రేపటినుండీ బల్గేరియాలో జరిగే మ్యాచ్ లో ప్రపంచ చదరంగం చాంపియన్షిప్ కోసం వాసెలిన్ టొపలోవ్ తో మన విశ్వనాధన్ ఆనంద్ పోటీ పడబోతున్నాడు.ఇప్పటికి చదరంగం లోని అన్ని రకాల ఫార్మాట్ లలో ప్రపంచ చాంపియన్షిప్ గెలిచిన ఆనంద్ కి ఇది చాలా గట్టి పరీక్ష.టొపలోవ్ ఇప్పుడు అద్భుత ఫాం లో ఉన్నాడు.దానికి తోడు ఐస్ ల్యాండ్ అగ్నిపర్వతం పుణ్యమా అని ఆనంద్ బల్గేరియా చేరుకోవడానికి నలభై గంటలు రోడ్డు ద్వారా ప్రయాణీంచి శారీరకంగా అలసిపోయి ఉన్నాడు.మ్యాచ్ ఒక రోజు వాయిదా పడడం ఒకటే అతనికి కొద్దిగా ఊరటనిచ్చే అంశం.
ఈ దశాబ్ధంలో చదరంగాన్ని తనదైన శైలిలో పాలించిన ఆటగాడు ఆనంద్.ఈ క్రీడపైన ఉక్కు పట్టు ఉన్న రష్యన్ లను తోసిరాజని తన ముద్రని వేశాడీ లైట్నింగ్ కిడ్.చదరంగం లో ఆల్ టైం గ్రేట్ అని చెప్పబడ్డ గ్యారీ కాస్పరోవ్ పైన మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా ఎవరూ కాదనలేని గుర్తింపు తెచ్చుకొన్నాడు.
చదరంగం పుట్టినిల్లయిన భారతదేశంలో ఈ క్రీడకు ఒక గుర్తింపు తీసుకురావడానికీ,హరిక్రిష్ణ,హంపి,హారిక,శశికిరణ్ లాంటి అనేకమంది గ్రాండ్ మాష్టర్లు తయారు కావడానికీ ఆనంద్ కారణం అన్నది కాదనలెని సత్యం.
ఇప్పుడు జరిగే ఈ మ్యాచ్ లో ఆనంద్ మరోసారి విజయం సాధించి తన ఆధిపత్యాన్ని చాటాలని నా బ్లాగు తరఫునా కూడలి,హారం,జల్లెడ,మాలిక సభ్యుల తరఫునా ఆశిస్తున్నాను.
2 comments:
I too wish the same.
Thanks.
Post a Comment