నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, April 13, 2010

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఇలా కూడా ఉపయోగపడుతోంది

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏ విధంగా దుర్వినియోగం అవుతోందో లోగడ ఇక్కడే జాజిమల్లి గారు ఒక పోస్టులో రాశారు.
jajimalli.wordpress.com/2010/04/13/sc-st-atrocity/

అదే విషయమై నేను మరొక ఉదహరణ ఇక్కడ ప్రస్తావించదలచి రాస్తున్న పోస్టు ఇది.ఇందులొ డాక్టరు నాకు కజిన్. చిన్నప్పటినుంచి నాతో కలిసి చదివి వాడి కున్న తెలివితేటల మూలంగా డాక్టరై ప్రస్తుతం ఒక జిల్లా కేంద్రంలో ఎముకలకు ప్లేట్లూ స్పూనులూ గట్రా బిగిస్తూ బిజీగా ఉంటున్న వాడు.పేరూ, ఊరూ అప్రస్తుతం.
విషయమెమిటంటే ఒక యువకుడు మావాడి దగ్గరకి చేతిలో ఉన్న రెండు ఎముకలు విరిగి చికిత్స నిమిత్తం వచ్చాడు. ఏక్స్ రేలూ అవీ చూసి ఆపరేషన్ చేయాలని నిర్ణయించాడు. బేరాలూ సారాలూ పూర్తయి ఒక రేటు కుదిరించుకొని ఆపరేషన్ చేశాడు మావాడు.మూడు నెలల్లో ఎముకలు బాగా అతుక్కొని సదరు పేషంటు తన వృత్తి అయిన ఆటో ద్రైవింగ్ మొదలు పెట్టాడు. తరువాత మూడు నెలలకు అతడికి అదే చేతిలో మరొక సమస్య వచ్చి అదే వూళ్ళో మరొక డాక్టర్ని కలిశాడు. ఆయన ఆ చేతికి పాతిక వేలు బిల్లుతో ఆపరేషన్ చేసి డిస్చార్జి చేసే సమయంలో నీకు ఇంతకు ముందు ఆపరేషన్ సరిగ్గా చేయకపోవడం వల్లనే ఈ సమస్య వచ్చిందని ఒక మాట చల్లగా చెవిలో చేసి పంపించాడు.

దాంతో ఆ పేషంటు తాలూకూ నలుగురు మనుష్యులు ఒక రోజు మా వాడిని వాడి చాంబర్లో కలిశారు.దరిమిలా జరిగిన సంభాషణ ఇంచుమించుగా ఇదీ:

“నమస్తే!నా పేరు **** మాదిగ.ఈయన -----ఏదో మాదిగ.మీరు మా వాడికి ఆపరేషన్ చేశారు.అది సరిగ్గా చేయకపోవడం వల్ల మళ్ళీ ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది.అందుకు వాడికి ముప్పై వేల దాకా ఖర్చయ్యింది.ఇందుకు మీరేమంటారు?”

“ఎవరు చెప్పారు మీకలాగని?”

“వీడికి ఆపరేషన్ చేసిన డాక్టరు.”

“అది తప్పు.ఆయన పొరబడ్డారు.ఆపరేషన్ సరిగ్గా చేసి ఉండక పోతే మూడు నెలలు మీవాడు ఆటో తోలగలిగేవాడా?”

“అవన్నీ అనవసరం.మీ వల్ల వీడికి ముప్పై వేలు ఖర్చయ్యింది.అది మీరు ఒప్పుకోవాలి.”

“చాలా పొరబాటు.ఆపరేషన్ చేశాక తీసిన ఎక్స్ రేలు మీదగ్గరే ఉన్నాయి.వాటిని ఎవరైనా అనుభవం ఉన్న డాక్టరు దగ్గర చూపించండి.ఆయన ఆపరేషన్ చేయడంలో తప్పుందని అంటే అప్పుడు నేను ఒప్పుకొంటాను.”

“ఎవరినో అడగాల్సిన ఖర్మ మాకేమిటి.మీరు ఈ ముప్పై వేలు మా వాడికి కట్టాల్సిందే.”

“అలా కుదరదు.డాక్టరు తప్పు చేస్తే కేసు పెట్టడానికి ఒక కోర్టు ఉంది.అందులో కేసు పెట్టుకోండి.వాళ్ళు పరిహారం కట్టమంటే అప్పుడు కడతాను.”

“కేసు పెట్టాలంటే మాకు ఈ కేసే అక్ఖర్లేదు.చాలా చట్టాలున్నాయి మాకు కేసులు పెట్టడానికి.మర్యాదగా డబ్బులు కడితే నీకే మంచిది.లేకుంటే కోర్టు చుట్టూ తిరగడానికే నీ టైమంతా సరిపోతుంది.ప్రాక్టీసు మూసుకొని నెత్తిన గుడ్డేసుకొని పోతావు.”


ఇదీ సంగతి.

దీనికి ముగింపేమిటంటే మావాడు అదే సంఘంలో ఇంకొంచెం పై స్థాయి నాయకుడికి అయిదు వేలు ఎర వేయడంతో అందరు నాయకులూ ఈ కేసు నుంచి మాయమై పోయారు. ఆ పేషంటు మళ్ళీ మావాడికి కనిపించలేదు.ఆ పేషంటుకి వాడు నమ్ముకొన్న నాయకులు కూడా కనిపించి ఉండరనుకోండి.అది వేరే విషయం.కాకపోతే మా వాడికి ఆ పేషంటు దగ్గర సంపాదించిన దానిలో కొంచెం ఖర్చయ్యింది.ఆ ఖర్చు తదుపరి వచ్చే పేషంటు ఎవడో వాడిపైన పడి ఉంటుంది.

2 comments:

Anonymous said...

మీరెన్నైనా చెప్పండి, బ్లాగుల్లో చెత్త రాసి, విమర్శకులను బెదిరించడానికి 'కత్తి ' లాంటి చట్టాలు వుండాల్సిందే! ఆ చట్టాలు తీయడమంటే, వాటి మీద పడి పొట్టపోసుకుంటున్న కొందరి కడుపుమీద తన్నడమే! :P

kvsv said...

మాకు గత 3 నేల్లెల్లో 2 అనుభవాలు..తర్వాత విశదీకరిస్తా...ఐనా మట్టుకు చట్టం వుండాల్సిందే..ఇంకో విష్యం ఏమంటే నిజమైన బాడితులకు[ sc ఎస్టి లకు] ఏ చట్టాలూ రక్షించడం లేదు.ఏ దుండుకునే నాయకులూ అండగా నిలబడ్డం లేదు..