక్తీ లేదు.

కాని మొన్న దంతేవాడలో మీరు జరిపిన మారణహోమం చూసి కొంత బాధ కలిగింది.మిమ్మల్ని పోలీసులు చంపటం, మీరు వాళ్ళని చంపటం మీ మీ స్వభావం.అవి రెండూ చేయకపోతే అది ప్రకృతి విరుద్ధం అవుతుంది.కానీ అంత మంది మాములూ సాదా సీదా ఉద్యోగస్తులని చంపదం అయ్యో అనిపించింది.అలా అని మీరు చంపడం మానేస్తె అదీ బావుండదు.మీకు ప్రాక్టిసు లేకుండా పోతుంది,మీడియాకు,మిమ్మల్ని పొగిడే లేదా తెగిడే వాళ్ళకూ పనీ పాటా లేకుండా పోతుంది.కాబట్టి మీకూ కొంత టార్గెట్ ప్రాక్టీసు కావాలికదా!
ఎవరూ మిమ్మల్ని విమర్శించకుండా పైపెచ్చు బాహాటంగానో లెక లోలోపలో పొగిడే విధంగ కొన్ని టార్గెట్లు సూచిస్తున్నాను.వీటిపైన ఎయిం చేయండి.

కోటానుకోట్లు దిగమింగే రాజకీయ బకాసురులు.మీరు వీళ్ళ పని పడితే మీకు చాలామంది అభిమానులు ఏర్పడుతారు.మీమీద అభిమాన సంఘాలు ఏర్పడ్డా అశ్చర్యం లెదు.
జనాన్ని పీల్చుకు తింటున్న అవినీతిపరులు.వీళ్ళ పైన చెయ్యి వేస్తే మికు తోడుగా ఎన్నొ వేల చేతులు కలుస్తాయి.

సమాజాన్ని దోచుకుతింటున్న బడా కాంట్రాక్టర్లూ,భూబకాసురులూ, అమాయకురాళ్ళని వేశ్యా గృహాలకు తరలించె దొంగ లం--కొడుకులూ ...ఇలా ఎందరో ఉన్నారు.

వీళ్ళని టార్గెట్ చేయండి.దేశంలో కొన్ని వేలమంది తమ పూజాగృహాల్లో దేవుడి ఫోటోలు తీసివేసి మీ బొమ్మలు పెట్టుకుంటారు.

చదరంగపు రారాజు మరోసారి విజయుడవ్వాలి

రేపటినుండీ బల్గేరియాలో జరిగే మ్యాచ్ లో ప్రపంచ చదరంగం చాంపియన్షిప్ కోసం వాసెలిన్ టొపలోవ్ తో మన విశ్వనాధన్ ఆనంద్ పోటీ పడబోతున్నాడు.ఇప్పటికి చదరంగం లోని అన్ని రకాల ఫార్మాట్ లలో ప్రపంచ చాంపియన్షిప్ గెలిచిన ఆనంద్ కి ఇది చాలా గట్టి పరీక్ష.టొపలోవ్ ఇప్పుడు అద్భుత ఫాం లో ఉన్నాడు.దానికి తోడు ఐస్ ల్యాండ్ అగ్నిపర్వతం పుణ్యమా అని ఆనంద్ బల్గేరియా చేరుకోవడానికి నలభై గంటలు రోడ్డు ద్వారా ప్రయాణీంచి శారీరకంగా అలసిపోయి ఉన్నాడు.మ్యాచ్ ఒక రోజు వాయిదా పడడం ఒకటే అతనికి కొద్దిగా ఊరటనిచ్చే అంశం.
ఈ దశాబ్ధంలో చదరంగాన్ని తనదైన శైలిలో పాలించిన ఆటగాడు ఆనంద్.ఈ క్రీడపైన ఉక్కు పట్టు ఉన్న రష్యన్ లను తోసిరాజని తన ముద్రని వేశాడీ లైట్నింగ్ కిడ్.చదరంగం లో ఆల్ టైం గ్రేట్ అని చెప్పబడ్డ గ్యారీ కాస్పరోవ్ పైన మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా ఎవరూ కాదనలేని గుర్తింపు తెచ్చుకొన్నాడు.

చదరంగం పుట్టినిల్లయిన భారతదేశంలో ఈ క్రీడకు ఒక గుర్తింపు తీసుకురావడానికీ,హరిక్రిష్ణ,హంపి,హారిక,శశికిరణ్ లాంటి అనేకమంది గ్రాండ్ మాష్టర్లు తయారు కావడానికీ ఆనంద్ కారణం అన్నది కాదనలెని సత్యం.

ఇప్పుడు జరిగే ఈ మ్యాచ్ లో ఆనంద్ మరోసారి విజయం సాధించి తన ఆధిపత్యాన్ని చాటాలని నా బ్లాగు తరఫునా కూడలి,హారం,జల్లెడ,మాలిక సభ్యుల తరఫునా ఆశిస్తున్నాను.

Thursday, April 22, 2010

క్రీమీ లేయర్ కి రిజర్వేషన్ అవసరమా?

ఎక్కడైనా ప్రభుత్వ మెడికల్ కాలేజిలో గానీ ఇంజినీరింగ్ కాలేజిలో గానీ సీట్లు తెచ్చుకున్న వాళ్ళ ర్యాంకులు చూస్తే కొంతమందికి గుండె రగిలిపోతుంది.ముఖ్యంగా మెడిసిన్ లో ఇరవై ముప్పై వేలు ర్యాంకుతో సీట్లు తెచ్చుకొనే వాళ్ళు ఉంటారు.మూడు నాలుగు వేలు ర్యాంకుతో సీటు తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారు.ఈ వేలలో ర్యాంకుతో సీటు వచ్చిన వాడు బాగా వెనక బడ్డ వాడా అంటే అదేమీ ఉండదు.అమ్మా అబ్బా ఏ డాక్టర్లో లక్షలు,కోట్లు లంచాలు మింగే ఉద్యోగస్తులో అయి ఉంటారు.

రిజర్వేషన్లు ఉండాలా వద్దా అని ఇందులో నేను రాయడం లేదు.ఈ పోస్టు టాపిక్ ఏమిటంటే ఉన్నతోద్యోగుల పిల్లలకి,అధిక ఆదాయ వర్గాల పిల్లలకీ రిజర్వేషన్లు అవసరం లేదు అన్నదే ఇక్కడ టాపిక్.

ఆర్ధికంగా,సామాజికంగా వెనకబడ్డ వారికి రిజర్వేషన్ అవసరం అన్నది రిజర్వేషన్లు పెట్టిన ముఖ్య ఉద్ధేశ్యం.మంచిదే,అయితే ఈ వెసులుబాటు ఉపయోగించుకొని లాభపడ్డాక ఆ కుటుంబం ఎంత మాత్రం ఆర్ధికంగా వెనకపడ్డ కుటుంబం కాదు.ఇప్పటి సమాజంలో డబ్బు ఉంటే సామాజిక వెనుకబాటుతనం కూడా ఏమాత్రం ఉండాదనుకోండి అది వేరే విషయం.
ఈ అర్ధికంగా బలపడ్డ కుటుంబాలని రిజర్వేషన్ పరిధిలోంచి తొలగిస్తే మరొక అర్ధిక, సామాజిక బలహీనుడికి ప్రయోజనం చేకూరుతుంది కదా!అయినా ఏ ఒక్క కుల సంఘం కూడా దీనికి ఒప్పుకోదు.

ఈ క్రీమీ లేయర్ ని రిజర్వేషన్ పరిధిలోంచి తొలగించడం వల్ల నిజమైన బలహీనులకి ప్రయోజనం చేకూరుతుంది.ఈ దిశగా ఉద్యమించాల్సింది బీసీ,ఎస్సీ,ఎస్టీ లలో వాస్తవాన్ని అంగీకరించి నిజమైన అభాగ్యులకోసం పోరాటం చేయగలిగిన వాళ్ళే.కులం పేరు చెప్పి డబ్బు చేసుకొనే పందికొక్కులు కాదు.
కాబట్టి ఇప్పడైనా ఆ వర్గాలలో కొంచెం ఆలోచన చేసే వాళ్ళు ఈ దిశగా పోరాటం చేస్తే రిజర్వేషన్లు పెట్టిన ఉద్ధేశ్యం నెరవేరుతుంది.కనీసం కొన్ని దశాబ్ధాలకైనా ఈ రిజర్వేషన్లని శాశ్వతంగా ఎత్తివేయవచ్చు.అప్పుడే సమసమాజ స్థాపన జరుగుతుంది.

వైఎస్సార్ Vs చంద్రబాబు-2

లోగడ ఇదే టైటిల్ తో ఒక పోస్టు పెట్టాను.ఇది రెండవ భాగం.

వైఎస్ కీ చంద్రబాబుకీ ఒక ముఖ్య మైన తేడా ఏమిటంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులతో వ్యవహరించిన తీరు.చంద్రబాబు ఉద్యోగుల దుంప తెంచేవాడు పని చేయండ్రా అని.నెను నిద్ర పోను మిమ్మల్ని నిద్రపోనివ్వను అని కూడా అన్నట్లు పత్రికల్లో వచ్చింది.ఒక గ్రామ సభలో ఒక అధికారి ఆయన సమక్షంలో గుండెపోటు వచ్చి చనిపోయాడు కూడా.
See full size image

సహంజగానే తీసుకొనే జీతనికీ చేసే పనికీ ఏమాత్రం పొంతన లేని ఉద్యోగులకి ఈ వ్యవహరం నచ్చలేదు.అందుకె 2004 ఎన్నికలలో వాళ్ళు మూకుమ్మడిగా ఆయన పార్టీకి వ్యతిరేకంగా పని చేశారు.చాల చోట్ల రిటర్నింగ్ ఆఫిసర్లు వోటు వేయడం తెలియని వాళ్ళవీ చూపూ సరిగా లెని వాళ్ళవీ వోట్లు వాళ్ళు సైకిల్ అని చెప్పినా హస్తమ్మీద వేశారని చాలా మంది ఉద్యోగులే ఒప్పుంటారు.

వై ఎస్ ఈ పొరబాటు చేయలేదు.ఆయన ఉద్యోగస్తులకి చాలా వెసులుబాటు కలిగించారు.ఖచ్చితంగ పని చెసి తీరాలని పట్టుబట్టి వాళ్ళ పీకల మీద కూర్చోలేదు.టేకిటీజీ పాలసీలో పరిపాలన నడిపారు.లంచం తీసుకొంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డా ఉద్యోగంలోంచి సస్పెండ్ అవ్వాల్సిన పని లేదని,విచారణలో దోషి అని తేలే దాకా ఉద్యోగం చేసుకోవచ్చనీ ఒక జీవొ కూడా ఇచ్చారు.

ఇంత చేసినా 2009 ఎన్నికలలో తాము బొటాబొటీగానె నెగ్గడం ఆయన్ని నిరాశ పరిచింది.అందుకే రెండవసారి గెలిచాక ఉద్యోగులు ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికలలో తనని తన పార్టీని డిస్టింక్షన్ తో గెలిపించే భాధ్యతని ఆయన ఉద్యోగస్తులమీద పెట్టారు."మీకేం కావాలన్నా ఇస్తాం మమ్మల్ని బంపర్ మెజారిటీతో గెలిపించే పూచీ మీదే" అని అన్నారు.

