నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Saturday, April 17, 2010

యువరాజ్ సింగ్ నీకేమన్నా మెంటలా?

ధర్మశాలలో డెక్కన్ చార్జర్స్ పంజాబ్ కింగ్స్ కి మధ్య జరిగిన మ్యాచ్ చార్జర్స్ కి చావో రేవో లాంటిది.పంజాబ్ కి వచ్చేది కానీ పొయ్యేది కానీ ఎమీ లేదు.అలాంటి డెడ్ మ్యాచ్ లలో కేవలం వ్యక్తిగత మైలు రాళ్ళే ఆటగాళ్ళకి మోటివేషన్.నిన్న మ్యాచ్ లో జయవర్ధనే అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు.ట్వంటీ ట్వంటీ అంటే గుడ్డిగా బంతిని బాది పారేయడమే కాదు.కళాత్మకంగ కూడా ఆడి వేగంగా పరుగులు చేయవచ్చునని నిరూపించాడు జయవర్ధనే.ముఖ్యంగా ఆర్పీ సింగ్ వేసిన ఒక ఓవర్లో అతడు కొట్టిన అయిదూ బౌండరీలూ ఒక్కోటి ఒక్కో రత్నం.అన్నీ షాట్లు కూడా సున్నితమైన టెక్నిక్ తో సాధించినవే గానీ గుడ్డి బాదుడుతో వచ్చినవి కాదు.

అలాంటి ఇన్నింగ్స్ చివరి మూడు బంతులు మిగిలి ఉండగ జయ 93 పరుగుల వద్ద ఉన్నడు.ఆ బంతిని ఫీల్డర్ ఆపడంతో నాన్ స్ట్రైకింగ్ ఎండ్ చేరుకొన్నాడు.రెండు బంతులు మిగిలి ఉండగా యువరాజ్ గాల్లోకి లేపిన బంతిని క్యాచ్ పట్టుకొన్నాడు డెక్కన్ ఫీల్డర్.అంత పైకి లేచిన బంతిని క్యాచ్ చేసేలోగా సాధారణంగా బ్యాట్స్ మెన్ పిచ్ క్రాస్ చేసి నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న బ్యాట్స్ మన్ స్ట్రైకింగ్ కి వస్తాడు.కానీ అనూహ్యంగా యువరాజ్ పిచ్ క్రాస్ చేయలేదు.

ఒక బంతిలో జయవర్ధనే ఏడు పరుగులు చేస్తాడని కాదు,కానీ ఎవరు చూడొచ్చారు.బౌలర్ నోబాల్ వేయవచ్చు లెదా ఇంకేమైనా జరగొచ్చు. అంతర్జాతీయ క్రికెట్ లో అపార అనుభవం ఉన్న క్రికెటర్ యువరాజ్.అంతే కాకుండా కొంచెం మెదడు కూడా ఉన్న వాడు.ఇలాంటి సిల్లీ మిస్టేక్ చేయడాన్ని అభిమానులు,నేనూ అందులో ఒకడ్ని,తేలిగ్గా తీసుకోలేకపోతున్నారు.

No comments: