నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, April 23, 2010

మావోయిష్టు అన్నలూ మీకోసం కొన్ని టార్గెట్లు

అన్నలారా ముందుగా మీకు లాల్ సలాం.నా జీవితంలో ఇంత వరకూ నేను నక్సలైటు అన్న వాడిని చూడలేదు.టీవీలో నారాయణ మూర్తి సినిమాలలో విన్నదే ఈ లాల్ సలాం అన్న పదం.నాకు మీమీద ద్వేషమూ ఆరాధనా ఏమీ లేవు.మిమ్మల్ని ఎన్ కౌంటరులో చంపినా మీరు పోలీసులని ఆంబుష్ లో చంపినా అయ్యో అనుకోవడం తప్ప అంతకు మించి మీ ఉద్యమంలో కానీ మిమ్మల్ని అణచివేసే కార్యక్రమంలో కానీ నాకు ఎటువంటి ఆసక్తీ లేదు.

కాని మొన్న దంతేవాడలో మీరు జరిపిన మారణహోమం చూసి కొంత బాధ కలిగింది.మిమ్మల్ని పోలీసులు చంపటం, మీరు వాళ్ళని చంపటం మీ మీ స్వభావం.అవి రెండూ చేయకపోతే అది ప్రకృతి విరుద్ధం అవుతుంది.కానీ అంత మంది మాములూ సాదా సీదా ఉద్యోగస్తులని చంపదం అయ్యో అనిపించింది.అలా అని మీరు చంపడం మానేస్తె అదీ బావుండదు.మీకు ప్రాక్టిసు లేకుండా పోతుంది,మీడియాకు,మిమ్మల్ని పొగిడే లేదా తెగిడే వాళ్ళకూ పనీ పాటా లేకుండా పోతుంది.కాబట్టి మీకూ కొంత టార్గెట్ ప్రాక్టీసు కావాలికదా!
ఎవరూ మిమ్మల్ని విమర్శించకుండా పైపెచ్చు బాహాటంగానో లెక లోలోపలో పొగిడే విధంగ కొన్ని టార్గెట్లు సూచిస్తున్నాను.వీటిపైన ఎయిం చేయండి.

కోటానుకోట్లు దిగమింగే రాజకీయ బకాసురులు.మీరు వీళ్ళ పని పడితే మీకు చాలామంది అభిమానులు ఏర్పడుతారు.మీమీద అభిమాన సంఘాలు ఏర్పడ్డా అశ్చర్యం లెదు.
జనాన్ని పీల్చుకు తింటున్న అవినీతిపరులు.వీళ్ళ పైన చెయ్యి వేస్తే మికు తోడుగా ఎన్నొ వేల చేతులు కలుస్తాయి.

సమాజాన్ని దోచుకుతింటున్న బడా కాంట్రాక్టర్లూ,భూబకాసురులూ, అమాయకురాళ్ళని వేశ్యా గృహాలకు తరలించె దొంగ లం--కొడుకులూ ...ఇలా ఎందరో ఉన్నారు.

వీళ్ళని టార్గెట్ చేయండి.దేశంలో కొన్ని వేలమంది తమ పూజాగృహాల్లో దేవుడి ఫోటోలు తీసివేసి మీ బొమ్మలు పెట్టుకుంటారు.

6 comments:

Anonymous said...

మీరు వీళ్లకు కొత్త టార్గెట్లు ఇవ్వక్కర్లేదు, ప్రబుత్వంతో చర్చలు జరిగినప్పుడు వీళ్ల మీద ఇంకా నమ్మకం చావని వాళ్లు, ప్రబుత్వం మీద నమ్మకం పోయిన సామాన్యులు చాలా మంది వినతి పత్రాలు (బస్తాల కొద్దీ) ఇచ్చారు, వాటినన్నిటిని మూటలు కట్టుకొని పోతూ, అన్నలు ఎదో పీకుతాం అని కూడా చెప్పారు!! వాటిలో కనీసం ఒకటి అంటే ఒకటి కూడా పట్టించుకొని ఉండరు, ఎందుకంటే ఆ సమస్యలు తీరిస్తే లాభాలు రావు కదా?

అంతెందుకు వీళ్లు హైదరాబాద్ లో ఉన్నప్పుడే వేలమందిని ముంచిన చార్మినార్ బాంక్ డైరెక్టర్లకు ఓ ఫోను చేయండి సాములూ వీధిన బడిన మా బతుకు బాగు చేసిన వాళ్లు అవుతారు అని అందులో డిపాజిట్లు చేసి మునిగిన వాళ్లు పదే పదే బతిమాలితే, వీళ్లు పొడిచింది ఏమిటి అనుకొన్నారు? ఆ డైరెక్టర్లో తో బేరం పెట్టుకొన్నారట. అదీ వీళ్లు మధ్యతరగతి సామాన్యులకు చేసే సహాయం. ఇంక రాజకీయనాయకుల జోలికి, వాళ్ల సంతానం జోలికి, అవనీతి అధికారులు జోలికి ఎందుకు వెళతారు? వెళ్లినా వాళ్ల దందా వసూలు చేసుకోవటానికి మాత్రమే!!!

ఎప్పుడో వీళ్ల ఉనికికే ప్రమాదం వస్తుందంటేనో, లేక మామూళ్లు రావటం తగ్గుతేనో, ఎప్పుడో పొరపాటున, గెడ్డం బాబు మీదో, ధనార్జన రెడ్డి మీదో ఓ ప్రయోగం చేస్తారు అంతే.

నల్లమల అడవులలో చెంచులు ఆకలితో అలమటిస్తూఉంటే వీళ్ల డంప్ లలో దొరికినవి నల్లమలలోనే కేవలం ఓ పదికిలోల బంగారం, కొన్ని కోట్ల రూపాయలు మాత్రమే. వీళ్ల నిబద్దత ఎంతో మీకు ఇప్పటికే అర్ధం కాకపోతే, మార్థాండ తో మీకు ప్రైవేట్ చెప్పించాల్సిందే :)

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

కొంచెం నిబద్ధతతో బతకండిరా బాబులూ అని నా పోస్టు వెనక ఉద్ధేశ్యం.

Anonymous said...

కొంచెం నిబద్ధతతో బతకండిరా బాబులూ అని నా పోస్టు వెనక ఉద్ధేశ్యం.

konchem chaalaa? poorti vaddaa? Marx konchemunTE chaalannaaDaa?

Maoists are thugs, extortion is their whole & sole business. Your call for Maoists shows yout ignorant innocense.

చెరసాల శర్మ said...

వరల్డ్ బ్యాంక్ కంటే పెద్ద దొంగ ఎవరు?

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఎనోనిమస్సు నీది అవేశపూరిత అమాయకత్వం.రెండూ ఒకటే.ప్రజలలో మావొయిష్టులకు మద్ధతు లేకుంటే వాళ్ళు ఇంతకాలం మనగలిగి వుండేవారా?నేను రాసిన క్యాటగిరిల జనాన్ని వాళ్ళు టార్గెట్ చేస్తే వాళ్ళ ఇమేజ్ అమాంతం పెరిగి పోదా?

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

శర్మ గారూ మీరు కరెక్ట్.