ఆయన బ్రతికి ఉంటే వాళ్ళకోసం ఏమేమి చేసి ఉండే వాడో ఏమిచ్చి వాళ్ళని తమ శాశ్వత అనుయాయులుగా తిప్పుకొని ఉండేవాడో గానీ విధి ఆడిన కౄర నాటకంతో ఈ ప్రశ్నకి జవాబు లెకుండా పోయింది.

Wednesday, April 21, 2010

సినిమా వోళ్ళూ జర దీన్ని చూడుండ్రీ.

మొత్తానికి సినిమా నిర్మాతల్లొ కదలిక వచ్చింది.అనవసర ఖర్చులని తగ్గించాలన్న ప్రయత్నం మొదలయ్యింది.తెలుగు సినిమా వ్యయాన్ని వీళ్ళే ఇబ్బడి ముబ్బడిగా పెంచేశారు.ఎన్ని రోజులు ఆడినా లాభాలు రాని స్థాయికి తీసుకెళ్ళారు.ఖర్చు తగ్గించడం అనేది మంచి పనే.అందుకు నా వంతుగా కొన్ని సలహాలు.

1.పాటలు లోకల్ టాలెంటుతో పాడించండి.ఉదిత్ నారాయణ్ గొప్ప సింగరయ్యిండొచ్చు.కానీ తెలుగు పాటలు పాడేటప్పుడు అతగాడి గొంతు దాఋణంగా ఉంటుంది.అతడి హోటల్ రూం ఖర్చుతో లోకల్ టాలెంటుని హైర్ చేసుకోవచ్చు.

2.ముమైత్ ఖాన్ కన్నా బాగా ఊపే అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు.వాళ్ళలో కొంచెం కంటికి నదురుగ కనిపించే అమ్మాయిలతో ఐటం సాంగ్స్ తియ్యండి.సూపర్ గా ఉంటుంది.

3.విదేశాలని తలదన్నే లొకేషన్స్ మన దేశంలో చాలా ఉన్నాయి.పాటల కోసం అక్కడికి వెళ్ళండి.తక్కువ ఖర్చుతో పనయిపోతుంది.కథ డిమాండ్ చేస్తేనే విదేశాలకు విమానమెక్కండి.

4.ఒక సారి నాటక రంగాన్ని చూడండి.మాంచి టైమింగ్ ఉన్న కమేడియన్లు ఎంతో మంది కనిపిస్తారు.సినిమాలలో ఎస్టాబ్లిష్ అయ్యిన వాళ్ళకేమీ తీసిపోరు.బ్రహ్మానందం అండ్ కంపెనీ కన్నా చాలా బాగా చేయగలరు.పైపెచ్చు పారితోషికం తక్కువిచ్చినా తీసుకొంటారు.

5.ముంబాయి భామలకేమీ తీసిపోని అందగత్తెలు చాలామంది మీకు నిత్యం కనిపిస్తూ ఉంటారు.అందాల ఆరబోతలో కూడా ఏమీ తక్కువ చేయరు.కొద్దిగా సాహసించి వాళ్ళకొక చాన్స్ ఇవ్వండి.

6.ఎంత పెద్ద స్టార్ అయినా మేమిచ్చేది ఇంతే అని తెగేసి చెప్పండి.వాళ్ళు ఖచ్చితంగా దిగి వస్తారు.

7.చేతిలో తెల్ల కాగితాల బొత్తులు పట్టుకొని మీకేసి దీనంగా చూసే యువకుడికి ఒక అరగంట కేటాయించండి.మాంచి కథ చెప్తాడు.ఎక్కువ డబ్బులు తీసుకొని చెప్పిన దాన్నే,తీసిన దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పే రచయితల కన్నా మంచి కథ తయారవుతుంది.

8.కాబట్టి నిర్మాతలూ కొంచెం పెట్టెలో నుంచి బయటకు వచ్చి ఆలోచించండి(out of the box thinking).ఖర్చు తగ్గుతుంది.