నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, April 20, 2010

అన్ని సెల్ ఫోన్లకూ ఒకే రకమైన చార్జర్ ఉండాలి

సెల్ ఫొన్ అనేది కర్ణుది కవచ కుండలాల్లాగా మన శరీరంలో నిత్య జీవితంలో అంతర్లీనమై పోయిందనేది ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పని లేదు.ఒక కుటుంబంలో నలుగురు ఉంటే నాలుగు ఫోన్లు పట్టుకొని ఎవరికి వాళ్ళు సెల్ లొ మాట్లాడుతూ ఉంటారు కానీ ఒకరితొ ఒకరు మాట్లాడరు.ఇది కూడా పాత విషయమె, కొత్తగ నేను రాయాల్సిన పని లేదు.
i8000 Omnia IIi7500 Galaxy
ఈ పోస్టులో నేను చెప్పాలనుకొన్నదేమిటంటే సెల్ చార్జర్ల గురించి.ప్రతి కంపెనీకి ఒక్కో రకం చార్జర్ ఉంటుంది.ఒకప్పుడంటే రెండో మూడో కంపెనీలుండేవి.కానీ ఇప్పుడు రోజుకో కంపెనీ పుట్టుకొస్తోంది.ఇది ఒకందుకు మంచిదె.అన్ని ఫీచర్లూ ఉన్న హ్యాండ్ సెట్ ఇప్పుడు తక్కువ ధరకే దొరుకుతోంది.

ఒక కుటుంబంలో నలుగురు సభ్యులు ఉండి ఏదైన టూరుకో ఊరుకో వెళితే వారికి నాలుగు కంపెనీల హ్యాండ్ సెట్లు ఉంటే నలుగురూ నాలుగు చార్జర్లు మోసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది.ఇలా కాకుండా అన్ని కంపెనీలు ఒకె రకం చార్జర్ వాడితే బంధువుల్ ఉఊళ్ళకో స్నేహితుల ఇళ్ళకో వెళ్ళినప్పుడు వెంట చార్జర్ని మోసుకుపోవాల్సిన అవసరం లేకుండా పోతుంది.హ్యాండ్ సెట్స్ తయారు చేసే కంపెనీలు ఈ విషయమై మనసు పెడితె బావుంటుంది.

7 comments:

రవిచంద్ర said...

మంచి ఆలోచన.

మంచు పల్లకీ said...

హ్మ్మ్.. ఇది అంత ఈజీ కాదు.. అట్లేస్ట్ ఒకే కంపనీలొ అన్ని మోడల్స్ కి ఒకే చార్జెర్ అంటే సాద్యమవచ్చు..

Anonymous said...

మీ ఆలోచన వలన మొబైల్ కంపెనీల వ్యాపారం దెబ్బతింటుంది . అందువలన వాళ్ళు మీ ఆలోచనను పట్టించుకోరు . ఒకవేల పట్టించుకుంటె వినియోగదారుడు నక్కతోక తొక్కినట్టే

Anonymous said...

There is already a big movement towards this effort. They are trying to make "Micro USB" as universal interface for all cell phones. It might take couple of years before it becomes reality. This will reduce a significant amount of electronic waste.

Nrahamthulla said...

భవిష్యత్తులో తయారయ్యే అన్ని కంపెనీల మొబైల్ ఫోన్లకు మోడల్‌తో సంబంధంలేకుండా ఒకే ఛార్జర్‌తో ఛార్జింగ్ చేసే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ కొత్త యూనివర్సల్ ఛార్జింగ్ సొల్యూషన్(యూసీఎస్)తో ప్రపంచంలో ఏ ఛార్జర్‌తోనైనా సెల్‌ఫోన్ ఛార్జింగ్ చేసుకొనే వీలుకలుగుతుంది. ఛార్జింగ్‌కు అయ్యే విద్యుత్తు పరిమాణం కూడా తగ్గుతుంది.(ఈనాడు25.10.2009)

పానీపూరి123 said...

ప్రస్తుతం నోకియా, సాంసంగ్ లలో కొన్ని మోడల్స్‌కు ఒకే చార్జర్ వాడొచ్చు

Anonymous said...

Nice idea.

we suggested this in one of the conference conducted by LG.